Take a fresh look at your lifestyle.

ఉమ్మడి మెదక్‌ ‌జిల్లా వ్యాప్తంగా.. రైతు బంద్‌ ‌సూపర్‌ ‌సక్సెస్‌

  • ‌తూప్రాన్‌లో మంత్రి హరీష్‌రావు ధర్నా
  • సంగారెడ్డిలో జగ్గారెడ్డి, జెట్టి హైవే దిగ్బంధనం
  • బిజెపి మినహా పాల్గొన్న అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు

కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా  ఉమ్మడి మెదక్‌ ‌జిల్లా వ్యాప్తంగా మంగళవారం ధర్నాలు, రాస్తారోకోలు, బైక్‌ ‌ర్యాలీలు, హైవేల దిగ్భందనం కొనసాగింది.  ఈ ఆందోళనలో భారతీయ జనతా పార్టీ మినహా కాంగ్రెస్‌, ‌టిఆర్‌ఎస్‌, ‌సిపిఐ, సిపిఎంతో పాటు వివిధ  ప్రజా సంఘాల ప్రతినిధులు పెద్దయెత్తున పాల్గొన్నారు. రైతులు తలపెట్టిన భారత్‌ ‌బంద్‌కు అధికార  పార్టీ మద్దతివ్వడంతో ఈ ఆందోళనలో టిఆర్‌ఎస్‌ ‌పార్టీ శ్రేణులు పెద్దయెత్తున పాల్గొన్నాయి. రైతులకు మద్దతుగా నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా టిఆర్‌ఎస్‌ ‌కార్యకర్తలు, రైతులు ఆందోళనలకు దిగారు.  రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు తూప్రాన్‌ ‌వై జంక్షన్‌ ‌వద్ద జరిగిన ధర్నాలో పాల్గొన్నారు.

 

మెదక్‌ ఎం‌పి కొత్త ప్రభాకర్‌రెడ్డి, టిఆర్‌ఎస్‌ ‌పార్టీ రాష్ట్ర నాయకుడు కోమటిరెడ్డి వెంకట్‌ ‌నర్సింహారెడ్డి(కేవీఎన్‌ఆర్‌) 44‌వ జాతీయ రహదారిపై బైఠాయించారు. రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ ‌వంటేరు ప్రతాప్‌రెడ్డి రాజీవ్‌ ‌రహదారిపైన గల ప్రజ్ఞాపూర్‌ ‌రోడ్డుపై బైఠాయించారు. రాజీవ్‌ ‌రహదారిపైన సిద్ధిపేట జిల్లా పరిషత్‌ ‌ఛైర్‌ ‌పర్సన్‌ ‌వేలేటి రోజాశర్మ, టిఆర్‌ఎస్‌ ‌నాయకులు, ప్రజాప్రతినిధులు రాధాకృష్ణశర్మ, కాముని శ్రీనివాస్‌, ‌ముక్కిస సత్యనారాయణరెడ్డి, ములకల కనకరాజు, మొసర్ల మధుసూదన్‌రెడ్డి, పానుగంటి రమేష్‌, ‌కాముని ఉమేశ్‌తో పాటు వందలాది సంఖ్యలో టిఆర్‌ఎస్‌ ‌శ్రేణులు పాల్గొన్నారు.

జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో నాందేడ్‌-అకోలా జ•తీయ రహదారిపైన జరిగిన ఆందోళన కాంగ్రెస్‌ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్‌రెడ్డి అలియాస్‌ ‌జగ్గారెడ్డి, కాంగ్రెస్‌ ‌పార్టీ వర్కింగ్‌ ‌ప్రెసిడెంటు జెట్టి కుసుమకుమార్‌, ‌కాంగ్రెస్‌ ‌పార్టీ జిల్లా అధ్యక్షురాలు తూర్పు నిర్మలా జగ్గారెడ్డి, ఆమె తనయుడు తూర్పు భరత్‌సాయిరెడ్డి పాల్గొన్నారు. ఈ ఆందోళనలో కాంగ్రెస్‌ ‌పార్టీ శ్రేణులు పెద్దయెత్తున రావడంతో హైవేపై భారీగా ట్రాఫిక్‌ ‌స్తంభించింది. దీంతో జగ్గారెడ్డి, ఆయన  కుమారుడు భరత్‌సాయిరెడ్డిని పోలీసులు అరెస్టు చేసి పోలీస్‌ ‌స్టేషన్‌కు తరలించారు. సంగారెడ్డి జిల్లాలోని జిన్నారం గ్రామానికి చెందిన రైతులు ఉరి తాళ్లతో నిరసన తెలిపారు. కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలతో రైతులకు మిగిలేది ఉరి తాళ్లే అని రైతులు వాపోయారు. అగ్రి బిల్లులను కేంద్రం తక్షణమే ఉపసంహరించుకోవాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని రైతులు హెచ్చరించారు.

 

దేశానికి అన్నం పెట్టే రైతులను కార్పొరేట్లకు కట్టబెట్టడం సరికాదని రైతులు మండిపడ్డారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేటలో బైక్‌ ‌ర్యాలీని నిర్వహించిన అనంతరం కొత్త  బస్టాండ్‌ ‌వద్ద అఖిలపక్షం ఆధ్వర్యంలో  ధర్నా చేసిన అనంతరం కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. ఈ ఆందోళనలో  కాంగ్రెస్‌, ‌సిపిఐ, సిపిఎం పార్టీ నాయకులు దర్పల్లి చంద్రం, బొమ్మల యాదగిరి, అత్తు ఇమామ్‌,‌మంద పవన్‌, ఆముదాల మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. దుకాణ సముదాయాలు కూడా తెరుచుకోలేదు. అన్ని రంగాల వారు బంద్‌లో స్వచ్ఛందంగా పాలొన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బంద్‌ ‌ప్రశాంతంగా ముగిసింది. బంద్‌ ‌సక్సెస్‌ అయింది.

Leave a Reply