Take a fresh look at your lifestyle.

కరోనా విజృంభణ సమయంలో జర్నలిజం

‘మనం  మన వృత్తి ధర్మాలను ఎంతో ధైర్యంగా, నిర్వహిస్తుంటాం. అయితే, ఎదుటివారు కోరుకున్నట్టు కాకుండా, మన ప్రమాణాల మేరకు పని చేసుకుని పోతుంటాం. ప్రస్తుతం కరోనా సంక్షోభం దేశాన్ని ఊపేస్తోంది. ఇలాంటి సమయంలో వార్తల సేకరణ కత్తిమీద సామే.ఇలాంటి పరిస్థితి గతంలో ఎన్నడూ రాలేదు. ఇది నిజంగా పెద్ద యుద్ధమే..’ 

మన చుట్టూ ఉన్న లక్షలాది మంది మనలను చూస్తున్నారు. వార్తల సేకరణ, ఎడిటింగ్‌, ‌రికార్డింగ్‌ ‌వంటి అశాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. మనం సకాలంలో ప్రజా సమస్యలపై స్పందిస్తున్నామా..అన్యాయాలను ఎత్తి చూపుతున్నామా..సమాజంలో మనషుల మధ్య జరుగుతున్న పరిస్థితులను గమనిస్తున్నామా.. అనే విషయాలను ప్రజలు గమనిస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నామా లేదా అన్నది కూడా చూస్తున్నారు. ప్రజల సమస్యల పట్ల మనం ఏ విధంగా స్పందిస్తున్నాం. మోటుగా వ్యవహరిస్తున్నామా, లేక వగరుగా ఉంటున్నామా అనేది కూడా ప్రజలు గమనిస్తున్నారు. మనం పట్టించుకోకుండా ఉంటున్నామని అనుకుంటున్నారు. మనం ఎక్కడి నుంచి వచ్చామో గమనించేవారుంటారు. అయితే, సమాజానికి జర్నిలిస్టులు అందించే సేవలు సామాన్యమైనవి కావు. ఘర్షణలు జరిగినప్పుడు, వైపరీత్యాలు సంభవించినప్పుడు, ఎన్నికల ప్రచార సమయంలోనూ మనం స్వంత విషయాలను పక్కన పెట్టి విద్యుక్తధర్మానికి ప్రాధాన్యం ఇస్తున్నాం. అందుకే సమాజంలో జర్నలిస్టులకు గౌరవం ఉంది. మనలను బాగా చూసుకుంటారు. గౌరవిస్తారు. నేను ఎవరి వల్ల అవమానాలకు గురి కాలేదు. అందరూ నన్ను బాగానే చూసుకుంటున్నారు. ఎన్నికల సమయంలో మనం వారితో కలిసి ప్రయాణం చేసినప్పుడు జర్నలిస్టులను ఎంత గౌరవంగా చూస్తారో మనకు తెలుసు. జర్నలిస్టులు తమకు ఎంతో ముఖ్యమైనవారని భావిస్తుంటారు. ఇది ఒక విలక్షణమైన సామాజిక సంబంధాల కార్యక్రమం. మనం మన వృత్తి ధర్మాలను ఎంతో ధైర్యంగా, నిర్వహిస్తుంటాం. అయితే, ఎదుటివారు కోరుకున్నట్టు కాకుండా, మన ప్రమాణాల మేరకు పని చేసుకుని పోతుంటాం. ప్రస్తుతం కరోనా సంక్షోభం దేశాన్ని ఊపేస్తోంది. ఇలాంటి సమయంలో వార్తల సేకరణ కత్తిమీద సామే.ఇలాంటి పరిస్థితి గతంలో ఎన్నడూ రాలేదు.

ఇది నిజంగా పెద్ద యుద్ధమే.
ప్రపంచ వ్యాప్తంగా కరోనా దేశదేశాలను గడగడలాడిస్తున్న ప్రాణాంతక వ్యాధి. ప్రతి దేశం తమ దేశంలో ఈ మహమ్మారిని ఎదుర్కొనేందుకు కృషి చేస్తోంది. ఒకరికి మరొకరు సాయపడే పరిస్థితుల్లో ఏ దేశమూ లేదు. మన దేశం ఒక్కటే అలా ఉంది. మన దేశంలో అనేక రకాల బహుళత్వాలు ఉన్నాయి. మన దేశంలో వేల మంది ప్రజలు తక్కువ అవకాశాలు, వనరులు ఉన్నవారున్నారు. మన దేశంలో ఉన్న గొప్ప విషయం ఏమిటంటే స్వేచ్ఛ. సామాజిక సంబంధాలను నెరిపే విషయంలో భావస్వేచ్చను దేశంలో ఏ చట్టమూ క్రోడీకరించదు. రాజ్యాంగంలోని 19వ అధికరణం ప్రతి పౌరుడు సమానమేనని స్పష్టం చేస్తోంది. జర్నలిస్టులకు ప్రత్యేక హక్కులు లేవు. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని విధించేవరకూ మన స్వేచ్ఛను అడ్డు లేకుండా వాడుకున్నాం. ఆమె మన హక్కులపై ఆంక్షలు విధించినప్పుడు పోరాడి పునరుద్ధరింపజేసుకున్నాం.

జర్నలిస్టులు సామాజిక బాధ్యతతో పని చేస్తున్నారు. 2004లో సునామీ వచ్చినప్పుడు పగలు, రాత్రి తేడా లేకుండా వార్తా సేకరణలో నిమగ్నమయ్యారు. ప్రాణాలకు తెగించి వార్తా సేకరణ జరిపారు. ఎన్నో కథనాలను వెలువరించారు. బాధితుల కష్టాలు, కన్నీళ్ళను లోకం దృష్టికి తెచ్చారు. భవిష్యత్‌ ‌తరాలు జర్నలిస్టుల సాహస గాథ•లను ఎన్నటికీ మరువలేరు. అయితే, మనం జీవించి ఉంటేనే ఈ లోకం మనలను పట్టించుకుంటుందన్న సూత్రాన్ని జర్నలిస్టులు నిరంతరం గుర్తించుకోవాలి. మన గౌరవాన్నీ, ప్రతిష్ఠను ఎవరూ ప్రశ్నించంలేరు. ఫ్లాక్‌ ‌లాండ్‌ ‌యుద్ధం సమయంలో ఆనాటి బ్రిటిష్‌ ‌ప్రధాని మార్గరెట్‌ ‌థాచర్‌ ‌బీబీసీని విమర్శించినా, బీబీసీ చరిత్ర, చరిత్రలో దాని పాత్రను ఎవరూ కాదనలేరు. మన దేశ భక్తిని ఎవరూ శంకించలేరు. దేశభక్తి విషయంలో బీబీసీ ఎవరి చేత పాఠాలు చెప్పించుకోవల్సిన అవసరం లేదు. ప్రభుత్వాల అలసత్వాలను మనం ప్రశ్నిస్తూనే ఉంటాం. మనలను ఎవరూ తప్పు పట్టలేరు. మనం ఎవరేమన్నా పట్టించుకోనవసరం లేదు. సమాజం పట్ల మన బాధ్యతను నిర్వర్తించడమే మన కర్తవ్యం. కరోనా విషయంలో కూడా మనం మన బాధ్యతను నిర్వర్తిద్దాం.

– శేఖర్‌ ‌గుప్త,
‘ద ప్రింట్‌’ ‌సౌజన్యంతో..

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy
error: Content is protected !!