Take a fresh look at your lifestyle.

స్పష్టమయిన మరియు నిర్మాణాత్మక చర్చలు..!

భారత్,చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖల సంయుక్త ప్రకటన
ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి : న్యూ దిల్లీ : భారతదేశం-చైనా సరిహద్దు ఉద్రిక్తత తగ్గించేందుకు  జైశంకర్, వాంగ్ ఎల్ఐసి పరిస్థితిపై 5 పాయింట్ల ఏకాభిప్రాయానికి వచ్చామని చైనా విదేశాంగ మంత్రి  ప్రకటించారు. భారత-చైనా సరిహద్దు ప్రాంతాలలో చోటు చేసుకున్న పరిణామాలపై, అలాగే భారత్-చైనా సంబంధాలపై ఇరు దేశాల విదేశాంగ మంత్రులు “స్పష్టమైన  నిర్మాణాత్మక” చర్చలు జరిపినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో తెలిపింది.
విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి మధ్య రెండున్నర గంటల ద్వైపాక్షిక చర్చల అనంతరం వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్ఐసి) వద్ద నెలకొన్న ఉద్రిక్త పరిస్థితిని సరళం చేయడానికి ఇరు దేశాల విదేశాంగ మంత్రులు ఐదు అంశాల ఒప్పందానికి వచ్చాయి. విదేశాంగ మంత్రిత్వ శాఖ శుక్రవారం విడుదల చేసిన సంయుక్త ప్రకటన ప్రకారం, భారత్ చైనా విదేశాంగ మంత్రులు భారత-చైనా సరిహద్దు ప్రాంతాలలో జరుగుతున్న పరిణామాలపై, అలాగే భారత్-చైనా సంబంధాలపై “స్పష్టమైన మరియు నిర్మాణాత్మక” చర్చలు జరిపారు. భారతదేశం-చైనా సంబంధాలను మెరుగు పరచడంపై ఇరు దేశాల నాయకుల మధ్య కుదిరిన ఏకాభిప్రాయం నుండి ఇరుపక్షాలు మార్గదర్శకత్వం తీసుకోవాలని, అభిప్రాయ బేధాలు  వివాదాలుగా మారకుండా చూసుకోవాలని, ఇరువురు మంత్రులు అంగీకరించారని ఆ ప్రకటనలో వుంది.
ప్రస్తుత పరిస్థితి వలన ఇరుపక్షాలకు ప్రయోజనం లేదని ఇద్దరు విదేశాంగ మంత్రులు అంగీకరించారు. “అంచేత ఇరుపక్షాల సరిహద్దు దళాలు తమ చర్చలను కొనసాగించాలని, త్వరగా నెలకొన్న ప్రతిష్టంబన విడదీయాలని, ఇరు దేశాలు సరిహద్దులో సరైన దూరాన్ని కొనసాగించి ఉద్రిక్తతలను తగ్గించాలని భారత్ చైనా దేశాల విదేశాంగ మంత్రులు అంగీకరించారు” అని MEA ప్రకటన తెలిపింది. చైనా-ఇండియా సరిహద్దు వ్యవహారాలపై ప్రస్తుతమున్న అన్ని ఒప్పందాలకు, ప్రోటోకాల్‌కు కట్టుబడి ఉండాలని, సరిహద్దు ప్రాంతాల్లో శాంతి ప్రశాంతతను కొనసాగించాలని, ఇరు దేశాల మధ్య దూరం పెంచే చర్యలకు దూరంగా ఉండాలని ఇరు మంత్రులు అంగీకరించారు. భారతదేశం-చైనా సరిహద్దు ప్రశ్నపై ప్రత్యేక ప్రతినిధి విధానం ద్వారా చర్చలలో పాల్గొనడానికి ఇరుపక్షాలు అంగీకరించాయి. ఈ నేపథ్యంలో “వర్కింగ్ మెకానిజం ఫర్ కన్సల్టేషన్ అండ్ కోఆర్డినేషన్ ఆన్ ఇండియా-చైనా బోర్డర్ అఫైర్స్” (డబ్ల్యుఎంసిసి) సమావేశాలను కొనసాగించాలని ఇరు దేశాలు అంగీకరించాయి.
