Take a fresh look at your lifestyle.

యాదాద్రిలో జయంతి ఉత్సవాలు

యాదాద్రి భువనగిరి,మే24:  యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహా స్వామి వారి బాలాలయంలో సోమవారం స్వామివారి జయంతి ఉత్సవాలు రెండో రోజుకు చేరాయి. ఈ సందర్భంగా స్వామి వారికి లక్ష కుంకుమార్చన అత్యంత వైభవంగా నిర్వహించారు.
ఉదయమే అభిషేకం, నవకలశస్నాపన కైంకర్యాలు చేపట్టారు. అనంతరం స్వామి వారిని కాళీయ మర్దన అలంకార సేవను బాలాలయంలో ఉరేగించారు. సాయంత్రం నరసింహా మూల మంత్ర హావనం చేపట్టి, హనుమంత వాహన పై శ్రీరామవతార సేవలో స్వామి వారిని ఊరేగించనున్నారు.

Leave a Reply