Take a fresh look at your lifestyle.

భారత రాజకీయలలో శక్తివంతమైన జాతీయ వాది- జవాహర్‌లాల్‌ ‌నెహ్రూ

“తొలి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విదేశాంగ విధానంలో సోషలిజం వైపు మొగ్గు చూపి రష్యాతో మైత్రికి ప్రాధాన్యత ఇచ్చారు. చైనాతో పంచశీల ఒప్పందం.. అలీన విధానం ప్రతిపాదించిన త్రిమూర్తులలో నెహ్రూ ఒకరుగా ప్రసిద్ధి చెందారు. అంతేకాదు పంచవర్ష ప్రణాళికలను ప్రారంభించి దేశం ఆర్థికంగా ముందుకు వెళ్లేందుకు ఎంతగానో దోహదం చేశారు.  రాజకీయ నాయకునిగా, స్వాతంత్య్ర సమరయోధునిగా మాత్రమే కాక జవాహర్‌లాల్‌ ‌నెహ్రూ రచయితగా విశిష్టమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు.”

నవ భారత ప్రభుత్వ విధానాలను, రాజకీయ సంస్కృతిని, శక్తివంతమైన విదేశాంగ విధానాన్ని రూపొందించడంలో ముఖ్య పాత్ర వహించారు. సార్వత్రిక ప్రాథమిక విద్యా పధకాన్ని ప్రారంభించి, దేశంలోని మారుమూల గ్రామీణ బాలలకు విద్య అందించ గలిగినందుకు అయన ప్రశంశించబడతారు. పిల్లలపై మాత్రం ప్రత్యేక ప్రేమ, అనురాగాలను చూపేవారు. ఆయనకు పిల్లలపై ఉన్న అభిమానం కారణంగా ఆయన పుట్టినతేదీ నవంబర్‌ 14‌వ తేదీన ప్రతి సంవత్సరం బాలల దినోత్సవాన్ని జరుపుకుంటున్నం భారతదేశంలో బాలల దినోత్సవం 1956 నాటిది . పండిట్‌ ‌మరణానికి ముందు . జవహర్‌లాల్‌ ‌నెహ్రూ , భారతదేశం నవంబర్‌ 20 ‌న పిల్లల దినోత్సవాన్ని జరుపుకుంది ( ఐక్యరాజ్యసమితి యూనివర్సల్‌ ‌చిల్డ్రన్స్ ‌డేగా పాటించిన తేదీ ). జవహర్‌లాల్‌ ‌నెహ్రూ మరణం తరువాత, ఆయన జన్మదినాన్ని భారతదేశంలో బాలల దినోత్సవంగా జరుపుకోవాలని భావించారు. అతను పిల్లలతో చాచా నెహ్రూగా బాగా ప్రాచుర్యం పొందాడు కాబట్టి ఇది జరిగింది, అందువల్ల, భారతదేశపు మొదటి ప్రధానమంత్రికి తగిన వీడ్కోలు ఇవ్వడానికి పార్లమెంటులో ఒక తీర్మానం ఆమోదించబడింది.

ఓటమి ఎరుగని జాతీయ వాదిగా నెహ్రూ స్థానం ఆయన,ప్రాంతీయ భేదాలను గుర్తిస్తూ నే అణచి వేయబడిన సామాజిక వర్గాల కొరకు విధానాలు అమలు పరచుటకు దారి చూపింది. స్వాతంత్య్ర -అనంతర కాలంలో ఆంగ్లేయులు ఉపఖండం నుండి విరమించు కొన్న తరువాత, ఉపఖండంలో అంతకు ముందు ఒకే సామాన్య విరోధికి వ్యతిరేకంగా మిత్రులుగా ఉన్న ప్రాంతీయ నాయకులు ఇక నుండి ఒకరికొకరు సంబంధం లేకుండా విభేదాలు పొడసూపిన కాలంలో ఇది ప్రాముఖ్యతను సంతరించు కుంది. సాంస్కృతిక వైవిధ్యం ప్రత్యేకించి భాషా వైవిధ్యం దేశ ఐక్యతను భంగపరచేదిగా ఉన్న సమయంలో, నెహ్రూ నేషనల్‌ ‌బుక్‌ ‌ట్రస్ట్ , ‌నేషనల్‌ ‌లిటరసీ అకాడమీ వంటి సంస్థలను ఏర్పరచి వివిధ భాషల మధ్య అనువాదాలను ప్రోత్సహించారు.

