Take a fresh look at your lifestyle.

ఉద్యోగినులకు స్థయిర్యాన్ని కలిగించే తీర్పు

జర్నలిస్టు ప్రియమణి కేసులో ఢిల్లీ కోర్టు ఇచ్చిన తీర్పు పని చేసే ప్రదేశాల్లో వేధింపులకు గురి అవుతున్న మహిళలకు ఊరట నిచ్చే అంశం. బాస్‌ ఎం‌త పెద్దవారైనా వారిపై ఆరోపణలు చేసేందుకు ఉద్యోగినులకు స్థయిర్యాన్ని ఇచ్చే తీర్పు ఇది. మహిళలు పని చేసే ప్రదేశాల్లో ఎదుర్కొంటున్న సమస్యలను గురించి వివరిస్తే పెద్ద గ్రంథం అవుతుంది. దీనికి వ్యవస్థ లోపమని తిట్టుకుంటూ చాలా మంది ఉద్యోగినులు మిన్నకుంటున్నారు. కొందరు తమ బాధలను సాటివారికి చెప్పుకుని గుండె భారాన్ని తగ్గించుకుంటున్నారు. ఈ కేసులో ఎంజె అక్బర్‌ ‌సీనియర్‌ ‌జర్నలిస్టు మాత్రమే కాకుండా పత్రికా సంపాదకుడు.

కాలమిస్టు. ఆయన ఇరవై ఏళ్ళ క్రితం తనను వేధించారంటూ ప్రియమణి అనే జర్నలిస్టు ఏడాది క్రితం ఆరోపించారు.ఆమె మాదిరిగా చాలా మంది ఇదే మాదిరి ఆరోపణలు చేసినా అక్బర్‌ ‌పట్టించుకోలేదు. తన హోదానీ, ప్రతిష్ఠనూ దెబ్బతీయడం కోసం ప్రియమణి ఈ ఆరోపమ చేస్తున్నారంటూ ఆమెపై కేసు వేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు బాధితురాలి ఆరోపణలను పరిగణనలోకి తీసుకోవడానికి ఎప్పుడు జరిగిందనేది ప్రధానం కాదని స్పష్టం చేశారు. అంతేకాక, అక్బర్‌ ‌కేసును కొట్టివేశారు. దీంతో దేశంలో మహిళా సంఘాలు హర్షాతి రేకం వ్యక్తం చేస్తున్నాయి. మూడేళ్ళ క్రితం మీటూ ఉద్యమం సాగినప్పుడు కొంతమంది నిరాధారమైన ఆరోపణలు చేసినట్టు కొందరు పెద్దలు వాపోయారు.

అలాంటి ఘటనలూ ఉన్నాయి. కానీ, పని చేసే ప్రదేశాల్లో మహిళా ఉద్యోగినుల వేధింపుల గురించి కోర్టులు పలు సందర్భాల్లో వివిధ కేసుల్లో ఇచ్చిన తీర్పులను ఆధారం చేసుకుని ఢిల్లీ కోర్టు తీర్పు ఇచ్చింది. పని చేసే ప్రదేశాల్లో మహిళా ఉద్యోగినులు, అధికారిణులకు భద్రత కల్పించాలని సర్వోన్నత న్యాయస్థానం చాలా సందర్భాల్లో స్పష్టం చేసింది. అయితే, ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా ఆ ఆదేశాలు అమలు కావడం లేదు. హైదరాబాద్‌ ‌లో పట్టపగలు మహిళా లాయర్‌ ‌నీ,ఆమె భర్తనీ హత్య చేసిన దుండగుల పేర్లను లాయర్‌ ‌వామనరావు మరణ వాంగ్మూలం ఇచ్చిన తర్వాత కూడా వారిని అరెస్టు చేయడానికి పోలీసులకు చాలా సమయం పట్టింది. పైగా ఇది స్థానికంగా స్థలం గొడవని తేల్చేశారు. అలాంటిది పేరు, పలుకుబడి ఉన్న యజమానులు, పై అధికారులు తమపై వేధింపులకు పాల్పడితే మహిళా ఉద్యోగినులు,అధికారిణులు నిస్సహాయ స్థితిలో ఉండి పోతున్నారు. మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ‌రంజన్‌ ‌గొగొయ్‌ ‌పై ఇలాంటి ఆరోపణలే వొస్తే , ఆయన చేపట్టిన కేసులు వివాదాస్పదమైనవి కనుక, ఆయనపై గిట్టని వారు కుట్ర చేశారని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీలు తేల్చేశాయి.

అందువల్ల మహిళలు తమ హక్కుల గురించి, ప్రివిలేజెస్‌ ‌గురించి గతంలో కన్నా ఇప్పుడు బాగా తెలుసుకుంటున్నప్పటికీ న్యాయస్థానాల్లో వారికి తగిన న్యాయం జరగడం లేదు.ఈ నేపద్యం నుంచి చూస్తే ప్రియారమణి కేసులో ఢిల్లీ కోర్టు ఇచ్చిన తీర్పు ముమ్మాటికీ మహిళా ఉద్యోగినుల ఆత్మస్థయిర్యాన్ని పెంచేదే. సమాజంలో ఇంకా కొనసాగుతున్న కట్టుబాట్లు, సామాజిక హోదా, పదవులు, ప్రతిష్ఠ వంటి అంశాల కారణంగా మహిళా ఉద్యోగినులు తమ గోడు వెళ్ళబోసుకోలేకపోతున్నారు. ఒక వేళ బయటపడితే కుటుంబ గౌరవం పోతుందనో, ఉద్యోగానికి హాని కలుగుతుందనో జంకుతున్నారు.ఇలాంటి పరిస్థితుల్లో చాలా మంది మౌనంగానే మూగవేదనను అనుభవిస్తున్నారు.

ఇలాంటి వారందరికీ ప్రియమణి ఆదర్శంగా నిలిచారనడం అత్యుక్తి కాదు. అందుకే, ఆమెను మహిళా సంఘాల వారూ,మహిళల హక్కుల ఉద్యమకారులూ అభినందిస్తున్నారు. మహిళలు ఇప్పుడు గతంలో కన్నా నిర్భయంగా మాట్లాడగలుగుతున్నారు, తమ హక్కుల కోసం పోరాటం చేస్తున్నారు. కానీ, పని చేసే ప్రదేశాల్లో ఇలాంటివి జరుగుతున్నా నోరు మెదపలేనివారు ఇంకా ఎంతో మంది ఉన్నారు. మహిళలకు ఉద్యోగావకాశాలు కల్పించామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వాలు, పని చేసే ప్రదేశాల్లో వారికి భద్రత కల్పించడం లేదు. ఈ విషయంలో పైవారి నుంచి వొచ్చే ఒత్తిడుల కారణంగా మిన్నకుంటున్నారు. పని చేసే ప్రదేశాల్లో మహిళలను తాకడానికి ప్రయత్నించే సన్నివేశాలను చలనచిత్రాల్లో చూపుతున్నారు. అదేదో హాస్యస్పోరకమైన సన్నివేశమనే భావన కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాగే, డైలీ సీరియల్స్ ‌లోనూ ఇలాంటివి చాలా తారస పడుతున్నాయి.

వీటని చూసే పని చేసే ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధిపులకు పాల్పడుతున్నారు. అయితే, సామాజిక మాధ్యమాలను అడ్డుపెట్టుకుని పై అధికారుల నుంచి సాయం పొందేందుకు ఆరోపణలు చేసేవారు అరకొరగా ఉండవచ్చు. కానీ, ఉద్యోగినుల్లో చాలా మంది మధ్యతరగతి కట్టుబాట్లలో పెరిగిన వారే కనుక, అలాంటివారు చాలా తక్కువ మంది ఉంటారు. ప్రియారమణి జర్నలిస్టు కనుక ఆమెకు ప్రశ్నించే అలవాటు సహజంగానే ఉండి ఉండవచ్చు.అలాగే, ఇలాంటి సంఘటనల గురించి వార్తలు సేకరించిన దృష్ట్యా తన కలాన్ని ఆయుధంగా ఉపయోగించుకుని ఇలాంటి పెడధోరణులను అంతమొందించాలన్న పట్టుదలతో ఉండి ఉండవచ్చు.

women who are being harassed in the workplace

అంతేకాకుండా,ఇందుకు తగిన సమయాన్ని కేటాయించేందుకు అవకాశం ఉండి ఉండవచ్చు.ఇలాంటి వెసులుబాటు లేని వారు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో మిన్నకుండి పోతున్నారు. అలాంటి వారు మహిళా హక్కుల సంఘాలను సంప్రదించి తమకు అన్యాయాలపై పోరాడాలని ముంబాయికి చెందిన హక్కుల ఉద్యమకారిణి వీణాగౌడ్‌ ‌పిలుపు ఇచ్చారు. ఆమె ఇలాంటి కేసులపై కోర్టుల్లో కేసులు వేసి అభాగినుల పక్షాన పోరాడుతున్నారట .ఇది ఒక ఆరంభం మాత్రమేననీ,ఇలాంటి ఘటనలపై మహిళా ఉద్యోగినులు ధైర్యంగా ముందుకు రావాలని ఆమె పిలుపు ఇచ్చారు.

Leave a Reply