Take a fresh look at your lifestyle.

‌విధేయతకే పట్టం

jp nadda modi and amirshah

అందరూ అనుకున్నట్లుగానే భారతీయ జనతాపార్టీ జాతీయ అధ్యక్షుడిగా జగత్‌ ‌ప్రకాష్‌ ‌నడ్డా ఎంపికైనారు. నడ్డా మొదటినుండీ ప్రధాని నరేంద్రమోదీకి విధేయుడు..! నిన్నటి వరకు ఆ స్థానంలో ఉన్న అమిత్‌షాకు నరేంద్రమోదీ జోడీ గురించి ఎలా చెప్పుకున్నారో, ఇప్పుడు మోదీ, నడ్డా జంటకూడా అలానే కొనసాగుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అమిత్‌షా అధ్యక్షుడిగా ఉన్నా మోదీ ఆలోచనమేరకే ఆయన కార్యక్రమాలు చేసుకుంటూ పోయినట్లుగానే ఇప్పుడు నడ్డాకూడా అదే విధే•యతను ప్రదర్శిస్తాడన్నది స్పష్టమవుతున్నది. అయితే చాలా కీలక సమయంలో నడ్డా పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాడు. వాస్తవంగా అధ్యక్షుడిగా అమిత్‌షా పదవీకాలం పూర్తికావడం, ఒకే వ్యక్తికి రెండు పదవులు ఉండకూడదన్న బిజెపి సిద్దాంతం ప్రకారం కొత్త అధ్యక్షుడి ఎంపిక అనివార్యమైంది. అయితే దేశరాజధాని ఢిల్లీ ఎన్నికల సమయంలో పదవీ బాధ్యతలు చేపట్టడం నడ్డాకు పరీక్షగా మారింది. అమిత్‌షా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన మొదట్లో చాలా దూకుడుగా ప్రపర్తించిన విషయం తెలియందికాదు. మొదట్లో అన్ని విజయాలే. అయితే ఆయనకు హోం మంత్రి పదవినికూడా కట్టబెట్టినప్పటినుండి విజయాలు కాస్తా తగ్గడం మొదలైంది. అందుకు పార్టీ కార్యక్రమాలకు ఎక్కువ సమయాన్ని కేటాయించే పరిస్థితి లేకపోవడం ఒక కారణంగా భావిస్తున్నారు. కొత్తగా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నడ్డాకూడా రాజకీయాలకు కొత్తవాడేమీకాదు. పార్టీలో చాలా సీనియర్‌ ‌కూడా. గతంలో మోడీ క్యాబినెట్‌లో మంత్రిగా పనిచేసిన అనుభవమున్నవ్యక్తి. అంతకుముందు హిమాచల్‌ ‌ప్రదేశ్‌లో మంత్రిగా కొనసాగిన వ్యక్తికూడా. అంతేకాకుండా అమిత్‌షాకు ఆయన అత్యంత సన్నిహితుడుకూడా. అలాగే వివిధ• రాష్ట్రాల్లో పార్టీలో అంతర్ఘత విబేధాలు పొడసూపకుండా సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించిన అనుభవంకూడా ఆయనకుంది. ఆ అనుభవాన్ని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో రంగరించి పార్టీకి విజయాన్ని చేకూరుస్తాడన్న నమ్మకంతోనే ఆయనకు ఆ పదవిని కట్టబెట్టినట్లు తెలుస్తున్నది.

