Take a fresh look at your lifestyle.

ధాన్యం కొనుగోళ్లలో ఉమ్మడి నల్గొండ టాప్‌

‌ధాన్యం కొనుగోల్లో రాష్ట్రంలో ఉమ్మడి నల్గొండ జిల్లా అగ్రభాగాన నిలిచిందని గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. గురువారం సూర్యాపేట నియోజకవర్గ ప్రజాప్రతినిధు)తో జరిగిన టెలీ కాన్పరెన్స్‌లో ఆయన మాట్లాడారు. సూర్యాపేట జిల్లాలో దిగుబడి మునుపెన్నడు ఊహించని రీతిలో వచ్చిందని తెలిపారు. అందుకు ముఖ్య మంత్రి కేసీఆర్‌ ‌శ్రమ దాగి ఉందని కొనియాడా రు. యావత్‌ ‌భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రం ధాన్యం కొనుగోల్లో ముందు ఉండి, అందులో ఉమ్మడి నల్గొండ జిల్లా ముందు ఉండటం శుభపరిణామమని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 10లక్షల పైచిలుకు మెట్రిక్‌ ‌టన్నుల ధాన్యం కొనుగోలు జరిగితే అందులో 5లక్షల మేర మెట్రిక్‌ ‌టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసిన జిల్లాగా ఉమ్మడి నల్గొండ నిలించిందని వెల్లడించారు. వ్యవసాయ శాఖ చరిత్రలోనే ఇది మొదటి సారి అని అన్నారు. కొనుగోలులో ప్రభుత్వం పొటీకి దిగడంతో రైతుకు మద్దతు ధర లభించిందని తెలిపారు.

సూర్యాపేట జిల్లాలో యాసంగి పంటలో ఇంత దిగుబడి రావడానికి కాళేశ్వరం రూపంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అం‌దించిన వరమని అన్నారు. గోదావరి జలాలు పరుగులు పెట్టడంతో సమృద్దిగా పంటలు పండించుకొని దిగుబడిలో రికార్డు సృష్టించిన రైతాంగం సంబురాలు చేసుకునే తరుణంలో కరోనా వైరస్‌ ‌ప్రబలడం మన దురదృష్టమని పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు ఐకేపీ కేంద్రాలకు తరలించడం తోపాటు రైస్‌ ‌మిల్లర్లతో అధికారులు జరిపిన సమన్వయం కూడా ధాన్యం కొనుగోలు వేగవంతంగా జరగడానికి దోహదపడిందని తెలి పారు. ప్రజాప్రతినిధులు ఎప్పటికప్పుడు అధికారులతో సమన్వయంతో మిగిత ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని సూచించారు. కనపడని శత్రువు కరోనాను తరిమికొట్టడానికి భౌతిక దూరం పాటించడమే ప్రధాన ఆయుధమని అన్నారు. రోగనిరోదక శక్తిపెంచుకొవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని సూచించారు.

Leave a Reply