Take a fresh look at your lifestyle.

కిసాన్‌పై జవాన్‌ ‌లాఠి..

గిప్పుడైన గప్పుడైన
ఇంకెప్పుడైన పండించేటోనికే బాధలు, బద్నాంలు
ఎదిరిస్తే లాఠీలతో, తూటాలతో దేహాన్ని సాగుచేస్తారు
సేమట సుక్కలు
నెత్తుర్లు కారుతున్నా కనికరించకుండ
ఖాకీబలగాలను దింపుతారు..
టీయర్‌ ‌గ్యాసులు పేలుస్తరు
కడుపు నింపేటోనీ కడుపు కొట్ట సూస్తుండ్రు
కళ్ళల్ల కన్నీళ్ళ తెప్పిస్తర్రు
ఇనుపసంకెళ్ళతో,తీగలతో ,
బారికెడ్లతో బంధించి ,సమస్య గొంతును నులిమేసే
ప్రయత్నాలు ప్రతిసారీ జరిగేవే.
కష్టం కోర్చి పండిన ధాన్యం
అమ్మజూస్తే ధరళ్తో, దళార్లతో లూఠి చేస్తరు
పక్షం రోజులైనా మా ‘‘పక్షం’’ సట్టం సవరించరే
అభద్రత నేడు కూడళ్లలో,
రాజదాని నడిబొడ్డులో నరాలు బిగబట్టి బిగ్గరగా
అరుస్తుంది
ఆలు బిడ్డలుకూడ ఉప్పెనలా ఉద్యమానికి
ఊపిరి ఐతుండ్రు
సెమట సుక్కలు రోడ్లపై అర్దిస్తున్న
మట్టిపాదాలు చేనువిడిచి
రోడ్లపై సట్టసవరణ సేయమని పిడికిలి బిగించిన
పట్టని దోరణి దేనికి సంకేతం
చర్చల పేర ఉట్టి ముచ్చట్లు
సట్టాల్ని మార్చవు…

ఎన్నేముకంటరు
ఎన్నువిరగగొడుతున్నరు
సన్మానించి నా సేతులు
సంకెళ్లతో బందిస్తున్నరు
శ్రమను పుస్తకాలలో పొగిడి
పుడమి బిడ్డలని ఊకదంపుడు ముచ్చట్లుతో
మురిపెంగా దునియాకు సిత్రమే సూపెడుతరు.
సంకనెట్టుకుని సంబురపడెట్టు సేస్తరు
ఆకర్న అంగడిలో సరుకులా
నడిరోడ్డుపైకి రప్పిస్తరు

వీరిది ఆకలికి మద్దతు కొట్లాట
వారిది కార్పొరేట్లా సర్దుబాట్ల తండ్లాటా..
ఇదో అర్ధం కానీ అభివృద్ది ముసుగులో రహస్య వొప్పందం.
రాజులు ,రాజ్యాలు మారిన
వారసత్వ పునాదులు బలపడినంతగ
కర్షకుని కష్టాలు కాల ప్రవాహంలో నిత్యం
కొట్టుకు రావడం
బహు చిత్రం..
జై కిసాన్‌ ‌పై జై జవాన్‌ ‌లాఠీ
‘‘నినాదాన్ని’’ చేస్తుంది లూఠీ.

చర్చలు సఫలమయ్యే
ఆలోచనలు కూసున్నప్పుడు
అధికారంతో
అన్ని సులభమే. …
ఆవైపు పడే ప్రతి అడుగు
అందర్ని సేన్లల్లో వుండేలా
దేశ ఆకలిని తీర్చెలా
అభివృద్ది గాలిలో శ్రమ పరిమళాలతో
వెలసిల్లెలా సేస్తరూ..
ఆవైపుగా ఆచరణ జరగాలని
కోరుకుంటూ…రైతులకు మద్దతుగా
అర్పిస్తున్న అక్షర నివాళి…

నాగరాజు మద్దెల, 6301993211.
(డిల్లీలో రైతు ధర్నా కు మద్దతుగా రాసినా కవిత.)

Leave a Reply