Take a fresh look at your lifestyle.

సైన్యంలో చేరనివండి ..! లేదా పనైనా ఇవ్వండి

బాధేస్తోంది చాలా బాధేస్తోంది ఏం చేయలేకపోతున్నామే అని చాలా బాధేస్తోంది, ఈ అవమానాలను భరించలేకపోతున్నామే అని చాలా బాధేస్తోంది. అమ్మానాన్నలు కష్టపడి చదివించి, పెద్దచేసి గొప్ప గొప్ప చదువులు చదివించిన వారి కోసం జీవితంలో ఎంతో ఉన్నతస్థాయికి చేరుకోవలాని పరితపించే నేటి యువతను ప్రపంచం వెక్కిరిస్తుంది.

చదివిన చదువులకు తగ్గ పనిలేక అసలు ఏ పని దొరక్క, ఏం చేయాలో తెలియక యువత గోస తీస్తుంది. మనసులో ఎంతో సాధించాలనే తపన ఉన్న సరైన మార్గాలు లేక ఏళ్లకుయేళ్ళు జీవితం మీద ఆశతో ఎలాగైనా ఆశయాల కోసం బ్రతకలని అనుకొనే యువతకు నిరాశనిస్పృహలు రగులుకొల్పుతుంది ఈ సమాజం.
పనిచేయడానికి సిద్ధంగా ఉన్న యువత మన దగ్గర కోట్లలో ఉన్నారు. వారికి ఉపాధి కల్పించాలి, అలాగని వాళ్ళకి లక్షల-లక్షల జీతాలు ఇవ్వమని కాదు. కనీస వేతనం కల్పించి బ్రతుకుకు భరోసా ఇవ్వాలి. మన యువతను అన్ని రంగాల్లో ఉపాధి కల్పిస్తే మన దేశం ప్రపంచంలోనే అగ్రరాజ్యం అవుతుంది. చాలామంది యువత జీవితంలో ఏం చెయ్యాలో తెలియక పక్కదోవ పట్టి చెడిపోతున్నారు. ఇలా బ్రతకడం ఎవరికి ఇష్టం ఉండదు. అన్ని రంగాల్లో యువతను భాగస్వామ్యం చేసుకోవాలి. ఉదాహరణకి ఒకడికే లక్ష రూపాయల జీతం ఇచ్చే బదులు నలుగురికి పాతికవేళ్ళ చొప్పున జీతం ఇస్తే నాలుగు కుంటుంబాలు బాగుపడతాయి. అలా అందరికి ఉపాధి కల్పించాలి, ఎవరైనా ఉద్యోగంలో తప్పుచేస్తే వాళ్ళకి తగిన కౌన్సెలింగ్‌ ఇచ్చి, అప్పటికి తప్పు చేస్తే శిక్షించాలి. ఇలా చేస్తే నిజంగా మనదేశం శక్తిమంతం అవుతుంది.

యువతను సైన్యంలోకి ఎక్కువగా ప్రోత్సహించాలి, వారు మన దేశ ఔన్నత్యన్నీ తెలుసుకున్న తర్వాత వారి చదువుకు తగ్గ ఉపాధి కల్పించాలి, లేకపోతే కనీసం వారిని కనీస వేతనంతో మున్సిపాలిటీ డిపార్ట్మెంట్‌ ‌లో కొన్నిరోజులు ఐన తీసుకోండి,ఒక్క నెలరోజుల్లో స్వచ్ఛ భారత్‌ ‌నినాదంను నిజం చేసి చూపుతారు. భారత్‌ ‌లో కొన్ని ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబై, హైదరాబాద్‌, ‌చెన్నై, బెంగళూరు మొదలైన నగరాల్లో స్క్రాప్‌ ‌తీయడం కోసం కొన్ని వేలకోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నం. అదే సొమ్మును ఉద్యోగాలు ఇచ్చి జీతాల ఇవ్వండి, చెత్త తీయడం వల్ల ఎంత మంచి జరుగుతుందో యువతకు తెలుస్తుంది, దాని తర్వాత వారిని వారి చదువుకు తగ్గ ప్రభుత్వ శాఖలకు పంపండి ఒక్కరు కూడా కుళ్ళిపోయిన అవినీతి చేయరు. ప్లీస్‌ ఆలోచించండి మా యువతకు అవకాశం ఇవ్వండి,’’మేం పని చేస్తాం, కష్టపడి పనిచేస్తాం, మహానైపుణ్యంగా పని చేస్తాం, అదే ప్రపంచం అన్నట్లు పని చేస్తాం, ఎవరూ వేలెత్తి చూపలేనంత గొప్పగా పని చేస్తాం, ఎవరు అజమాయిషీ చేయాల్సిన అవసరమే లేకుండా పనిచేస్తాం, ఆ పనిలోనే ఆనందాన్ని అనుభవిస్తాం’’. విలువలేకుండా జీవితాంతం బ్రతికేకంటే మంచి విలువతో ఒక్క రోజన్న బ్రతుకుతాం, మన దేశాన్ని గొప్పగా తీర్చిదిద్దుతాం.
– వెంకట్‌ ‌మణిధర్‌ ‌కొనసి,వీ.•వ•ష్ట్ర.,(దీ.జు•), 957305248.

Leave a Reply