‘‘ఐదేళ్ళ పాటు ప్రభుత్వం మీద వీధి పోరాటాలు నిర్వహిస్తూ ఎన్నికల వేళ గెలిచే బూర్జూవ పార్టీల సంక చేరే పార్లమెంటరీ కమ్యూనిస్టు పార్టీల అనుబంధం విద్యార్థి సంఘాలు తమ విద్యార్థులకు ఏ చైతన్యపు మార్గదర్శకాన్ని ఇస్తున్నాయో కొత్తగా చర్చించాల్సిన అవసరం లేదు.విప్లవ విద్యార్థి సంఘాలు ఏ మేరకు తమ పోరాటాలను విద్యార్థులలోకి తీసుకెళ్ళాయో సమీక్షించుకోవాలి. పాఠశాల స్థాయి నుండి విశ్వవిద్యాలయాల స్థాయి వరకు ఏ మేరకు నిర్మాణం,కార్యక్రమం, ఆచరణ,విద్యార్థులకు రాజకీయ శిక్షణా తరగతులు నిర్వహణ, సమస్యల సేకరణ, ప్రాతినిథ్యాలు,వివిధ పోరాట రూపాలు అమలు చేస్తున్నారో సమీక్షించుకోవాలి చేసిన తక్షణం అవసరముంది.’’
ఉస్మానియా విశ్వవిద్యాలయం అంటే ఎవరికైనా జ్ఞాపకాల్లో మెదిలే రూపం కా.జార్జిరెడ్డి.విప్లవ విద్యార్థి ఉద్యమ ధృవతార. జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలను ఎప్పటికప్పుడు అవలోకనం చేస్తూ ప్రపంచ రాజకీయాలను గతితార్కిక భౌతికవాదం తో మేళవించి అత్యంత సులభంగా అర్ధమయ్యేలా బోధించే మేధావి. చదివే సబ్జెక్ట్ భౌతిక శాస్త్రమైనా కళలు,సాహిత్యం మాత్రమే కాకుండా సమకాలీన సామాజిక అంశాలపై లోతైన రాజకీయ విశ్లేషణలతో గంటల తరబడి ఉపన్యసించగల ధీశాలి. ఉస్మానియా విశ్వవిద్యాలయం లో మతోన్మాద, గుండాయిజం ముళ్ళను ఏరేసేందుకు పి.డి.ఎస్. పేరిట విద్యార్థులను ఏకం చేసిన విద్యార్థి నాయకుడు. అమెరికా సామ్రాజ్యవాదం పై పోరుజెండా ఎత్తి గర్జించిన చే గువేరా స్ఫూర్తి తో లి’’విద్యార్థుల రక్తమూ చిందని పోరే లేదు, విద్యార్థుల త్యాగమూ రాయని చరితే లేదు.’’లి అంటూ ప్రపంచ విద్యార్థి ఉద్యమాలకు దిక్సూచి అయ్యాడు.కా.జార్జిరెడ్డి. చదవటం, అధ్యయనం మనిషిని ఉన్నతంగా నిలుపుతుందని నమ్మిన జార్జి రెడ్డి కళాశాల గదుల్లో విన్న పాఠాల కన్నా లైబ్రెరీలో గడిపిన సమయమే ఎక్కువ. విశ్వవిద్యాలయం లో సంవత్సరకాలం సస్పెన్షన్ కు గురైతే గంటల తరబడి లైబ్రెరీ లో చదివి న్యూక్లియర్ ఫిజిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించి విశ్వవిద్యాలయం లో తన పేరును లిఖించుకున్న ఉత్తమ పరిశోధక విద్యార్థి. విశ్వవిద్యాలయం లో జనసంఘ్,ఏ.బి.వి.పి.మతోన్మాద శక్తుల ఆటకట్టించి విద్యార్థి సంఘం ఎన్నికల్లో పి.డి.ఎఫ్.ను గెలిపించిన లక్ష్యసాధకుడు. ఎన్నిసార్లు శత్రువులు దాడిచేసినా ఒంటరిగా ఎదుర్కొని,వారిని పరిగెత్తించిన యోధుడు. బాక్సింగ్, బ్లేడ్ కర్చిఫ్ యుద్ధ విద్యలలో నిష్ణాతుడు. నిరంతరం జిమ్ కు వెళ్ళటం ద్వారా ఫిట్ నెస్ లో పై దృష్టి పెట్టి అన్యాయాలపై పులిలా గర్జించి దూకే సాహసి. అత్యంత నిరాడంబరంగా హవాయి చెప్పల్ తో జీన్ ప్యాంట్ దుస్తులు, కనిపించే జార్జిరెడ్డికి ప్రొఫెసర్లే అభిమానులుగా మారటమంటే అతిశయోక్తి కాదు. అలాంటి కా.జార్జిరెడ్డిని నాటి ఆర్.ఎస్.ఎస్.గుండాలు,పోలీసు
కా.జార్జి రెడ్డి నుండి స్ఫూర్తి పొంది,విద్యార్థి ఉద్యమాలను ఉన్నతంగా నిలబెట్టేందుకు,నాటి బలమైన విద్యార్థి ఉద్యమాలు నిర్వహించటంలో నేటి విద్యార్థి సంఘాలు బలహీనతలను అవి అధిగమించాలి.జార్జి రెడ్డి వారసత్వంతో నేటి విద్యార్థులు ఈ దేశ రాజకీయాలను,రాజకీయ పక్షాల దోపిడిని ప్రశ్నించే తత్వం మరింత పెంపొందించుకోవాలి. పెటీ బూర్జువా వర్గంగా,లంపెయిన్ శక్తులుగా మారేందుకు లభించే అవకాశాలను తిప్పికొట్టాలి. లినవసమాజ నిర్మాతలు విద్యార్థులే!లి నన్న అవగాహన తో పాలకులు మారుతున్నామారని 75 యేండ్లపాలనలో మార్పులేని ఆర్ధిక,సామాజిక దుస్థితి పై అశేష విద్యార్థి లోకానికి అవగాహన కల్పించాలి. పాలకులు ఈ దేశ రాజ్యాంగాన్ని బాహాటంగా పరిహాసిస్తూ సవరణల పేరిట ఈ దేశ దళిత,గిరిజన, మైనారిటీ బతుకులు మృగ్యం చేయటంపై సమిష్టి కార్యాచరణలో కదిలి సాగాలి. కొత్త హక్కులేమో గానీ వున్న కనీసం హక్కుల హననం జరుగుతున్నాయన్న స్పృహ కలిగి వుండాలి. పార్లమెంటరీ ఎన్నికల బాగోతం,సిద్దాంతాలు లేని సిగ్గు విడిచిన పొత్తులతో ఐదేళ్ళకొకసారి దేశాన్ని దోపిడి చేసే లైసెన్సును రెన్యూవల్ చేసుకుంటుంటే,లక్షల కోట్ల అప్పులతో దేశాన్ని అప్పులు కొంటెగా మారుస్తుంటే నవభారత నిర్మాతలైన యువత, విద్యార్థులలో నాటి వియత్నాం వీరుడు చేగువేరా,మన భగత్ సింగ్, జార్జి రెడ్డి స్ఫూర్తి కొరవడుతున్నదని సమాజం ప్రశ్నించకముందే విద్యార్థి సంఘాలు మేల్కోవాలి.
వామపక్ష విద్యార్థి సంఘాలు – పనితీరు
ఐదేళ్ళ పాటు ప్రభుత్వం మీద వీధి పోరాటాలు నిర్వహిస్తూ ఎన్నికల వేళ గెలిచే బూర్జూవ పార్టీల సంక చేరే పార్లమెంటరీ కమ్యూనిస్టు పార్టీల అనుబంధం విద్యార్థి సంఘాలు తమ విద్యార్థులకు ఏ చైతన్యపు మార్గదర్శకాన్ని ఇస్తున్నాయో కొత్తగా చర్చించాల్సిన అవసరం లేదు.విప్లవ విద్యార్థి సంఘాలు ఏ మేరకు తమ పోరాటాలను విద్యార్థులలో కి తీసుకెళ్ళాయో సమీక్షించుకోవాలి. పాఠశాల స్థాయి నుండి విశ్వవిద్యాలయాల స్థాయి వరకు ఏ మేరకు నిర్మాణం,కార్యక్రమం,ఆచరణ,విద్
ప్రస్తుత పాలకవర్గాలు ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వీర్యపరుస్తూ ప్రయివేట్ విద్యా వ్యాపారాన్ని బాహాటంగా ప్రోత్సాహిస్తున్నది. ఇప్పటికి 42 శాతం పిల్లలు చదువులకు దూరంగా వున్నారనేది ప్రభుత్వమే తన లెక్కల్లో చెపుతున్నది. దళిత,గిరిజన, మైనారిటీ మరియు బాలికలు పెద్ద సంఖ్యలో విద్యకు దూరమవుతున్నారు. విశ్వవిద్యాలయాలను దివాలా తీయించి, కార్పొరేట్ శక్తులకు మార్కెట్ అవసరాలు తీర్చేకోర్సులకోసం ప్రయివేట్ విశ్వ విద్యాలయాలకు అనుమతులిస్తున్నాయి.సెల్ఫ్ ఫైనాన్స్ పద్దతిలో కొత్త కోర్సులు,కాషాయీకరణ చేసి భూతవైద్యం వంటి కోర్సులు ముందుకొస్తున్నాయి. స్కాలర్ షిప్ లు,మెస్ ఛార్జీలు, హాస్టల్ల నిర్వహణ దారితప్పాయి. విప్లవ విద్యార్థి సంఘాలు పనితీరు మరింత మెరుగు పర్ఛుకునేందుకు అంకితభావం వైఖరి,పని సంస్కృతిని అభివృద్ధి పర్చుకోవాల్సిన అవసరాన్ని ఇప్పటికైనా గుర్తించాల్సివుంది.గ్లోబలైజే
లాయిడ్,సోషల్ మీడియా విషసంస్కృతి మాయలో పడకుండా విద్యార్థి సంఘాలను బలోపేతం చేయాల్సిన అవసరముంది.
విప్లవాన్ని స్వప్నించిన వీరులను దోపిడి వర్గాలు సొంతం చేసుకోవటం విచిత్రమనిపిస్తుంది. ‘‘తుపాకీని విత్తితే తుపాకులు చెట్టు మొలుస్తుందా?’’ అని చిన్నతనంలో ప్రశ్నించి,బ్రిటీష్ సామ్రాజ్యవాదులను గడగడలాడించిన భగత్ సింగ్ ను తమ వాడిగా హిందూ ఫాసిస్ట్ శక్తులు సొంతం చేసుకుంటున్నాయి. అమెరికా సామ్రాజ్యవాదులను కంటిపై నిద్ర లేకుండా చేసిన వియత్నాం యుద్ధం వీరుడు చే గువేరా చిత్రాన్ని దోపిడి,దలారీ భక్తులు తమరాజకీయ వేదికలపై వినియోగించుకుంటున్నాయి.
‘జీనా హైతో మార్ నా సిఖో! కథం కథం పర్ లోడ్ నా సీఖో!’ అని పిలుపునిచ్చిన జార్జి రెడ్డి వారసత్వన్ని పునికిపుచ్చుకోవటం నేటి విద్యార్థి లోకానికి అవసరం. ‘‘యువతరమా !దేశానికి కళ్ళు నీవే!కాళ్ళు నీవే!’’ అన్న కా.చెరబండరాజు కోరిన అభ్యుదయ యువతరం అభివృద్ధి కి విద్యార్థి సంఘాలే దిక్సూచీ గా పని చేయాల్సిన అవసరం ఎంతైనా వుంది.
– అజయ్.లిపి.డి.ఎస్.యు..మాజీ నాయకులు
(ప్రగతి శీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్ యు) రాష్ట్ర మూడవ మహా సభలు
వరంగల్ లో నవంబర్ 4,5,6 తేదీల్లో జరుగుతున్న సందర్భంగా ప్రత్యేక వ్యాసం…)