Take a fresh look at your lifestyle.

జేఈఈ మెయిన్‌ ‌తొలి విడుత పరీక్షా ఫలితాలు విడుదల

న్యూ దిల్లీ, ఫిబ్రవరి 7 : దేశంలోని ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో ఇంజినీరింగ్‌ ‌కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్‌ 2023 ‌తొలి విడత పరీక్షా ఫలితాలు మంగళవారం ఉదయం విడుదల య్యాయి. సోమవారం ఉదయం తుది కీని ఎన్‌టీఏ(నేషనల్‌ ‌టెస్టింగ్‌ ఏజెన్సీ) సోమవారం ఉదయం విడుదల చేసిన సంగతి తెలిసిందే. జేఈఈ మెయిన్‌ ‌ఫలితాల కోసం ఎన్‌టీఏ వెబ్‌సైట్‌ను సందర్శించొచ్చు. ఫలితాల కోసం అప్లికేషన్‌ ‌నంబర్‌, ‌పుట్టిన తేదీ తప్పనిసరి.

గత నెల జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు జేఈఈ మెయిన్‌ 2023 ‌తొలి విడుత పరీక్షలను నిర్వహించిన విషయం విదితమే. ఈ పరీక్షలకు దాదాపు ఎనిమిదిన్నర లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. మరో వైపు జేఈఈ మెయిన్‌ ‌రెండో విడుత పరీక్షలు ఏప్రిల్‌ 6 ‌నుంచి 12వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు హాజరయ్యేందుకు రిజిస్టేష్రన్‌ ‌పక్రియ మంగళవారం ప్రారంభం కానుంది. తొలి విడుత పరీక్ష రాసిన విద్యార్థులు కూడా రెండో విడతకు సైతం దరఖాస్తు చేసుకోవచ్చు.

Leave a Reply