సీఎం రేవంత్‌ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరికలు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 7: ఖమ్మం మున్సిపల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌కు చెందిన పలువురు కార్పొరేటర్లు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్‌్‌ నుంచి కాంగ్రెస్‌లో చేరారు. కార్పొరేటర్లు దనియాల రాధ, తోట ఉమారాణి, రుద్రగాని శ్రీదేవిలు కాంగ్రెస్‌లో చేరారు. ఇటీవల బీఆర్‌ఎస్‌్‌ నుంచి కాంగ్రెస్‌లో చేరిన కార్పొరేటర్లు సీహెచ్‌.లక్ష్మి, జి.చంద్రకళ, డి.సరస్వతి, అమృతమ్మ, ఎం.శ్రావణిలు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. అలాగే పలువురు కాంగ్రెస్‌ శ్రేణులు కూడా సీఎంను కలిశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మట్టా రాగమయి, తుమ్మల యుగంధర్‌, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *