Take a fresh look at your lifestyle.

ఆం‌దోళన విరమించిన ‘జూడా’లు

ఆం‌దోళన విరమించిన ‘జూడా’లు

కెసిఆర్‌ ‌సూచనతో తిరిగి విధుల్లోకి

హైదరాబాద్‌,‌మే 27: జూనియర్‌ ‌డాక్టర్లు ఆందోళన విరమించారు. ప్రజారోగ్యం కోసం ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రకటించారు. అన్ని డిమాండ్లు నేరవేరక పోయినా, సీఎం కేసీఆర్‌ ‌నుంచి వచ్చిన సానుకూల స్పందనతో ఆందోళన విరమిస్తున్నామని జూడాలు తెలిపారు. ఓవైపు కొరోనా సెకండ్‌వేవ్‌ ‌విజృంభణ కొనసాగుతుండగా.. జూనియర్‌ ‌డాక్టర్లు తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ బుధవారం సమ్మెకు దిగారు. ఎమ్జన్సీ సేవలు మినహా కొరోనా యేతర విధులను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. గాంధీ ఆస్పత్రి, ఉస్మానియా మెడికల్‌ ‌కాలేజీ, ఉస్మానియా హాస్పిటల్‌, ‌టిమ్స్, ఎంఎన్‌జే, నిలోఫర్‌, ‌కింగ్‌కోఠి, ఎర్రగడ్డలోని ఛాతీ హాస్పిటల్స్ ‌ల్లో జూనియర్‌ ‌డాక్టర్లు సమ్మె నిర్వహించారు.
హెల్త్ ‌సెక్రటరీతో జూడాల చర్చలు
హెల్త్   ‌సెక్రటరీతో జూడాల చర్చలు ముగిశాయి. అనంతరం జూడాలు వి•డియాతో మాట్లాడుతూ కొన్ని విషయాలపై సానుకూలంగా స్పందించారని తెలిపారు. నిమ్స్ ‌బెడ్స్ ‌విషయంలో సానుకూలంగా స్పందించారని, జీవో విడుదలకు 3 రోజులు పడుతుందని చెప్పారని తెలిపారు. పరిహారం విషయంలో టెక్నికల్‌ ‌సమస్య ఉందన్నారని, ఇప్పటికే కేంద్రం ఎక్స్‌గ్రేషియా వస్తుందని, మళ్లీ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవ్వాలంటే ఎలా అని అన్నారని జూడాలు పేర్కొన్నారు. ప్రజలకు ఇబ్బంది కలిగించాలని తమకు లేదని, అందుకే తాము ఎమ్జ్గ•న్సీ విధులను బహిష్కరించలేదని చెప్పారు. అందరినీ సంప్రదించి తమ విధివిధానాలు ప్రకటిస్తామని జూడాలు చెప్పారు.  విపత్కర వేళ ప్రభుత్వ వైద్యులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త వినిపించింది. సీనియర్‌ ‌రెసిడెంట్‌ ‌డాక్టర్ల గౌరవ వేతనాన్ని రూ. 70 వేల నుంచి రూ. 80,500లకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. పెరిగిన స్టైఫండ్‌ ఈ ఏడాది జనవరి 1వ తేదీ నుంచి అమలు కానున్నట్లు ప్రభుత్వం పేర్కొన్నది. దీంతో రెసిడెంట్‌ ‌డాక్టర్లు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply