Take a fresh look at your lifestyle.

జీవన ఎడారి

నేను క్షేమమే
మా అవిడ క్షేమమే
నా వాళ్లంతా క్షేమమే

కానీ..
ఎదుటి వాళ్లు క్షేమంగా
ఉంటేనే…
అదేదో అసూయ ఈర్ష
ద్వేషం తెలియకుండానే
నా నర నరనా పాతుకు
పోయిందేమో..

పాత కాలపు కుళ్ళి
పోయి కంపు గొట్టిన
భావ దారిద్య్రం..
ఎనుకటి చీకటి చాటు
అంటరానితనమై..

పరాయి అయిపొయింది
నేను వర్తమానం లో  కూడ
ఆ వాసనల్ని వదలలేక
అపుడపుడు..

నా ఇగో నన్ను పరాయి ని
చేస్తూంటుందీ.!
మారాలని వున్నా
కొత్త నెత్తురుని
హత్తుకోవాళ్ళన్నా
అది ఎండమావిలా
నన్ను వెక్కిరిస్తున్నే  వుంది
కాకుల గుంపుల్లో కోయిలలా
నన్ను వెలివేస్తున్నే వుంది

ఇప్పుడన్నా..
ఈ గుండె బరువు దించుకోవటానికి
ఎదుటి వాళ్ళ క్షేమాన్ని
కోరుకుంటే తప్ప..

వాళ్ళతో కలిసి సహజీవనం
చేస్తే తప్ప..
ఈ జీవన ఎడారిలో
ఓయాసిస్సుల
పూలు  పూయావు మరి.!
– రవీందర్‌ ‌కొండా, 9848408612
ఆల్వాల్‌, ‌హైదరాబాద్‌

Leave a Reply