Take a fresh look at your lifestyle.

అబార్షన్‌ ‌గడువు పొడిగింపు కేంద్ర కేబినేట్‌ ‌నిర్ణయం

Jawadekar, Union Minister, State for Parliament
పార్లమెంట్‌ ‌సమావేశాల్లో పెడతామన్న కేంద్ర మంత్రి జవదేకర్‌

అబార్షన్‌ ‌గడువును పొడిగిస్తూ కేంద్ర కేబినెట్‌ ‌కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం 20 వారాలుగా ఉన్న గరిష్ఠ పరిమితిని 24 వారాలకు పెంచేందుకు నిర్ణయించారు. దీనికి సంబంధించి 1971 నాటి చట్టానికి సవరణ చేస్తూ గర్భవిచ్ఛిత్తి (సవరణ) బిల్లు 2020ను త్వరలో జరగబోయే పార్లమెంట్‌ ‌సమావేశాల్లో ప్రవేశ పెట్టనున్నారు. కేబినెట్‌ ఆమోదం అనంతరం కేంద్ర మంత్రి ప్రకాశ్‌ ‌జావడేకర్‌ ‌డియాతో మాట్లాడుతూ.. గర్భాన్ని సులువుగా తొలగించడంతో పాటు మహిళలకు పునరుత్పత్తి హక్కులను కల్పించేందుకు ఈ బిల్లు తోడ్పడుతుందని చెప్పారు. ముఖ్యంగా అత్యాచార బాధితులు, మైనర్లు తమకు గర్భిణులు కాదో లేదో తెలుసుకునేలోపు ఆ గడువు పూర్తవుతోందని, 24 వారాలా గడువు వారికి ఉపయోగపడుతుందని అన్నారు. దీన్నో ప్రగతిశీల సంస్కరణగా జావడేకర్‌ అభివర్ణించారు. ఈ బిల్లును తీసుకొచ్చేందుకు పలువురితో చర్చించామని, దీనివల్ల మాతా మరణాలు కూడా తగ్గుతాయని పేర్కొన్నారు..అబార్షన్‌ ‌లిమిట్‌ ‌పొడిగింపును ప్రగతిశీల సంస్కరణగా అభివర్ణించారు. ఇది మహిళలకు వారి శరీరాలపై పునరుత్పత్తి హక్కులను ఇస్తుందని ఆయన అన్నారు. పిండం ప్రాణాన్ని కాపాడటంలో పునరుత్పత్తి స్వయంప్రతిపత్తి హక్కు రాష్టాల్ర ఆసక్తిని అధిగమించలేదని, 20 వారాల పరిమితిని గుడ్డిగా పొడిగించలేమని కేంద్రం సుప్రీంకోర్టుకు చెప్పిన నాలుగు నెలల తరువాత ఈ వార్త వచ్చింది. ఈ నిర్ణయం రక్షిత తొలగింపు భరోసా ఇస్తుందని,మహిళలకు తమ శరీరాలపై పునరుత్పత్తి హక్కులు కల్పిస్తుందని జావదేకర్‌ ‌తెలిపారు. ఇది చాలా ముఖ్యమని, ఎందుకంటే చాలా మొదటి ఐదు నెలల్లో చాలామంది మహిళలు తాము గర్భం దాల్చామని తెలుసోలేక ఆ తర్వాత అబార్షన్‌ ‌కోసం కోర్టు మెట్లు ఎక్కాల్సివచ్చిన కేసులు చాలా ఉన్నాయని,ఓ వర్గం మహిళలు,డాక్టర్ల నుంచి అబార్షన్‌ ‌లిమిట్‌ ‌ను పొడిగించాలన్న డిమాండ్‌ ఉం‌దని జావదేకర్‌ ‌తెలిపారు. రాజ్యాంగ ప్రామాణికతను సవాల్‌ ‌చేస్తూ,లిమిట్‌ ‌ను 26వారాలకు పొడించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ ‌పై కేంద్రం స్పందిస్తూ…రాష్ట్రం పౌరుల సంరక్షకుడిగా,గర్భంలో ఉన్న పిండం సాధ్యమయ్యే దశకు చేరుకున్న తర్వాత ఆ ప్రాణాన్ని కాపాడటానికి నైతికంగా విధి కలిగి ఉందని తెలిపింది.

పుట్టని శిశువు తన తండ్రి,లేదా తల్లి తలపెట్టే హానినుంచి తనను తాను కాపాడుకోలేదని తెలిపింది. చాలా కేసుల్లో పదే పదే… ప్రెగ్నెన్సీని తొలిగించుకోవాలనుకున్న మహిళల కన్నా…మానసిక వేదన,గాయాలతో గర్భం దాల్చాలనుకున్న మహిళల్లో 20వ వారం తర్వాత తీవ్రమైన అసాధారణతలు గుర్తించబడినట్లు అధ్యయనాలు చెప్పాయని కూడా ప్రభుత్వం తెలిపింది. ఈ అంశంపై అధ్యయనం చేయడానికి కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్‌ ‌గడ్కరీ అధ్యక్షతన ఓ మంత్రివర్గ ఉపసంఘాన్ని కూడా ఏర్పాటు చేశామని అన్నారు. ఈ ఉపసంఘం ఇచ్చిన సిఫారసులపై కూలంకషంగా చర్చించామని, చట్టంలో సవరణలు చేయడానికి, అందులో కొత్తగా తీసుకుని రావాల్సిన మార్పులు, చేర్పులపై మంత్రుల నుంచి అభిప్రాయాలను సేకరించామని చెప్పారు. ఆ తరువాతే.. ప్రెగ్నెన్సీ చట్టంలో సవరణల ప్రతిపాదనలను ఆమోదించామని చెప్పారు.

Tags: Abortion,extension,Determination, central cabinet,Jawadekar, Union Minister, State for Parliament

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply