Take a fresh look at your lifestyle.

వేములవాడలో జర్నలిస్టుల నిరసన

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా వేములవాడలోని ఐజెయు అనుబంధంగా ఉన్న ప్రెస్‌క్లబ్‌ ‌సభ్యులు నిరసన వ్యక్తం చేశారు.ప్రెస్‌ ‌క్లబ్‌ ‌ప్రధాన కార్యదర్శి అమరగొండ కిషన్‌ అధ్వర్యంలో ప్రెస్‌క్లబ్‌ ‌సభ్యులు వేములవాడలోని అమర వీరుల స్థూపం వద్దకు చేరుకుని తెలంగాణ అమరవీరులకు,కొరోనా వైరస్‌తో మృతి చెందిన వారికి నివాళులర్పించారు.అనంతరం వారంతా భౌతిక దూరం పాటిస్తూ,నల్లటి మాస్క్‌లు ధరించి,జర్నలిస్టుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ధోరణికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ప్రెస్‌ ‌క్లబ్‌ ‌వ్యవస్థాపకులు,సీనియర్‌ ‌జర్నలిస్టు రేగుల దేవేందర్‌ ‌మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అవతరణలో కీలక పాత్ర పోషించిన జర్నలిస్టులు,ప్రస్తుతం కొరోనా వైరస్‌ ‌వ్యాప్తిని అరికట్టడంలో ప్రాణాలకు తెగించి,విధులను నిర్వహిస్తున్నారని అన్నారు.

లాక్‌డౌన్‌ ‌నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని వర్గాల వారికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్ధిక సహాయం అందించిందని,అయితే జర్నలిస్టులకు మాత్రం ఎలాంటి సహాయాన్ని అందించక పోవడం శోఛనీయమని వ్యాఖ్యానించారు.వెంటనే జర్నలిస్టులకు ఆర్ధిక సహాయం అందించాల్సిందిగా ఆయన డిమాండ్‌ ‌చేశారు.ఈ కార్యక్రమంలో సీనియర్‌ ‌జర్నలిస్టులు గోగికారి శ్రీనివాస్‌,‌దాసరి దేవేందర్‌,‌మన్నాన్‌,‌ఖలీంపాషా,పాషా,పారువెల్ల శ్రీనివాస్‌,‌పంపరి శంకర్‌,‌మ్యాన శ్రీనివాస్‌,‌గొంగళ్ల రవికుమార్‌,‌నూగూరి మహేశ్‌తో పాటు 30 మంది పాల్గొన్నారు.

Leave a Reply