Take a fresh look at your lifestyle.

జర్నలిస్టులను కొరోనా వారియర్లు గా గుర్తించాలి..!

ఐజెయూ జాతీయ కార్యవర్గ సమావేశం లో సభ్యుల డిమాండ్

ఐ.జే.యు. జాతీయ కార్యవర్గ సమావేశం ఈ రోజు ఆన్ లైన్ లో దాదాపు 4 గంటలపాటు కొనసాగింది. లద్దాక్, జమ్ము కాశ్మీర్, నుండి కేరళ వరకూ దేశం లో ఏ రాష్ట్రం లో చూసినా జర్నలిస్ట్ ల దుస్థితి ఒకే రీతిలో వుందని ప్రతినిధులు మాట్లాడిన తీరు వెల్లడి చేసింది. ప్రతి రాష్ట్రం లో పెద్ద యెత్తున జర్నలిస్టులు కరోనా బారిన పడుతున్నారని, చాలా మంది మరణించారని సమావేశం లో వెల్లడి అయ్యింది.. కరోనా లాక్ డౌన్ నిబంధనలు పాటించడం లేదంటూ చాలా రాష్ట్రాల్లో మీడియా సిబ్బంది పై పోలీస్ దాడులు జరిగాయనీ,కేసులు కూడా నమోదు అయ్యాయని కూడా తేలింది.ఈ విషయం లో కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించక పోవడం పట్ల జర్నలిస్ట్ లలో తీవ్ర ఆందోళన, నిరసన వ్యక్తం అయ్యింది.పాత్రికేయులను కరోనా వారియర్స్ గా గుర్తించక పోవడం అన్యాయంగా వుందని, సమావేశం లో పాల్గొన్న వారు అందరూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.పత్రికల మూసి వేత, ఉద్యోగాల తీసివేత, వేతనాల కోత, దేశ వ్యాప్తంగా తీవ్రంగా ఉందని మాట్లాడిన ప్రతి ఒక్కరూ ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా వారియర్స్ గా జర్నలిస్ట్ లను కూడా గుర్తించాలని, వారికి ఆరోగ్య భద్రతా, కరోనా బీమా, కల్పించాలని, కరోనా కారణంగా సంక్షోభం లో ఉన్న మీడియా పరిశ్రమ కు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని, కోరుతూ, ఉద్యమించాలని అందరూ సూచించారు.

పాత్రికేయుల ఉద్యోగ, వేతన భద్రతల కోసం కార్మికశాఖ ముందు పారిశ్రామిక వివాదం లేవనెత్తా లని పలువురు ప్రతినిధులు సమావేశం లో సూచించారు. ఒక ఆన్ లైన్ పిటిషన్ ప్రారంభించాలని, న్యాయ స్థానాలలో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేయాలని కూడా సూచనలు వచ్చాయి. సమావేశం లో 18 రాష్ట్రాల నుండి దాదాపు నలభై మంది పాల్గొన్నారు.వాటిపై తీసుకున్న నిర్ణయాన్ని, చేసిన తీర్మానాలను త్వరలోనే ప్రకటిస్తామని అధ్యక్షుడు కె. శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఐ.జే.యు. అధ్యక్షుడు కే.శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశం లో సెక్రెటరీ జనరల్ బల్విందర్ సింగ్ జమ్మూ, కార్యదర్శి నివేదిక నిచ్చారు. పూర్వాధ్యక్షులు ఎస్.ఎన్. సిన్హా, దేవులపల్లి అమర్, సీనియర్ నాయకులు కే.అమర్ నాథ్, ఉపాధ్యక్షులు అంబటి ఆంజనేయులు, కార్యదర్శి వై.నరేందర్ రెడ్డి, కోశాధికారి ప్రేమ్ నాథ్ భార్గవ్, కార్యదర్శులు కే.రాజన్, అమర్ మోహన్ ప్రసాద్, సహా జాతీయ కార్యవర్గ సభ్యులు, అన్ని రాష్ట్రాల అధ్యక్ష, కార్యదర్శులు, మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం నుండి టీయూడబ్ల్యుజె అధ్యక్షులు నగునూరి శేఖర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీ, జాతీయ కార్యవర్గ సభ్యులు దాసరి కృష్ణారెడ్డి, కల్లూరి సత్యనారాయణ, రాంనారాయణ తదితరులు పాల్గొన్నారు.జర్నలిస్ట్ ల సమస్యల పై ఒక జాతీయ స్థాయి నిరసన దినాన్ని పాటించాలని సమావేశం నిర్ణయించింది.

Leave a Reply