గప్పుడు సర్వేనే
గిప్పూడు సర్వేనే
సర్వేల నడుమ
సర్కారు సర్కస్..
తిరకాసుతిలకుస్తున్న
బతుకులు..
కత్తిమీద తెనోసొంటీ
ముచ్చట్లను నమ్మి
ఉన్నసొమ్ము కాస్తా
పోగొట్టుకున్న జీవులు.
ఉన్నదంతా లాక్కుంటే
మిగిలింది కాస్త
కాటికిపాయే..
ఇంటింటి సర్వే
కాలం చేసింది
ఆస్తుల సర్వే
ప్రశ్నార్థకమే..
ఇంతకీ ఆస్తులు లెక్క
ఉన్నొల్లయా
ఉడ్చుకు పోయినోళ్ళయ
సర్వేతో ఒనగిరింది ఒట్టిదే
ఇదీ ఉత్తదే.
కాలచక్రాన్ని బంధించడం
పతకాల సాటు పథకం
ప్రశ్నించే గొంతుకులకు
తెలియనివి కావు.
బంగారు తెలగాణలో
బతుకులు పెట్రోల్‌తో
కరెంట్ తీగలతో
రసాయన మందులతో
ఆత్మబలిదానాల తో
దూసుకుపోతున్న దృశ్యం
శాసనాల భవనం ముందే జరిగిన
ఘట్టం మరువ శక్యం కాదు
చోద్యం గా అలవాటు పడ్డ జనం
తెల్ల సొక్కాల బాబులు
ఎత్తులను పసిగట్టరు.
భూములు క్రమబద్దం ఆపై
ఆస్తులు క్రమబద్దం ఆపై
సభ్యులు కూడా క్రమబద్దం ఆపై
అన్ని క్రమబద్దమే
అధికారం ఉన్నప్పుడు..
దళితులకు తీన్ ఎకర్భూములు
మిగిలినోళ్లకు డబుల్ పడకలు
ఇంటింటి కుళాయి
ఉత్తగానే కరెంట్
ఎన్నో ఎన్నెన్నో తాయిలాలు
అరచేతుల చిత్రాన్ని సూసి
మురుస్తున్న తెలంగాణ.
మూరుస్తున్న తెలంగాణ
బంగారం అయ్యేదెన్నడు
సర్వేలు ఆగి
అసలు ఆదుకొనే దినలెప్పుడిస్తయో…
సూడాలే….
– నాగరాజు (మద్దెల) 6301993311