Take a fresh look at your lifestyle.

జర్నలిస్టులూ… జాగ్రత్తలు పాటించండి

  • తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ విజ్ఞప్తి

ముంబైలో జర్నలిస్టులకు కొరోనా వైరస్‌ ‌సోకిందని వార్తలు వస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలోని జర్నలిస్టులంతా ఈ వైరస్‌ ‌బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని మీడియా అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ విజ్తప్తి చేశారు. వైద్యులు,, వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుధ్య కార్మికులతో పాటు జర్నలిస్టులు కూడా సమాచార సేకరణలో నిరంతరం పాల్గొంటున్నారనీ, వార్తలు, సమాచారం కోసం కొరోనా వ్యాపించిన ప్రాంతాలకు వెళ్లిన సమయంలో తగిన జాగ్రత్తలు పాటించాలని పేర్కొన్నారు. ఈమేరకు ఆయన మంగళవారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో వృత్తి కన్నా ప్రాణం విలువైందనీ, ముందుగా ప్రాణానికే ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ప్రభుత్వ అధికారులు, పోలీసుల నుంచి వస్తున్న సమాచారం మేరకు జర్నలిస్టులు కొరోనా వైరస్‌ ‌పట్ల తగిన జాగ్రత్తలు పాటించడం లేదని తెలుస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రతీ జర్నలిస్టు విధి నిర్వహణ సమయంలో మాస్కు విధిగా ధరించాలనీ, సామాజిక దూరం పాటించకుండా రిపోర్టింగ్‌ ‌చేయరాదన్నారు. శానిటైజర్‌ను ఎల్లప్పుడూ దగ్తర ఉంచుకోవాలనీ, న్యూస్‌ ‌కవర్‌ ‌చేసేటప్పుడు గుంపులు, గుంపులుగా కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మీ కుటుంబం మీకోసం ఎదురు చూస్తున్నదనే విషయం గుర్తుంచుకోవాలనీ, కుటుంబానికి మీరే పెద్ద దిక్కనే విషయంతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాగే, ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ ‌మీడియా కార్యాలయాల్లో జర్నలిస్టులు సామాజిక దూరం పాటించేలా యాజమాన్యాలు సీటింగ్‌ ఏర్పాటు చేయాలనీ, జర్నలిస్టులకు మాస్కులు, శానిటైజర్లు అందుబాటులో ఉంచాలని విజ్ఞప్తి చేశారు. జర్నలిస్టులు అత్యవసర సేవల విభాగం లోనికి వస్తారు కాబట్టి వారికి రక్షణ కిట్లను ప్రభుత్వం సమకూర్చాలనీ, బీమా సౌకర్యం కల్పించాలని ఈ సందర్బంగా అల్లం నారాయణ విజ్ఞప్తి చేశారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!