- రాజ్‌ఘాట్ వద్ద నివాళులర్పించిన ర్రాపతి, ప్రధాని
- బాపూఘాట్ వద్ద నివాళి అర్పించిన గవర్నర్, మంత్రులు
- బాపూజీ ఆలోచనలు పంచుకోవడం అందరికీ స్ఫూర్తి: ప్రధాని మోడీ ట్వీట్
జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా జాతి ఆయనకు ఘనంగా నివాళి అర్పించింది. శనావారం గాంధీజీ వర్ధంతిని దేశానికి ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ దేశవ్యాప్తంగా భక్తి శ్రద్దలతో నిర్వహించారు. ఢిల్లీలో ఆయన సమాధి రాజ్‌ఘాట్ వద్ద రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ తదితరులు మహాత్మునికి అంజలి ఘటించారు. పుష్పగుచ్ఛం ఉంచి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. అంతకు మందు ప్రధాని మోదీ తన ట్విట్టర్ అకౌంట్లో బాపూజీని గుర్తుచేసుకుంటూ… మహాత్ముని వర్థంతి రోజున ఆయనను గుర్తుచేసుకోవడం, ఆయన ఆలోచనలను పంచుకోవడం అందరికీ స్ఫూర్తినిస్తుందన్నారు. భారత స్వాతంత్య సంగ్రామంలో పాల్గొని, తమ ప్రాణాలను అర్పించిన అమర వీరులను గుర్తు చేసుకోవడం అవసరమన్నారు.
హైదరాబాద్ లంగర్‌హౌస్‌లోని బాపుఘాట్ వద్ద గాంధీ విగ్రహానికి పలువురు మ్రుఖులు పూలమాల వేసి నివాళి ఆర్పించారు. మహాత్ముడి విగ్రహాం వద్ద గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. మహాత్ముడికి నివాళులర్పించిన వారిలో హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు కేటీఆర్, మహముద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, ముఠా గోపాల్, మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, హైదరాబాద్ కలెక్టర్ శ్వేతా మహంతి, హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ తదితరులున్నారు. అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా వీరంతా రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు. జాతిపిత మహత్మాగాంధీ దేశానికి స్వాతంత్య్ర తెచ్చి పెట్టడమే కాకుండా.. ప్రపంచానికే శాంతిదూతగా నిలిచారని తెలంగాణ శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు.
అసెంబ్లీ ఆవరణలో మహాత్ముడి విగ్రహం వద్ద నివాళి
రాష్ట్ర అసెంబ్లీ ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహానికి స్పీకర్ పోచారం, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. మహ్మాతుడి వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి నివాళులర్పించిన వారిలో హోంమంత్రి మహముద్ అలీ, ఎమ్మెల్యే గొంగిడి సునీత, ఎమ్మెల్సీలు కల్వకుంట్ల కవిత, బోడకుంటి వెంకటేశ్వర్లు, నేతి విద్యాసాగర్, కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క ఉన్నారు. ఈ సందర్భంగా గాంధీ సేవలను వారు స్మరించుకున్నారు.
గాంధీ త్యాగనిరతి కారణంగానే ఇవళా స్వాంత్రం పొంది స్వేఛ్ఛా వాయువులు పీలుస్తున్నామని స్పీకర్ పోచారం అన్నారు. అయితే ఈ సందర్భంగా దేశ వ్యాప్తంగా ఉదయం 11 గంటలకు తప్పనిసరిగా రెండు నిమిషాల పాటు మౌనం పాటించాలని కేంద్ర హోంpm modi
శాఖ రాష్ట్రాలను ఆదేశించింది. ఈ నేపథ్యంలో దేశ ప్రజలందరూ రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. బిఆర్కె భవన్ వద్ద సచివాలయ ఉద్యోగులు రెండు నిముషాలు మౌనం పాటించారు. హైదరాబాద్ ముసారాంబాగ్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద, సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్ వద్ద పోలీసులు, వాహనదారులు రెండు నిమిషాల పాటు మౌనం పాటించి అమరులకు నివాళులర్పించారు. దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల సేవలకు గుర్తుగా ప్రతి ఏడాది ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం ఆనవాయితీగా వొస్తున్నది.