Take a fresh look at your lifestyle.

జయహో రైతన్నా..!

నాగలి
పట్టడమే కాదు
జెండా
పట్టడమూ తెలుసు

దుక్కి
దున్నడమే కాదు
దండయాత్ర
చేయడమూ తెలుసు

ఎరువులు
వేయడమే కాదు
నిరసన దరువులు
వేయడమూ తెలుసు

పంటలు
పండించటమే కాదు
ఉద్యమ మంటలు
పెట్టడమూ తెలుసు

మెతుకు
ఆరాటమే కాదు
బ్రతుకు
పోరాటమూ తెలుసు

పీఠం
ఎక్కించడమే కాదు
పునాది
కదిలించడమూ తెలుసు

ఆర్థికంగా
ఓడిపోవడం కాదు
నైతికంగా
గెలవడమూ తెలుసు

అభినవ సవ్యసాచి
జయహో రైతన్నా

– కయ్యూరు బాలసుబ్రమణ్యం
7780277240

Leave a Reply