
సూర్యాపేట: జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించే దిశగా ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకొవెళ్లాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డిని సోమవారం తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు ఐజెయు నాయకులు మంత్రి క్యాంప్ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతు తెలంగాణ రాష్ట్ర సాధనలో జర్నలిస్టుల పాత్ర చాలా కీలకమైందని, ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా పలు సందర్భాల్లో తెలిపారని అన్నారు. జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తానని, ఇండ్ల స్థలాలు, ఇండ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. 6సంవత్సరాలు కావోస్తున్నా ఎలాంటి కార్యరూపం దాల్చలేదని పేర్కొన్నారు. అన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఉచిత వైద్య సేవలు అందించడానికి ప్రభుత్వ ఉద్యోగులతో పాటు జర్నలిస్టులకు ఈజెహెచ్ఎస్ పథకం ద్వారా హెల్త్ కార్డులు జారీ చేశారని అయితే ఆ పథకం ద్వారా సంతృప్తికరమైన వైద్య సేవలు అందలేదని అన్నారు. ఒకటి, రెండు ఆసుపత్రుల మినహా ఎక్కడ కూడా కార్డు మీద సరైన వైద్యం అందకా అప్పులు చేయవలసి వచ్చిందని తెలిపారు. జర్నలిస్టుల సమస్యలను అర్థం చేసుకోని పరిష్కార దిశగా చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐజెయూ జిల్లా అధ్యక్షులు చలసాని శ్రీనివాసరావు, జాతీయ కౌన్సిల్ సభ్యులు దేవశెట్టి రవికుమార్, రాష్ట్ర కమిటీ సభ్యులు మిక్కిలినేని శ్రీనివాసరావు, జర్నలిస్టుల అటాక్స్ కమిటీ జిల్లా అధ్యక్షులు బంటు క్రిష్ణ, బొక్క రాంబాబు, కర్రి రవికుమార్, సిరికొండ సైదులు, భూపతి రాములు, మల్లికార్జున్, వేణు, నాగరాజు, వెంకయ్య, మణిబాబు, గౌస్ఉద్దీన్, కృష్ణయ్య, జనార్థనాచారి తదితరులు పాల్గొన్నారు.
ఖమ్మంలో..
ఖమ్మం, ఫిబ్రవరి 24 (ప్రజాతంత్ర విలేకరి) : పెండింగ్‌లో ఉన్న జర్నలిస్టుల సమస్యలు తక్షణమే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని కోరుతూ టియు డబ్ల్యుజె(ఐజెయు) రాష్ట్ర కమిటి పిలుపుమేరకు జిల్లా కమిటి తరుపున రాష్ట్ర రవాణా శాఖా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌కు సోమవారం వినతిపత్రం అందజేసారు. ఈ సందర్బంగా మంత్రి క్యాంపు కార్యాలయంలో సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని మంత్రిని కలసి అందజేసారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో తమ వంతు పాత్ర పోషించిన జర్నలిస్టుల సంక్షేమానికి ముఖ్యమంత్రి స్వయంగా పలు సందర్బాల్లో అనేక హామీలు ఇచ్చారని అందులో భాగంగా జర్నలిస్టులకు నివేశన స్తలాలు, ఇళ్ల నిర్మాణం చేయాల్సి ఉందని, గడచిన ఆరేళ్లలో అది కార్యరూపం దాల్చలేదన్నారు. అన్ని ప్రవే టు వైద్యశాలల్లో ఉచిత వైద్య సేవలు అందించటానికి ప్రభుత్వ ఉద్యోగుల తోపాటు హెల్త్‌కార్డులు జారీచేసారని గత ఏడాది కాలంలో రెండు ఆసుప త్రుల మినహా ఎక్కడా కార్డులు పనిచేయడం లేదన్నారు. సమస్యల పరిష్కా రానికి తన వంతు కృషి చేస్తానని మంత్రి ఈ సందర్బంగా హామీ ఇచ్చారు. మంత్రిని కలసినవారిలో రాష్ట్ర ఉపాధ్యక్షులు కె రాంనారాయణ, జిల్లా అద్యక్షులు ఎన్ వెంకటరావు, రాష్ట్ర నాయకులు ఏనుగు వెం కటేశ్వరరావు, ఉపాధ్యక్షులు శ్రీనివాస్, వనం వెంకటేశ్వర్లు, మైస పాపారావు, గోపి, శివ, మాధవ్ తదితరులు పాల్గొన్నారు.