Take a fresh look at your lifestyle.

ఉమ్మడి ఎపి మాజీ సిఎం కొణిజేటి రోశయ్య కన్నుమూత

మూడ్రోజుల సంతాప దినాలు..నేడు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు
సీనియర్‌ ‌రాజకీయ నాయకుడు, ఉమ్మడి ఆంధప్రదేశ్‌ ‌మాజీ సీఎం, తమిళనాడు మాజీ గవర్నర్‌ ‌కొణిజేటి రోశయ్య కన్నుమూశారు. కొణిజేటి రోశయ్య 1933, జూలై 4న గుంటూరు జిల్లా వేమూరు గ్రామంలో జన్మించారు. 88 ఏళ్ల రోశయ్యకు శనివారం ఉదయం ఒక్కసారిగా బీపీ పడిపోయింది. దీంతో వెంటనే ఆయన కుటుంబసభ్యులు హైదరాబాద్‌ అవి•ర్‌పేట్‌లోని ఆయన ఇంటి నుంచి స్టార్‌ ‌హాస్పిటల్‌కి తరలించారు. అయితే మార్గమధ్యలోనే ఆయన తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు నిర్దారించారు. బంజారాహిల్స్ ‌స్టార్‌ ‌హాస్పిటల్‌ ‌నుంచి రోశయ్య నివాసానికి ఆయన భౌతికకాయాన్ని తరలించారు. కాంగ్రెస్‌ ‌పార్టీకి ఆయన విశేష సేవలు అందించారు.

కాంగ్రెస్‌తో సహా అన్ని పార్టీల నాయకులతో ఆమనకు సత్సంబంధాలు నెలకొల్పి అజాత శత్రువుగా పేరు తెచ్చుకున్నారు. ఆదివారం గాందీభవన్‌కు ప్రజల సందర్శనార్థం ఆయన పార్థీవ దేహాన్ని తరలిస్తారు. అధికార లాంఛనాలతో ఆదివారం మధ్యాహ్నం ఆయన అంత్యక్రియలు నిర్వహిస్తారు. రోశయ్య మృతితో రాష్ట్రంలో మూడు రోజుల సంతాపదినాలు ప్రకటించారు. తొలిసారిగా1979లో టంగుటూరి అంజయ్య ప్రభుత్వంలో రవాణ, గృహ నిర్మాణం, వాణిజ్య పన్నుల శాఖల మంత్రిగా పని చేశారు. ఆ తరువాత అనేక ముఖ్యమంత్రుల హయాంలో పలు కీలకమైన శాఖలు నిర్వహించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆర్థిక మంత్రిగా 15 సార్లు బడ్జెట్‌ ‌ప్రవేశపెట్టారు. ఆ తర్వాత ఆయన ఉమ్మడి ఆంధప్రదేశ్‌ ‌మ్యుమంత్రిగా, తమిళనాడు గవర్నర్‌గా కూడా పని చేశారు.

అధికారిక లాంఛనాలతో రోశయ్య అంత్యక్రియలు..మూడురోజులు సంతాప దినాలు
ఉమ్మడి ఆంధప్రదేశ్‌ ‌ముఖ్యమంత్రి రోశయ్య మృతిపట్ల రాష్ట్ర ప్రభుత్వం సంతాపం ప్రకటించింది. ఆయన అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని ప్రభుత్వ నిర్ణయించింది. మూడు రోజులపాటు సంతాప దినాలుగా ప్రకటించింది. ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్‌లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేయాలని రంగారెడ్డి,

Leave a Reply