Take a fresh look at your lifestyle.

కొరోనాతో జర్నలిస్ట్ టిఎన్‌ఆర్‌ ‌మృతి

తెలుగు రాష్టాల్లో కొరోనా మహమ్మారికి జర్నలిస్టులు వరుసగా మృత్యువాత పడుతున్నారు. ఇటీవలే వి6 జర్నలిస్ట్ ‌సందీప్‌ ‌మృతి చెందగా తాజాగా మరో ప్రముఖ జర్నలిస్ట్, ‌నటుడు టీ.నరసింహా రెడ్డి(టీఎన్‌ఆర్‌) ‌మరణించారు. యూ ట్యూబ్‌ ‌ఛానల్స్ ‌లో ఇంటర్వ్యూలతో టీఎన్‌ ఆర్‌ ‌కు గుర్తింపు ఉంది. ఇటీవల ఆయన పలు సినిమాల్లో కూడా నటించారు. అయితే కొన్ని రోజుల క్రితం కొరోనా బారిన పడిన టీఎన్‌ఆర్‌ ‌మల్కాజ్‌ ‌గిరి లోని ఓ హాస్పిటల్‌ ‌లో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం కన్నుమూశారు. ఆయన పరిస్థితి విషమంగా ఉందని.. అతని ఆరోగ్యం ట్రీట్‌ ‌మెంట్‌ ‌కు సహకరించడం లేదని నిన్న(ఆదివారం) ప్రచారం జరిగింది ఆయన మరణవార్త తెలిసి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.

టీఎన్‌ఆర్‌ ‌మరణవార్త తెలిసి హీరో నాని దిగ్భ్రాతి వ్యక్తం చేశారు. ఎంతోమంది సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేసి వారి మనసులో మాటలను జనానికి వినిపించిన ఆయన మరణం బాధాకరం అని నాని పేర్కొన్నారు. స్క్రీన్‌ ‌షేర్‌ ‌చేసుకున్నాం. స్టేజ్‌ ‌షేర్‌ ‌చేసుకున్నాం. కలిసినప్పుడల్లా, ’నీతో అందరూ ఇంటర్వ్యూలు చేసేసారు. నేను ఎప్పుడో చేస్తాను. అది చాలా స్పెషల్‌గా ఉండాలి, ఉంటుంది’ అనేవాడు. దర్శకుడు అవుదామని వచ్చాడు. ఇరవైఏళ్లుగా ఏవేవో చేసాడు. ఇంటర్వ్యూయర్‌గా చాలా ఫేమస్‌ అయ్యాడు.

సినిమాల్లో యాక్టర్‌గా విజృంభణలో ఉన్నాడు. త్వరలో దర్శకత్వం అన్నాడు. కానీ ఇలా ఈ లోకం విడిచి వెళ్లాడని కత్తి మహేష్‌ ఆవేదన చెందారు. టీఎన్‌ఆర్‌ అకాల మరణం ఎంతో బాధ కలిగించింది. మంచి మనస్తత్వం ఉన్న మనిషి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తున్నాను అని అనీల్‌ ‌రావిపూడి ట్వీట్‌ ‌చేశారు. గోపిచంద్‌ ‌మలినేని, దర్శకుడు మారుతి, సందీప్‌ ‌కిషన్‌ ‌సంతాపం తెలియజేశారు.

Leave a Reply