Take a fresh look at your lifestyle.

జయహో.. తెలంగాణా

భూమి కోసం… భుక్తి కోసం
మాతృభూమి విముక్తి కోసం
మట్టి మనుషులు సమైక్యమై
ఉద్యమించిన పోరుగడ్డ ఇది

అణిచివేత వెట్టిచాకిరిలను
వ్యతిరేకిస్తూ సకలజనావలి
సాయుధ పోరెత్తిన రణ క్షేత్రం

ఊరూవాడలు కదం తొక్కి
నిజాం నవాబుకు నిలువున
సమాధి కట్టిన సమరాంగణం

సామాన్యులు సమర సింహాలై
రజాకార్లు దొరల గూండాలను
తరిమికొట్టిన పరాక్రమ నెలవు

బండెనక బండిగట్టి దొర గడీలో
గడ్డి మొలిపించిన  విప్లవ తావు

బాంచెన్‌ ‌దొరా ! అన్న గళాలే
బందూకునెత్తి గర్జించిన నెలవు

నాటి ఉద్యమ ఊసు ఇసుమంత
అంటని కుహనా పార్టీలు ఇపుడు
చరిత్రను వక్రీకరించ పూనుకున్నయ్‌

ఈ ‌రాజకీయ కుట్రల యత్నాలు
తెలంగాణ జనగణం నమ్మబోదు

అయినా ఇది విలీన దినమో…
విమోచన దినమో ఎధైతేనేమి!

ఈ చారిత్రాత్మకమైన రోజున
అమర వీరుల స్మరించుకుందాం
సమర యోధుల కీర్తించుకుందాం
ఘనంగా వేడుకల జరుపుకుందాం
మన వీరగాధలు ఎల్లెడా చాటుదాం

జయహో.. పోరు తెలంగాణా!
విజయహో…వీర తెలంగాణా!!

(సెప్టెంబర్‌ 17 ‌న తెలంగాణాకు స్వేచ్ఛ ప్రాప్తించిన సందర్బంగా..)
 కోడిగూటి తిరుపతి, 9573929493

Leave a Reply