Take a fresh look at your lifestyle.

తెలంగాణ వీరులకు జోహార్‌ !

నిజాం రాజ్యం నేలమట్టమైన తరుణం
బానిస సంకెళ్లు తెగిన స్వేచ్చ సందర్భం
అదే తెలంగాణ చారిత్రక దినం సెప్టెంబర్‌ 17

‌బూర్జువా వ్యవస్థను
భూస్వాముల దోపిడీని
పెత్తందారీ పోకడ దిక్కరిస్తూ
సాగిందే తెలంగాణ సాయుధ పోరాటం

భూమి కోసం , భుక్తి కోసం
తరాల దాస్య విముక్తి కోసం
ఉద్యమాలను ఉరకలెత్తించిన ఘట్టం

నిరంకుశ పాలనకు వ్యతిరేకిస్తూ…
పిల్లాపాపలు,మహిళలు వృధులు
సబ్బండ వర్గాలు బరిసె గుత్పలు పట్టి
నిజాం మిలిట్రీని, రజాకార్ల మూకలను
తన్ని తరిమి కొట్టిన చారిత్రక సమయం

బాంచెన్‌ ‌కాల్మొక్త బదులుగా
బద్మాష్‌ ‌నీ జులుమేందిరా అంటూ
నింగినంట నినాదమెత్తిన పౌర సైన్యం

బండెనుక బండిగట్టి పదారు బండ్లుగట్టి
ఏ బంద్లో వస్తవ్‌ ‌కొడకో నైజం సర్కరోడా
అంటూ ఎర్ర జెండా నీడన నడిచిన దళం

చాకలి ఐలమ్మ, మల్లు స్వరాజ్యం
దొడ్డి కొమురయ్య నారాయణ రెడ్డి
ఇలా ఎందరో అమరుల త్యాగత్వం
మరెందరో యోధుల పరాక్రమ ఫలం
నేటి తెలంగాణ స్వరాజ్య స్వరూపం

విలినమో విమోచనమో ఏదైతేనేమి
ఈ మహా చారిత్రక శుభ సందర్బంగా

అమరులకు విప్లవ జోహార్‌ అర్పిదాం
యోధులకు పోరు నీరాజనం పలుకుదాం

(సెప్టెంబర్‌ 17 ‌తెలంగాణ చారిత్రక దినం సందర్బంగా…)
కోడిగూటి తిరుపతి, 9573929493

Leave a Reply