చైనా రాయబార కార్యాలయం కూడా ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ  ప్రకటన ప్రకారం,ప్రస్తుత పరిస్థితులకు సంబంధించి పూర్తి స్థాయి లోతైన చర్చ అనంతరం ఇరుపక్షాలు ఐదు పాయింట్ల మీద ఏకాభిప్రాయానికి వచ్చాయి. “చైనా-ఇండియా సంబంధాలు మరోసారి పరీక్షకు గురి అవుతున్నాయి అని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ ప్రకటించారు . అయితే  “ఇరు దేశాలు తమ   సంబంధాన్ని సరైన దిశలో కొనసాగిస్తున్నంత కాలం, అధిగమించలేని ఇబ్బంది లేదా సవాలు ఉండబోదు” అని చైనా విదేశాంగ మంత్రి నొక్కి వక్కాణించారు.
మే నెల మొదటిలో సరిహద్దు వివాదం ప్రారంభమైన నాలుగు నెలల తరువాత, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైసేషన్ సమావేశంలో భాగంగా జైశంకర్..వాంగ్ యి.. గురువారం మాస్కోలో సమావేశమయ్యారు. సరిహద్దు ప్రాంతాలలో శాంతి, ప్రశాంతతను కొనసాగించడానికి, భారత్ చైనా సంబంధాలు  పెంచడానికి కొత్తగా విశ్వాస నిర్మాణ చర్యలను ఇరుపక్షాలు వేగవంతం చేయాలని ఇరు దేశ మంత్రులు అంగీకరించారు.
ఈ ద్వైపాక్షిక సమావేశానికి ముందు, భారతదేశం, రష్యా, చైనా విదేశాంగ మంత్రులు గంటన్నర సుదీర్ఘ భోజన సమావేశాన్ని నిర్వహించారు. ఈ విందు సమావేశం రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్ నిర్వహించారు. రష్యా-ఇండియా-చైనా త్రైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు “పరస్పర అవగాహన, స్నేహం విశ్వాసం యొక్క స్ఫూర్తితో అంతర్జాతీయ అలాగే ప్రాంతీయ ప్రాముఖ్యత కలిగిన సమయోచిత సమస్యలు” గురించి మూడు దేశాల మంత్రులు అభిప్రాయాలను పంచుకున్నారు. అని ఆర్ఐసి (RIC) సమావేశం తరువాత సంయుక్త ప్రకటన ద్వారా తెలిపింది. “మూడు దేశాల సాధారణ స్నేహం పెరగటం సహకారం పెరగటం వలన ప్రపంచ అభివృద్ధి, శాంతి, స్థిరత్వాన్ని ప్రోత్సహించడానికి అనుకూలంగా ఉంటుంది” అని మూడు దేశాల మంత్రులు గుర్తించారు.
మే నెల మొదటిలో భారత్ చైనా సరిహద్దు స్టాండ్-ఆఫ్ ప్రారంభమైన తరవాత రష్యా-ఇండియా-చైనా విదేశాంగ మంత్రులు (ఆర్ఐసి) ఇలా సమావేశం కావటం రెండవ సారి జరిగింది. జూన్ 23 న వీడియో-కాన్ఫరెన్స్‌లో మొదటి సమావేశం జరిగింది. గాల్వన్ ఘర్షణ తర్వాత జైశంకర్ వాంగ్ మధ్య జరిగిన మొదటి ముఖాముఖీ సమావేశం ఇది. జూన్ 17 న, జైశంకర్.. వాంగ్.. జూన్ 15న సరిహద్దు ఘర్షణపై టెలిఫోన్‌లో మాట్లాడారు. ఈ సమయంలో 20 మంది భారతీయ సైనికులు మరణించిన విషయం తెలిసిందే.
మాస్కోలో జరిగిన ఆర్ఐసి సమావేశంలో, కోవిడ్ -19 మహమ్మారి ప్రభావాన్ని తగ్గించడానికి మూడు దేశాలు బలమైన శాస్త్రీయ, పారిశ్రామిక సామర్థ్యాలతో గణనీయమైన కృషి చేయగలవని ముందే దేశాల మంత్రులు అంగీకరించారు. ఆర్ఐసి అధ్యక్ష పదవిలో వున్నా రష్యా గత ఏడాది కాలంలో నిర్వహించిన సమావేశాలు / సమావేశాలకు జైశంకర్, వాంగ్, లావ్‌రోవ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. లావ్‌రోవ్ ఆర్ఐసి అధ్యక్ష పదవిని జైశంకర్‌కు అధికారికంగా అందజేశారు. ఇకపై రష్యా భారత్, చైనా సమావేశాలు ఏడాది పాటు జరపాల్సి ఉంటుంది.

Leave a Reply