అర్హులైన వారు 18లోగా దరఖాస్తు చేసుకోవాలి
జర్నలిస్టుల సంక్షేమనిధి నుంచి మంజూరు చేసే ఆర్థిక సహాయం పొందేందుకు ఈ నెల 18వ తేదీ వరకు అర్హత గల వారు దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణ రాష్ట్ర వి•డియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మరణించిన జర్నలిస్టులకు సంబంధించిన కుటుంబ సభ్యులు, జర్నలిస్టు వృత్తిలో ఉంటూ అనారోగ్యం బారినపడి పనిచేయలేని స్థితిలో ఉన్న జర్నలిస్టులు మాత్రమే ఈ ఆర్థిక సహాయానికి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
గతంలో జర్నలిస్టుల సంక్షేమ నిధి నుంచి లబ్ది పొందిన వారు, ఇప్పటికే మీ డియా అకాడమీ కి దరఖాస్తులు పంపినవారు మళ్లీ దరఖాస్తు చేసుకోవలసిన అవసరం లేదని పేర్కొన్నారు. దరఖాస్తుదారులు సంబంధిత జిల్లా పౌర సంబంధాల అధికారుల ద్వారా ధ్రువీకరించిన దరఖాస్తులను మీడియా అకాడమీ కార్యాలయానికి స్వయంగా గానీ లేదా పోస్ట్ ద్వారా గానీ ఈ నెల 18వ తేదీ వరకు పంపించాలన్నారు. పూర్తి చేసిన దరఖాస్తులను కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర వి•డియా అకాడవి•, హైదరాబాద్ చిరునామా: ఇంటి నెం.10-2-1, సమాచార భవన్, 2వ అంతస్తు, ఎ.సి. గార్డస్, మాసాబ్ ట్యాంక్, తెలంగాణ రాష్ట్ర చలన చిత్ర అభివృద్ధి సంస్థ కాంప్లెక్స్, హైదరాబాదుకు పంపవలసిందిగా తెలిపారు.