ఢిల్లీ రాజకీయాల పట్ల పలువురు దృష్టిసారిస్తున్నారు. ఢిల్లీ శాసనసభపై కాషాయ జంఢాను ఎలాగైనా ఎగురవేయాలని బిజెపి ఉత్సాహంగా ఉంది. కాని, నామినేషన్ల గడువు ముగిసేనాటికి ఆ పార్టీ అన్ని స్థానాలకు తన అభ్యర్దులను నిలబెట్టలేకపోయింది. ఢిల్లీ శాసనసభలో డెబ్బై స్థానాలున్నాయి. ఇప్పటికే అధికారంలోఉన్న ఆమ్‌ ఆద్మీ పార్టీ అన్ని స్థానాలకు తమ అభ్యర్దులను ప్రకటించడంతోపాటుగా, ప్రచారంలో ముందుంది. వాస్తవానికి ఎన్నికల నోటిఫికేషన్‌ ‌రాకముందునుండే తమ పార్టీకి మరో అవకాశం ఇవ్వాల్సిందిగా ఆ పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్‌ ‌కేజ్రీవాల్‌ ‌వోటర్లను అభ్యర్ధిస్తున్నారు. తాను చేపట్టే కార్యక్రమాలకు కేంద్రం అడ్డవుతుండడంతో ఢిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్ర హోదానివ్వాలని కేజ్రీవాల్‌ ‌చాలా కాలంగా డిమాండ్‌ ‌చేస్తున్నాడు. బిజెపితో దినమొక గండంగా అయిదేళ్ళకాలం వెళ్ళదీసిన ఆయన ఇప్పుడు మరోసారి గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వొస్తున్నది. ఒక పక్క బిజెపిని ఎదుర్కోవడం, మరోపక్క స్వీయపార్టీలో ఎదురవుతున్న సమస్యలతో కేజ్రీవాల్‌ ‌సతమతమవుతున్నాడు. కొంతమందికి టికెట్లు రాకపోవడంతో వారు పార్టీకి దూరంగా ఉంటున్నారు. మరికొందరు పార్టీ మారడానికి సిద్దంగా ఉన్నారు. ఇదిలాఉంటే ఢిల్లీ పోలీసు వ్యవస్థ అంతా కేంద్రం ఆధీనంలో ఉండడంకూడా ఆయనకు చాలావరకు ఇబ్బందికరంగా మారింది.

కాగా, బిజెపి మొదటినుండీ కేజ్రీవాల్‌ ‌వెంట పడింది. కేజ్రీవాల్‌ ‌ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నది. మూడు మున్సిపల్‌ ‌కార్పొరేషన్‌లలో పట్టుఉన్న బిజెపి తమను గెలిపిస్తే ఢిల్లీ మరింత అభివృద్ధ్ది దిశగా పయనిస్తుందని విస్తృతంగా ప్రచారం చేస్తున్నది. ఎలాగైనా ఆప్‌ ‌పార్టీని అధికారంలోకి రాకుండా చూడాలని దాదాపు ఇరవై అయిదు మంది కేంద్రమంత్రులు ఢిల్లీలోనే మకాంవేసి ఈ ఎన్నికలను పర్వవేక్షిస్తున్నారు. ఢిల్లీలో ప్రభుత్వ భూములు భారీగా దురాక్రమణ జరుగుతున్నా కేజ్రీవాల్‌ ‌ప్రభుత్వం పట్టించుకోవడంలేదని, తమను అధికారంలోకి తీసుకువస్తే వాటికి తగిన రక్షణ ఏర్పడుతుందని బిజెపి ప్రచారంచేస్తున్నది. కాగా కాంగ్రెస్‌ ‌మాత్రం ప్రచారంలో వెనుక బడిపోయింది. కాంగ్రెస్‌ ‌పాలనలో ఢిల్లీ ఏవిధంగా అభివృద్ధ్ది జరిగిందని పాత సంగతులను ప్రజలముందుంచి వోట్లు అడిగే కార్యక్రమంలో ఆ పార్టీ ఉంది. కాగా, ఎన్నికలనగానే ఖర్చుతోకూడుకున్నది. అయితే ప్రత్యర్ధులతో పోటీ పడేందుకు తమవద్ద తగిన సొమ్ములేదని, చాలా మంది అభ్యర్ధ్దులు నిరాశకు గురైనట్లు తెలుస్తున్నది. ఇలాంటి పరిస్థితిలో నడ్డా కొత్తగా అధ్యక్ష పదవి బాధ్యతలు చేపట్టారు. ఆయన ఢిల్లీ రాజకీయాల్లో ఎలాంటి చక్రంతిప్పుతారోనని రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.

Leave a Reply