Take a fresh look at your lifestyle.

జాబ్‌కార్డు ఉన్నవారికి 4 నెలల పాటు సరుకులు ఇవ్వాలి

బూర్గంపాడు మండలం మేతె గ్రామంలో తుమ్మలొ ఉపాధి పని చేస్తున్న ఉపాధి కూలీలు ఇరవెండి పై కోతురు ఇరవెండీ గ్రామం మేతె కోతురు మెత్త 4 గ్రామల నుండి 550 మంది పాల్గొన్నారు. గురువారం నాడు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు బత్తుల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జాబ్‌ ‌కార్డ్ ఉన్న ప్రతి కుటుంబానికి 7500 రూపాయలు ఇవ్వాలని నాలుగు నెలలపాటు నెలకి 50 కేజీలు సన్నబియ్యం ఇవ్వాలని మాస్కులు ఇవ్వాలని కార్మికులతో నినాదాలు ఇవ్వడం జరిగింది.

కరోనా వైరస్‌ ‌దేశమంతా రావడం వల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌ ‌డౌన్‌ ‌విధించడం వల్ల ప్రతి ఒక్కరు ఇంట్లోనే ఉండటం వల్ల ఆర్థికంగా చితికిపోయిన కుటుంబాలు వ్యవసాయ కార్మిక కుటుంబాలు ఉపాధి కార్మికులు ప్రభుత్వం వారి డిమాండ్‌ అని పరిగణలోకి తీసుకోవాలని వారి ఆవేదనని అర్థం చేసుకోవాలని కడుపునిండా తిండి లేకపోతే అనురాగానికి గురయ్యే పరిస్థితి ఉంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్‌ ఉన్నతాధికారులు ఉపాధి కూలీ యొక్క సమస్యల్ని అర్థం చేసుకొని వారికి తగిన న్యాయం చేయాలని కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో కనకం వెంకటేశ్వర్లు గుమ్మడి మంగ, అన్నపూర్ణ తుమ్మల నాగలక్ష్మి , తుమ్మల గురు స్వామి ,గుద్ది నరసరావు ,కోటేశ్వరరావు తుమ్మల వెంకటేశ్వర్లు ,రావులపల్లి వెంకటేశ్వర్లు , శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply