Take a fresh look at your lifestyle.

సమస్యలు పరిష్కరించాలని జర్నలిస్టుల నిరసన

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించి ఆరేళ్లు పూర్తి అయిన  జర్నలిస్టుల సమస్యలను  పరిష్కరించలేదని జిల్లా ఐజేయూ  అధ్యక్షుడు చిత్తానురి శ్రీనివాస్‌ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలో అమరవీరుల స్తూపం వద్ద ఆవిర్భవ వేడుకలలో నల్ల మాస్కులు ధరించి నివాళి అర్పించారు. అనంతరం రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ ‌ను కలిసి  జర్నలిస్టుల. సమస్యలు  వివరించారు .  వెలుగు,ప్రజాపక్షం జర్నలిస్టులకు  అక్రిడేషన్‌ ‌కార్డ్‌లు ఇవ్వాలని..  జిల్లాలోని 16మండలాలకు చెందిన వర్కింగ్‌ ‌జర్నలిస్ట్ ‌లకు డబుల్‌ ‌బెడ్‌ ‌రూం ఇండ్లు మంజూరి చేయాలని, రాష్ట్ర ఆవిర్భావ వేళ మా ..జిల్లా ఆడబిడ్డ మంత్రి సత్యవతిరాథోడ్‌ ‌జిల్లా లోని జర్నలిస్ట్ ‌సోదరులకు తీపికబురు చెప్పాలని అన్నారు ఈ సందర్బముగా స్పందించిన.. మంత్రి సత్యవతిరాథోడ్‌..   ‌సానుకూలంగా స్పందించారు.. జర్నలిస్ట్ ‌ల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేస్తుందని చెబుతూనే.. ఈ జిల్లా ఆడపడుచుగా నా..దృష్టికి తెచ్చిన సమస్యల విషయమై కలెక్టర్‌, ‌సంబందిత ప్రజాప్రతినిధులతో త్వరలోనే ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తానని మాట ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా జర్నలిస్టులు రమణ శ్రీనివాస్‌, ‌నర్సింహారావు, శ్రీహరి, ముఖేష్‌ ఇరుకుల  కిరణ్‌, ‌రాము, ప్రవీణ్‌  ‌కిరణ్‌ ‌సురేష్‌ ‌చందా శ్రీను పద్మం మహేష్‌ ‌తదితరులు పాల్గొన్నారు.

మరిపెడలో…
మరిపెడ: జూన్‌02,(‌ప్రజాతంత్ర విలేకరి):టీయూడబ్ల్యూజే (ఐజేయూ) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలో ఆర్‌ అం‌డ్‌ ‌బి గెస్ట్ ‌హౌస్‌ ‌లో ఐజేయూ మండల అద్యక్షులు అక్తర్‌ ‌పాషా ఆధ్వర్యంలో జర్నలిస్టులు మాస్క్ ‌ధరించి,బౌతిక దూరం పాటిస్తూ తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు.జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ నిర్లక్ష్యం పట్ల నిరసన తెలుపుతున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో శ్రీరంగం శ్రీనివాస్‌,‌జిన్నా లచ్చయ్య,తిరుమలరావు,చంద్ర శేకర్‌,‌మహేందర్‌,‌పులుసు సతీష్‌,‌రేఖ అశోక్‌,‌గోవర్ధన్‌,‌సంజీవ,మచ్చా రాజేష్‌,‌లింగస్వామి,రాజేష్‌ ‌తదితరులు పాల్గొన్నారు.

లుగులో…
ములుగు, జూన్‌ 02 ( ‌ప్రజాతంత్ర ప్రతినిధి ) : జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని పాత్రికేయులు అమర వీరుల స్థూపం వద్ద వినతి పత్రం పెట్టారు. టియుడబ్ల్యూజె (ఐజెయు) రాష్ట్ర శాఖ పిలుపు మేరకు పాత్రికేయులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. గతంలో సిఎం కేసిఆర్‌ ‌పాత్రికేయులకు ఇచ్చిన హామీలను అమలు చెయ్యాలని డిమాండ్‌ ‌చేశారు. ఈ కార్యక్రమంలో షఫి అహ్మద్‌, ‌గుర్రపు శ్రీధర్‌, ‌పిట్టల మధుసుధన్‌, ‌రఘువీర్‌, ‌జినుకల ప్రభాకర్‌, ఎనగందుల కుమార్‌, ‌సుధాకర్‌ ‌పాల్గోన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply