కాళోజీజంక్షన్: ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయలని బీసీ విద్యార్థి సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కల్లూరి పవణ్ అన్నారు. పవన్ మాట్లడుతూ ఉద్యొగం రాలేదని మనస్థాపంతో ఓయూ స్కాలర్ నర్సయ్యా ఆత్మహత్య పై ప్రభుత్వం బాధ్యత వహించాలని అన్నారు .వివిధ శాఖలలో ఖాళీలు ఉన్న ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వడం లేదని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం రెండవ సారి అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు ఉద్యోగ నోటిఫికేషన్ వేయ లేదని, దీనితో నిరోద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్ జారీ చేసి యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమండ్ చేసారు. నర్సయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమండ్ చేశారు. కార్యక్రమంలో బీసీ నాయకులు కరణ్, దీక్షిత, ధీరజ, వంశీ, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.