Take a fresh look at your lifestyle.

జాతర ఏర్పాట్లను వేగవంతంగా పూర్తి చేయాలి

Medaram Jathra arrangements need to be completed quickly
సమావేశంలో మాట్లాడుతున్న ఇన్‌చార్జి కలెక్టర్‌ ‌కర్ణన్‌

మేడారం జాతర ఏర్పాట్లను వేగవంతంగా చేపట్టి త్వరితగతిన పూర్తి చేయాలని ములుగు ఇంచార్జ్ ‌కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ అధికారులను ఆదేశించారు. మేడారంలోని ఏటూరునాగారం ఐ.టి.డి.ఏ. సమావేశ మందిరంలో బుధవారం జాతర ఉత్సవ ఏర్పాట్లను సంబంధిత సెక్టార్‌ అధికారులతో సమీక్షించారు. జాతర కొరకు చేపట్టిన పనుల ప్రగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ గత జాతరలో చోటుచేసుకున్న సమస్యలను ప్రస్తావిస్తూ ప్రధాన రహదారుల పనులను త్వరితగతిన చేపడుతున్నామన్నారు. అలాగే ప్రాధాన్యత పనులను కూడా చేపడుతూ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు ఏర్పడకుండా నిరంతరం అధికారులతో సమీక్షిస్తూ భక్తులకు సకల సౌకర్యాలు సమకూరుస్తామన్నారు. ఆర్‌ అం‌డ్‌ ‌బి అధికారులతో పడిపోయిన చెట్లను తొలగించేందుకు మొబైల్‌ ‌టీమ్‌ ‌ను ఏర్పాటు చేయాలని అదేశించమన్నారు. జాతరలో గుర్తించిన 29 పార్కింగ్‌ ‌ప్రదేశాలలో లైటింగ్‌ ఏర్పాట్లు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు. జంపన్న వాగు వద్ద ఏర్పాటు చేసిన 132 స్నానఘట్టాలలో నీటిపారుదల అధికారులు నీటి నిల్వలను పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలని సూచించామన్నారు. ప్రతి ఘాట్‌కు ఒక పర్యవేక్షణ అధికారిని తప్పనిసరిగా కేటాయించాలని అదేశించామన్నారు. పనులు పూర్తైన పనుల వివరాల నివేదికలు అందజేయాలన్నారు.

ఒక ప్రధాన వైద్య శిబిరంతో పాటు 18 వైద్య శిబిరాలు ఏర్పాటు చేశామని, అంబులెన్స్ ‌లు అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రధానంగా దేవాలయ ప్రాంగణంలో క్యూలైన్‌లో ఉన్న భక్తుల కొరకు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తూ ఓ.ఆర్‌.ఎస్‌. ‌ప్యాకేట్స్, ‌గ్లూకోజ్‌ ‌ప్యాకేట్స్ అం‌దుబాటులో ఉంచుతున్నామని, భక్తులు ఈ సౌకర్యం వినియోగించుకోవాలని కోరారు. వైద్య శాఖ సిబ్బందితో పాటు రెడ్‌ ‌క్రాస్‌ ‌సొసైటీ కూడా అందుబాటులో ఉండి భక్తులకు సేవాలంది స్తారన్నారు. జాతరకు వచ్చే భక్తులకు 8,400 మరుగుదొడ్లు నిర్మిస్తున్నామ న్నారు. ప్రత్యామ్నాయంలో విద్యుత్‌ ‌కై జాతరలో 2జనరేటర్లు ఏర్పాటు చేశామన్నారు. జాతర ఏర్పాట్లు పటిష్టంగా ఏర్పాటు చేయుటలో భగవంతు డిచ్చిన అవకాశంగా భావించాలన్నారు. ములుగు శాసనసభ్యురాలు సీతక్క మాట్లాడుతూ మేడారం జాతర రాష్ట్ర పండుగని, గిరిజనుల ఆరాధ్యదైవం అయిన సమ్మక్క సారాలమ్మ జాతరను దిగ్విజ యంగా నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని కోరారు. సమావేశంలో జేసి స్వర్ణలత, ఐ.టి.డి.ఏ.పీవోలు గౌతమ్‌, ‌చక్రధర్‌, ఇం‌చార్జ్ ‌డిఆర్‌ఓ ‌రమాదేవి, సెక్టార్‌ అధికారులు పాల్గొన్నారు.

Tags: Incharge Collector Arvy Karnan, Jatra arrangements need, completed quickly,Packets, glucose packets

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply