Take a fresh look at your lifestyle.

ఆర్థిక పురోగతితో పాటు ఉద్యోగావకాశాలు పెరగాలి

4.7 శాతం ఉన్న నిరుద్యోగ యువతకు అవకాశాలు రావాలి
ఐటి పురోభివృద్దిలో భిన్నాభిప్రాయాలు లేవన్న ఎమ్మెల్సీ కాంగ్రెస్‌ ‌జీవన్‌ ‌రెడ్డి

ఆర్థిక పురోగతితో పాటు స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించి నప్పుడే నిజమైన అభివృద్ధి అని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. మండలిలో మాట్లాడుతూ ఐటీ పురోగతిపై తమకు భిన్నాభిప్రాయాలు లేవని జీవన్‌రెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలో 4.7 శాతం నిరుద్యోగ యువత ఉన్నారని, రాష్ట్రంలో 10 వేలకు పైగా పరిశ్రమలు మూత పడ్డాయని జీవన్‌రెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు వీటిలో 350 మాత్రమే తెరిపించారని జీవన్‌రెడ్డి తెలిపారు. పరిశ్రమలు, ఐటీ రంగంలో తెలంగాణ సాధించిన వృద్ధి విషయంలో ఎలాంటి భిన్నాభిప్రాయాలు లేవని స్పష్టం చేశారు.

ఉద్యోగాలు, ఐటీ ఎగుమతులు, పరిశ్రమల ఏర్పాటు విషయంలో తెలంగాణ ప్రభుత్వం చెబుతున్న గణాంకాలతో ఆయన ఏకీభవించారు. కిటెక్స్ ‌వస్త్ర పరిశ్రమ వంటి ప్రముఖ పరిశ్రమను తెలంగాణకు తీసుకురావడం గొప్ప విషయం అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌మంచి పని చేశారని మెచ్చుకున్నారు. పరిశ్రమలు, ఐటీ వృద్ధి అంశంపై మండలిలో జరిగిన స్వల్పకాలిక చర్చలో ఆయన మాట్లాడారు. పెద్ద సంఖ్యలో ఉన్న ఐటీ ఉద్యోగాల్లో తెలంగాణ యువతకు ఎక్కువగా అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. దీనికి స్పందించిన ఐటీ మంత్రి కేటీఆర్‌.. ‌పరిశ్రమల్లో తెలంగాణ యువతకు ఉద్యోగాలు కల్పించే విషయంలో ప్రత్యేక విధానాన్ని అనుసరిస్తు న్నామని, కంపెనీల ఇష్టానుసారం ఇక్కడి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే ప్రత్యేకంగా రాయితీలు, ప్రోత్సహకాలు అందిస్తున్నట్లు చెప్పారు. కంపెనీలకు, స్థానిక యువతకు ఉపయోగపడేలా చర్యలు తీసుకుంటున్నట్లు కేటీఆర్‌ ‌తెలిపారు.

Leave a Reply