Take a fresh look at your lifestyle.

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై ఉమ్మడి ఉద్యమం

  • ఆగస్ట్ 2,3 ‌తేదీల్లో చల్లో ఢిల్లీ కార్యక్రమం చేపడతాం
  • పోలవరం నిర్వాసితులకు న్యాయం కోసం 5న ఢిల్లీలో ధర్నా
  • సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వెల్లడి

విజయవాడ,జూలై 27: పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణలపై ఏపీకి అన్యాయం చేసేలా కేంద్ర మంత్రుల సమాధానాలుండడం విచారకరమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ తప్పదని కేంద్రం కఛ్చింతగా చెబుతున్నా అధికార పార్టీ ఏం చేయబోతున్నదో చెప్పడం లేదన్నారు. గళవారం ఆయన మాట్లాడుతూ పోలవరం జాతీయ ప్రాజెక్టు పూర్తి నిర్మాణ బాధ్యత కేంద్రానిదే అయినప్పటికీ 2014 ఏప్రిల్‌ అం‌చనా వ్యయమే భరిస్తామని కేంద్ర మంత్రి షెకావత్‌ ‌సమాధానమివ్వడం దుర్మార్గమన్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించి తీరుతామని కేంద్ర మంత్రులు పదే పదే మొండి వైఖరితో సమాధానం ఇవ్వడాన్ని ఖండిస్తున్నామన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఆగస్టు 2, 3 తేదీల్లో చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. పోలవరం నిర్వాసితులకు న్యాయం చేయాలని డిమాండ్‌ ‌చేస్తూ ఆగస్టు 5న ఢిల్లీలో ధర్నా నిర్వహిస్తామన్నారు. ఏపీలోని అన్ని రాజకీయ పార్టీలు సమైక్యంగా పోరాడాల్సిన తరుణమిదని రామకృష్ణ పిలుపిచ్చారు.

పోలవరం, విశాఖ స్టీల్‌ ఎ•-‌లాంట్‌ ‌ప్రైవేటీకరణపై.. ఏపీకి అన్యాయం చేసేలా కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై ఉమ్మడి పోరాటాలకు సిద్దం కావాలని రామకృష్ణ పేర్కొన్నారు. ఇకపోతే కేంద్రం తీరు ప్రజలపై భారం మోపేలా ఉందన్నారు. కేంద్రంలో బిజెపి అధికారంలోకొచ్చిన ఏడు సంవత్సరాల్లో ప్రజలపై 36 లక్షల కోట్లు భారం మోపిందన్నారు. కేరళలో పినరయి విజయన్‌ ‌ప్రభుత్వం వ్యాట్‌ ‌తగ్గించి భారం పెరగకుండా జాగ్రత్తలు తీసుకుందన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం ఏ తెలియనట్లు వ్యవహరిస్తోందని వెంటనే వ్యాట్‌ ‌తదితర ట్యాక్స్‌లు తగ్గించాలని డిమాండ్‌ ‌చేశారు. జిఎస్‌టిలో 25 శాతం పన్నులు మించకూడదన్న నియమం పెట్టిన కేంద్ర ప్రభుత్వం పెట్రోలు, డీజిల్‌లపై మాత్రం 150 నుండి 200 శాతం పన్నులు విధించడం ఏ విధంగా సరైందని ప్రశ్నించారు. పన్నుల పెంపు, ప్రజలపై భారాలు వేయడం తప్ప మరో పనిలేదన్నట్లు కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో జగన్‌ ‌ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని తెలిపారు. వెంటనే కేంద్ర ప్రభుత్వ చర్యలను రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోవాలని అన్నారు.

Leave a Reply