Take a fresh look at your lifestyle.

‘‘జర్నలిస్టుల అరెస్టులకి సంబంధించిన వివరాలు కేంద్రం వద్ద లేవు’’

దేశవ్యాప్తంగా భారత శిక్ష్మా స్మృతి, అంటువ్యాధుల చట్టం-1897, ఉపా-1967 చట్టాల కింద అరెస్టయిన జర్నలిస్టులు ఎందరు అన్న ప్రశ్నకి కేంద్ర ప్రభుత్వం షాకింగ్‌ ‌సమాధానం పార్లమెంట్‌ ‌లో ఇచ్చింది. గత ఐదు సంవత్సరాల కాలంలో దేశంలో జర్నలిస్టులపై ఏ చట్టంపై ఎన్ని కేసులు నమోదు అయ్యాయని కాంగ్రెస్‌ ఎం‌పీ రాజ్‌మని పటేల్‌ ‌ప్రశ్నకి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్‌ ఈ ‌విధంగా లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

పోలీసు, ప్రజా భద్రత, శాంతి భద్రత సంబంధిత అంశాలు భారత రాజ్యాంగంలోని ఏడొవ షెడ్యూల్‌ ‌ప్రకారం రాష్ట్ర జాబితాలోని అంశాలని స్పష్టం చేశారు. దాంతోపాటు, తాము గత కొంత కాలంగా ఎన్సీఆర్బీ వివరాలు కూడా సేకరించడం లేదని వెల్లడించారు. అందుచేత అందుకు సంబంధించిన సమాచారం తమ వద్ద అందుబాటులో లేదని పేర్కొన్నారు. కాగా, 2017లో జర్నలిస్టుల భద్రతకి తీసుకోవాల్సిన చర్యలపై తాము అడ్వజయిరీ ఇచ్చినట్టు గుర్తు చేసింది.

Leave a Reply