వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

బిజెపి జాతీయ అధ్యక్షుడిగా జెపి నడ్డా

January 20, 2020

JP Nadda as BJP national president Unanimously elected by party leaders
ఏకగ్రీవంగా ఎన్నుకున్న పార్టీ నేతలుఅమిత్‌ ‌షానుంచి బాధ్యతల స్వీకరణ

బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఆ పార్టీ సీనియర్‌ ‌నేత, జేపీ నడ్డా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అమిత్‌షా నుంచి ఆయన బాధ్యతలను స్వీకరించారు. ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పార్టీ సీనియర్‌ ‌నాయకులు, కేంద్ర మంత్రులు, పార్టీ అధికారంలో ఉన్న రాష్టాల్రకు చెందిన మంత్రులు పార్టీ జాతీయాధ్యక్షుడిగా నడ్డాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నడ్డా పార్టీ నూతన జాతీయ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు బీజేపీ ఎన్నికల ఇంచార్జి రాధా మోహన్‌సింగ్‌ ఈ ‌సందర్భంగా నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నడ్డాకు కేంద్ర •ం మంత్రి అమిత్‌ ‌షా అభినందనలు తెలిపారు. ప్రస్తుతం నడ్డా బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా విధుల్ని నిర్వహిస్తున్నారు. విద్యార్థి దశ నుంచే బీజేపీ రాజకీయ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్న నడ్డాకు మచ్చలేని నేతగా ఆ పార్టీలో మంచి పేరుంది. ఈ పదవికి ఆయనే సరైన వ్యక్తి అని ప్రధాని మోదీ, •ంమంత్రి, ప్రస్తుత పార్టీ అధ్యక్షుడు అమిత్‌ ‌షా భావించడంతో ఆయన ఎన్నిక దాదాపు ఖరారయ్యింది. బీజేపీ జాతీయాధ్యక్షుడిగా గత ఐదున్నరేండ్లుగా అమిత్‌ ‌షా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

2019 లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించి..
బీజేపీ నేతృత్వంలో ఏర్పడిన మోదీ 2.0 ప్రభుత్వంలో ఆయనకు •ంశాఖ దక్కింది. ’ఒక వ్యక్తి, ఒక పదవి’ సంప్రదాయాన్ని బీజేపీ ప్రారంభించడంతో అమిత్‌ ‌షా ప్రస్తుతం నిర్వహిస్తున్న జాతీయాధ్యక్షుడి పదవికి కొత్త వ్యక్తిని తీసుకోవడం అనివార్యమైంది. బీజేపీ ప్రస్తుత అధ్యక్షుడు, కేంద్ర •ం మంత్రి అమిత్‌ ‌షా నడ్డాకు అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. గత మేలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల ఇన్‌చార్జ్‌గా నడ్డా వ్యవహరించారు. బీజేపీ అధ్యక్షుడిగా ఐదున్నరేళ్లకు పైగా పనిచేసిన అమిత్‌ ‌పార్టీని అత్యున్నత స్థాయికి తీసుకెళ్లారు. అమిత్‌ ‌షా హయంలోనే బీజేపీ కేంద్రంలో రెండు సార్లు, పలు రాష్టాల్లోన్రూ అధికారంలోకి వచ్చింది. మోదీ తాజా ప్రభుత్వంలో అమిత్‌ ‌షాకు కీలకమైన •ంమంత్రి పదవి దక్కింది. కీలక పదవులను సమర్ధవంతంగా నిర్వహించిన తీరు, ఆరెస్సెస్‌తో అనుబంధం, వివాద రహితుడిగా ఉన్న పేరు.. మొదలైనవి జేపీ నడ్డాకు అనుకూలంగా మారాయి.

Tags: JP Nadda, BJP national president, Unanimously elected,party leaders