Take a fresh look at your lifestyle.

జాతర సమీపిస్తున్నా పూర్తి కాని పనులు

Jatara approaching, non-completion,Tribal Maha Jataraభక్తులతో కిటకిటలాడుతున్న మేడారం – అభివృద్ధి పనులలో అలసత్వం – ఇబ్బందులు పడుతున్న భక్తులు
ప్రపంచం లోనే అత్యంత ప్రఖ్యాతి గాంచిన గిరిజన మహ జాతర ఇంకా కేవలం 15 రోజులు ఉన్నా భక్తుల సౌకర్యార్ధం ఏర్పాటు చేస్తున్న అభివృద్ది పనులు అధికారుల అలసత్వం వలన ఇప్పటికి పూర్తి కాకపోవడంతో తండోపతండాలు గా తరలి వస్తున్న భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పట్టుమని పదిహేను రోజులు కూడా లేని మేడారం శ్రీ సమ్మక్క-సారలమ్మ జాతరకు ఇప్పటికే అనేక ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో జనం తరలివస్తున్నారు. శరా మామూలుగానే రాష్ట్ర ప్రభుత్వం ప్రతి యేటా ఏలా పనులు ప్రారంబిస్తున్నారో ఈ సారి సైతం అభివృద్ది పనులను లేటుగానే మొదలు పెట్టారు. తీరా జాతర సమీపించిన ప్పటికి ఎలాంటి పనులు పూర్తికాకపోవడంతో తరలి వస్తున్న జనాలకు ఇబ్బందులు పడుతున్నట్లు భక్తుల అరోపణలు ఉన్నాయి.

మంత్రులు,ప్రజాప్రతినిధులు, అధికారులు పలు మార్లు మేడారం అభివృద్ది పనులను పరిశీలించి అనేకమార్లు సంబందిత శాఖల అధికారులకు అదేశాలు జారీ చేసినప్పటికి ఎలాంటి పలితం లేకుండా వారు చేయ్యాల్సిన పనులు వారు చేసిచూపిస్తున్నారని స్థానికులు అరోపించుతున్నారు. నత్తనడకన పనులు చేస్తున్న ఆయా శాఖల అధికారులకు మంత్రులు సైతం అనేక మార్లు పనులను పూర్తి చేయ్యాలని చెప్పుకుంటు పోయారు. కాని పనుల పురోగతి మాత్రం అంతంత మాత్రంగానే ఉండిపోయిందని భక్తులు అంటున్నారు. వాయిదాల మీద వాయిదాలు వేస్తు పోతున్నప్పటికి పనులు చేపడుతున్న కాంట్రాక్టర్‌లకు మాత్రం చలనం లేకుండా పోయింది. ఇప్పటికే వివిధ రాష్ట్రాల నుండి భక్తులు వస్తున్నారు. మేడారం అటవి ప్రాంతం జనంతో నిండి పోయింది. జనం మద్య అభివృద్ది పనులు కోనసాగకుండా పోతున్నాయని జనం విమర్శలు చేస్తున్నారు. ఆదివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ‌రాష్ట్ర డీజీపీతో కలిసి మేడారం సందర్శించి పనులను పరిశీలించారు. పనులు ఆసం పూర్తిగా ఉండటంతో ఈనెల చివరి కల్లా పూర్తి చేయ్యా లని అదేశించారు. జాతరకు ముందస్థు చర్యలు తీసుకుని ఉంటే బాగుండేదని వచ్చే భక్తులు కోరుతున్నారు.

Tags: Jatara approaching, non-completion,Tribal Maha Jatara


  

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply