Take a fresh look at your lifestyle.

స్పిన్‌ ‌దిగ్గజకు జోహార్‌

‌స్పిన్‌ ‌మాంత్రికుడు
క్రికెట్‌ ‌క్రీడా దిగ్గజుడు
ప్రపంచ మేటి ఆటగాడు
షేన్‌ ‌వార్న్ ఊపిరి ఆగింది
క్రీడా జగతి శోకసంద్రమైంది

తీక్షణ దృస్థి మంత్రంగా
మణికట్టు విద్య అస్త్రంగా
బంతి విన్యాసం శాస్త్రంగా
ప్రత్యర్థుల పతనం లక్ష్యంగా
విజయ ప్రస్థానం సాగించాడు

లెగ్‌ ‌స్పిన్‌కు ప్రాణప్రతిష్ఠ చేసి
క్రికెట్‌ ‌క్రీడకు వన్నెలద్ధినవాడు

అద్భుత క్రీడా నైపుణ్యంతో
అలవోకగా వికెట్లు గిరాటేసి
ప్రత్యర్థులను చిత్తు చేసాడు
అభిమానుల్ని అలరించాడు

అద్వితీయ ప్రదర్శనతో
దశాబ్దంన్నర కాలం పాటు
క్రికెట్‌ ‌రంగాన్ని శాసించాడు
సరికొత్త చరిత్ర సృష్టించాడు

వ్యాఖ్యాతగా విశ్లేషకునిగా
ఆస్ట్రేలియా జట్టు సారధిగా
విభిన్న పాత్రల పోషించాడు

ఆల్‌ ‌టైమ్‌ ‌లెజెండ్‌
‌లెగ్‌ ‌స్పిన్‌ ‌సామ్రాట్‌
‌షేన్‌ ‌వార్న్ అస్తమించినా
క్రికెట్‌ ‌ప్రేమికుల హృదిలో
స్పూర్తి దీపలా ప్రభవిస్తాడు

ప్రపంచ క్రీడా జగత్తులో
కీర్తి తారకలా ప్రకాశిస్తాడు

(షేన్‌ ‌వార్న్ ‌కు అక్షర నివాళి అర్పిస్తూ…)

 – కోడిగూటి తిరుపతి, 9573929493

Leave a Reply