Take a fresh look at your lifestyle.

మంత్రి హరీష్‌ ‌రావు చొరవతో… జూడాల ఆందోళన విరమణ

పీజీ ఇన్‌ ‌సర్వీస్‌ ‌కోటా పెంచబోమని హామీ
పీజీ మెడికల్‌ ‌సీట్ల కేటాయింపులో ఇన్‌ ‌సర్వీసు వైద్యులకు ప్రత్యేక రిజర్వేషన్‌ ‌కల్పిస్తూ విడుదల చేసిన జీవో 155కు వ్యతిరేకంగా జూనియర్‌ ‌డాక్టర్లు గత ఐదు రోజులుగా నిర్వహిస్తున్న ఆందోళనను విరమించారు. ఈ జీవోను అమలు చేస్తే తాము నష్టపోవాల్సి వొస్తుందనీ ప్రభుత్వం వెంటనే ఈ జీవోను వెనక్కి తీసుకోవాలన్న డిమాండ్‌తో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన బాట పట్టారు. దీంతో మెడికల్‌ ‌కళాశాలలతో పాటు పెద్ద ప్రభుత్వ దవాఖానాలలో వైద్య సేవలకు ఇబ్బంది ఏర్పడింది. జూడాల ఆందోళన విరమించే ప్రయత్నంలో భాగంగా గురువారం డీఎంఈ రమేశ్‌ ‌రెడ్డి జూడాల సంఘం ప్రతినిధులతో చర్చలు జరిపినప్పటికీ అవి ఫలించలేదు. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌ ‌రావు జీవో 155 నిలుపుదలపై స్పష్టమైన హామీ ఇస్తేనే తాము ఆందోళన విరమిస్తామని జూడాలు స్పష్టం చేశారు.

ఈ నేపథ్యంలో జూడాల సంఘం ప్రతినిధులు శుక్రవారం మధ్యాహ్నం మంత్రి చాంబర్‌కు వెళ్లి జీవో 155 అమలు చేస్తే తమకు కలిగే నష్టాలను వినతిపత్రం రూపంలో వివరించి దానిని వెంటనే ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీనికి మంత్రి హరీష్‌రావు సానుకూలంగా స్పందించారు. భవిష్యత్తులో జీవో 155 కారణంగా జూడాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తాననీ, ఆ దిశగా చర్యలు వెంటనే ప్రారంభిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు. దీంతో పాటు ఇన్‌సర్వీస్‌ ‌కోటాను పెంచకుండా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మంత్రి హరీష్‌ ‌రావు తమ సమస్యను సానుకూల ధృక్పథంత• పరిశీలించి సమస్యను పరిష్కరించే దిశగా చొరవ చూపడంతో శనివారం నుంచి నిర్వహించ తలపెట్టిన సమ్మెను తాత్కాలికంగా విరమిస్తున్నామనీ, యథావిధిగా విధులకు హాజరవుతామని జూడాల సంఘం ప్రతినిధులు స్పష్టం చేశారు.

Leave a Reply