Take a fresh look at your lifestyle.

‌ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా జర్నలిస్టులు నిరసన

తెలంగాణ ప్రభుత్వ జర్నలిస్టులపై చూపుతున్న వివక్షతను నిరసనగా టియూ డబ్ల్యూజె(ఐజేయు) రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు మంగళవారం నాడు జిల్లా అధ్యక్షులు బివి రమణారెడ్డి ఆధ్వర్యంలో భద్రాచలంలోని అంబేద్కర్‌ ‌విగ్రహం ఎదురుగా ప్లెకార్డుతో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది.అనంతరం అంబేద్కర్‌ ‌విగ్రహానికి ,తెలంగాణ తల్లికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.జిల్లా అధ్యక్షులు బివి రమణారెడ్డి మాట్లాడుతూ కరోనా మహమ్మారి ప్రజల ప్రాణాలు హరిస్తున్న నేపథ్యంలో కరోనా వ్యాధి వ్యాప్తి నివారణకు నిరంతరం ముందువరుసలో ఉండి జర్నలిస్టులు తమ ప్రాణాలకు తెగించి ఎప్పటి కప్పుడు ప్రజలను చైతన్య పరిచారు.

అరకొర చాలీచాలని వేతనాలతో అసలు జీతాలు సైతం లేక అల్లాడుతున్న జర్నలిస్టులు మాత్రం ప్రభుత్వానికి కనబడటం లేదని అన్నారు. తెలంగాణ సాధనలో ముందువరుసలో ఉండి ప్రముఖ పాత్రను పోషించిన జర్నలిస్టులు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిత్యం నిరాదరణకు గుర వుతున్నారు. ఎన్నికల సమయంలో జర్నలిస్టుల కోసం చేసిన వాగ్దానాలను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని కోరారు. సమస్యల సాధన కోసం తెలం గాణలో జర్నలిస్టులు కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి రావడం దురదృష్టకరం అని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి పండా అనంద్‌బాబు,డివిజన్‌ అధ్యక్షులు తోకల నాగేశ్వరారవు, జిల్లా ఉపాధ్యక్షులు పిల్లి రాజు,ఎలక్రానిక్‌ ‌మీడియా డివిజన్‌ అధ్యక్షులు ఐకె ముద్దుక్రిష్ణ,సోమరౌతు శ్రీనివాసరావు, రామారావు, దిలీప్‌కుమార్‌,శ్రీ‌ను, దురా్గ్గ ప్రసాద్‌రెడ్డి,చెన్నెం ప్రవీణ్‌, ‌బండారు సత్యనారయణ పాల్గొన్నారు.

Leave a Reply