Take a fresh look at your lifestyle.

జర్నలిస్టు రఘుకు 14 రోజుల రిమాండ్ ..!

  • నాటకీయ ఫక్కీ లో అదుపులో తీసుకున్న పోలీసులు
  • అరెస్ట్ ను ఖండించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్

జర్నలిస్టు రఘును హైద్రాబాద్ లోని మల్కాజిగిరిలో ఆయన నివాసం వద్ద సూర్యపేట పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. గతంలో నమోదు అయిన వివిధ కేసుల్లో జర్నలిస్టు రఘును అరెస్టు చేసినట్టుగా ఉమ్మడి నల్గొండ జిల్లా మఠంపల్లి పోలీసులు ఆయన భార్య లక్ష్మీ ప్రవీణకు నోటీసులు అందజేశారు. .హుజుర్నగర్ కోర్టులో హాజరుపరచగా కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది.అంతకు ముందు ‘ తొలి వెలుగు’ ‘యూ ట్యూబ్ ‘ ఛానల్ విలేకరి రఘును గుర్తు తెలియని వ్యక్తులు గురువారం ఉదయం మల్కాజిగిరి లో కిడ్నాప్ చేశారని …నెంబర్ ప్లేట్ లేని వాహనంలో వచ్చి ముసుగు వేసి బలవంతంగా దుండగులు లాక్కెళ్ళినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు…

గుర్రంపోడు గిరిజన భూముల అధికార పార్టీ ఆక్రమణపై ‘రాజ్ న్యూస్’ రిపోర్టర్ గా రఘు పలు వార్తా కథనాలు అందించారు. బీజేపీ రాష్ట్ర అద్యక్షుడు బండి సంజయ్ గుర్రంపోడు ధర్నా కూడా ఆయన కవర్ చేశారు.అప్పుడే బండి సంజయ్ తో పాటు రఘుపై IPC 143, 144, 147, 148, 149, 332, 333 r/w, సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.ఇదే కేసులో ఇప్పటి వరకు 30 మందికి పైగా బీజేపీ కార్యకర్తలను అరెస్టు చేశారు.తప్పుడు కేసులపై న్యాయ పోరాటం చేస్తున్నట్టు బీజేపీ నేతలు ఇదివరకు ప్రకటించారు. మీడియా గొంతు నొక్కెందుకే రఘును అరెస్టు చేశారని తక్షణం ఆయనను విడుదల చేయాలని జర్నలిస్టుల సంఘాలు డిమాండ్ చేశాయి.జర్నలిస్టు రఘు అరెస్ట్ ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఖండించారు. అక్రమ కేసులతో మీడియా గొంతును మూయించాలని ప్రభుత్వం చూస్తుందనీ..ఈ రోజు రఘుకు జరిగిందే రేపు మరో జర్నలిస్టు కు జరిగే ప్రమాదం ఉన్నాడని ఆందోళన వ్యక్తం చేసారు .

Leave a Reply