భారత స్వాతంత్య్ర ప్రకటన
జవాహర్‌లాల్‌ ‌నెహ్రూ భారత స్వాతంత్య్ర ప్రకటన చిత్తుప్రతిని తానే తయారు చేసి. దీనిని లాహోర్‌ ‌కాంగ్రెస్‌ ఆమోదించింది. ఇందులో ఒక భాగం ఇలా స్వేచ్ఛ, శ్రమకు తగ్గ ఫలితాన్ని అనుభవిం చగలగడం,  జీవితావసరాలు సంపాదించుకుని ఎదగడానికి అవకాశాలు పొందడం ప్రపంచంలోని అన్ని దేశాల ప్రజల్లాగానే భారత ప్రజల మార్చలేని హక్కు. ఈ హక్కులను ఏ ప్రభుత్వం అయినా నిరాకరించి అణచివేస్తూంటే దాన్ని మార్చడానికి కానీ, ఆ ప్రభుత్వాన్ని రద్దుచేయడానికి కానీ ప్రజలకు హక్కు ఉంటుందని మేం నమ్ముతున్నాం. భారతదేశంలోని బ్రిటీష్‌ ‌ప్రభుత్వం కేవలం భారత ప్రజలకు స్వేచ్ఛను నిరాకరించడమే కాదు, దేశంలోని ప్రజలను దోపిడీ చేసి, భారతదేశాన్ని ఆర్థికంగా, రాజకీయంగా, సాంస్కృతికంగా, ఆధ్యాత్మికంగా నాశనం చేస్తున్నది. దాంతో మేం నమ్మేదేంటంటే: భారతదేశం బ్రిటీష్‌ ‌వారితో సంబంధాలు తెంపివేసుకుని, పూర్ణ స్వరాజ్‌ ‌లేదా పూర్తి స్వాతంత్య్రం సంపాదించాలి.

తొలి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విదేశాంగ విధానంలో సోషలిజం వైపు మొగ్గు చూపి రష్యాతో మైత్రికి ప్రాధాన్యత ఇచ్చారు. చైనాతో పంచశీల ఒప్పందం.. అలీన విధానం ప్రతిపాదించిన త్రిమూర్తులలో నెహ్రూ ఒకరుగా ప్రసిద్ధి చెందారు. అంతేకాదు పంచవర్ష ప్రణాళికలను ప్రారంభించి దేశం ఆర్థికంగా ముందుకు వెళ్లేందుకు ఎంతగానో దోహదం చేశారు.  రాజకీయ నాయకునిగా, స్వాతంత్య్ర సమరయోధునిగా మాత్రమే కాక జవాహర్‌లాల్‌ ‌నెహ్రూ రచయితగా విశిష్టమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. తన మొదటి ప్రధానమైన రచన అయిన గ్లింప్సెస్‌ ఆఫ్‌ ‌వరల్డ్ ‌హిస్టరీని ఉద్దేశపూర్వకంగా పాఠకుల కోసం కాక తన కుమార్తె ఇందిరకు ఉత్తరాలుగా రాశాడు. ఆ ఉత్తరాల్లో ప్రపంచ చరిత్రను వ్రాస్తూ పోయాడు. ఒక ప్రణాళికను అనుసరించి వ్రాసిన ఆ ఉత్తరాలే క్రమేపీ ‘‘గ్లింప్సెస్‌ ఆఫ్‌ ‌వరల్డ్ ‌హిస్టరీ’’ గ్రంథంగా తయారయ్యాయి.   పండిట్‌ ‌నెహ్రూ నింపిన స్ఫూర్తి, ధైర్యంతోనే ఇందిర ‘ఉక్కు మహిళ‘గా రూపొందారు. ప్రధానమంత్రిగా ఆమె పలు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని దేశాన్ని ముందుకు నడిపారు. తన కూతురు ఇందిరకు నెహ్రూ రాసిన ఉత్తరాలు ప్రస్తుత జనరేషనుకు పాఠాలుగా మారాయి. ఆయన చెప్పిన ఎన్నో మంచి మాటలు మనం ఎప్పటికీ ఆచరించదగినవే..

ఒకసారి ఓ మహిళ పార్లమెంట్‌ ‌ప్రాంగణంలోకి వచ్చి, నెహ్రూ కాలర్‌ ‌పట్టుకున్నారు. ఽభారతదేశానికి స్వాతంత్య్రం వచ్చింది. మీరు ప్రధానమంత్రి అయ్యారు. కానీ నాకేం ఒరిగింది?’’ అని ప్రశ్నించారు. దీనికి సమాధానంగా నెహ్రూ, ఽమీరు ఇలా నా కాలర్‌ ‌పట్టుకుని అడిగే అధికారం వచ్చింది’’ అని సమాధానం ఇచ్చారు.తన జీవిత కాలంలో నెహ్రూ భారతదేశంలో ఒక ఆదర్శ మూర్తిగా గుర్తింపబడి, ప్రపంచ వ్యాప్తంగా ఆయన ఆదర్శవాదము మరియు రాజకీయ ధురన్ధరత ప్రశంసించ బడ్డాయి. బాలల మరియు యువజనుల పట్ల నెహ్రూకు గల వాత్సల్యానికి, వారి శ్రేయస్సుకు, విద్యాభివృద్ధికి ఆయన చేపట్టిన కార్యక్రమాలకు గుర్తుగా, ఆయన జన్మ దినమైన 14 నవంబర్‌,‌ను భారతదేశం బాలల దినోత్సవం గా జరుపుకుంటున్నది.

jajula dinesh
జాజుల దినేష్‌ (ఓ.‌యు)
M.A., (B.Ed.), SET
ఉస్మానియా విశ్వవిద్యాలయం
9666238266

Leave a Reply