Take a fresh look at your lifestyle.

‘‌స్త్రీ విద్యాభివృద్ధి కృషిలో తొలితరం ఉద్యమకారిణి’’

సావిత్రిబాయి పూలే 189వ జయంతి – జనవరి 3)

అణగారిన వర్గాల అభ్యున్నతి ఆధునిక విద్య ద్వారానే సాధ్యమని, మహిళల హక్కులే మానవ హక్కులు నినదించి, మహిళల  విద్యాభివృద్ధికి  కృషిచేసిన తొలితరం  ఉద్యమకారిణి, దేశంలోనే మొదటి ఉపాధ్యాయురాలు….. తల్లి సావిత్రిబాయి పూలే 189 వ జయంతి (జనవరి 3) సందర్భంగా తొలుత ఆమెకు నివాళులర్పించి ఆమె చేసిన సేవలను మననం చేసుకుందాం.

కుల మతాలకు అతీతంగా సమాజ మార్పు, అసమానతలు లేని నూతన వ్యవస్థ కోసం ప్రాణాలను  ఫణంగాపెట్టి  పోరాడిన దంపతులు మహాత్మ జ్యోతిరావు, సావిత్రిబాయి పూలే. మహారాష్ట్ర, సతారా జిల్లా నైగావ్‌ ‌లో 1831 జనవరి 3న రైతు కుటుంబంలో సావిత్రిబాయి జన్మించింది. 9 వఏట జ్యోతిరావు పూలేను 1840 లో వివాహం చేసుకుంది.  అప్పుడు జ్యోతిరావు పూలే వయసు 11 సంవత్సరాలు. ఆ సమయంలో సావిత్రిబాయి పూలే నిరక్షరాస్యురాలు. భర్త ఆమెకు మొదటి గురువు. సనాతన ఆచారాలు, కట్టుబాట్ల కాలంలోనే విద్య ద్వారానే అభివృద్ధి సాధ్యమని , స్త్రీ విద్యాభివృద్ధి వల్లనే సాధ్యమని గ్రహించి భార్యకు చదువు నేర్పించేందుకు జ్యోతిరావు పూలే ఉపక్రమించాడు.  ఆమెను విద్యావంతురాలు చేసి  అట్టడుగు వర్గాల స్త్రీలకు విద్యను అందించేందుకు సావిత్రిబాయిని అహ్మద్‌ ‌నగ ఉపాధ్యాయ శిక్షణకు పంపి, ఆధునిక భారతంలో మొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా ఆమెను తీర్చిదిద్దారు.

మహిళా విద్యాబోధన ఆమె ద్వారా ప్రోత్సహించారు.  విద్య ద్వారానే  స్త్రీ విముక్తి సాధ్యమవుతుందన్న నమ్మకంతో 1848 జనవరి 1న పూణేలో మొట్టమొదటి  బాలికల పాఠశాలలను ఆమె ప్రారంభించారు.  పాఠశాల నడవటం ఆధిపత్య వర్గాల వారికి నచ్చక విద్యా బోధనకు అవంతరాలు కల్పించసాగారు. ఆమెపై  బురద చల్లడం, రాళ్లు విసరడం, దుర్భాషలాడేవాఎరు. అయినా వెరవక ధైర్యంగా ఆటంకాలను ఎదుర్కొని విద్యాబోధన  సాగించింది.  మహిళా విద్య ఉద్యమానికి ఆనతి కాలంలోనే ప్రజల సహాయ సహకారాలు లభించాయి. ఒక ముస్లిం తన ఇంటిని పాఠశాలకు ఇవ్వగా, మరి కొందరు పుస్తకాలు అందించారు. మోరోవిటల్‌, ‌వాల్వేకార్‌ , ‌దియోరావు వంటివారు పాఠశాలకు సహకరించారు. 1851లో మరో పాఠశాల ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో కేవలం నాలుగు సంవత్సరాలలో 20 పాఠశాలను ప్రారంభించి ఉచిత విద్య అందించారు. అప్పటికి ఆమె  వయస్సు 18 ఏళ్లు మాత్రమే. జీవిత కాలంలో మొత్తం 52 పాఠశాలలను ప్రారంభించారు.  ఈ నేపథ్యంలో  1849లో పూలే, సావిత్రిబాయి దంపతులు గృహ బహిష్కరణకు గురయ్యారు.

- Advertisement -

మానవ హక్కులు, సామాజిక సమస్యలవిషయంలో   స్త్రీలను చైతన్యవంతులు చేయడానికి 1852లో ‘‘మహిళా సేవ మండల్‌’’ ‌స్థాపించారు. లింగ  వివక్షతకు తోడుగా, మహిళా సాధికారత కోసం మహిళా సేవ మండల్‌ ‌సంస్థ కృషి చేసింది. సమాజంలో సత్య శోధనకు 1873లో భర్త మహాత్మ పూలేతో కలిసి సత్యశోధక్‌ ‌సమాజ్‌ ‌ప్రారంభించి బాల్య వివాహాలు, మూఢనమ్మకాలు, సతిసహగమనం వ్యతిరేకంగా, వితంతు వివాహాల లక్ష్యంతో ఉద్యమం నడిపారు.  బాల్య వితంతువులను ఆదుకున్నారు. గర్భవతులకు పురుళ్ళు పోసి వారి ఇళ్లలో, కళ్ళల్లో వెలుగు నింపారు. వితంతువులకు  శిరోముండన ప్రక్రియను వ్యతిరేకించి   వితంతువులకు శిరోముండన  చేయబోమంటూ క్షురకులచేత 1860లో సమ్మె చేయించారు. 1873 సెప్టెంబర్‌ 24 ‌సత్యశోధక్‌ ‌సమాజ్‌ – ‌సామాజిక, ఆధ్యాత్మిక సంస్థ  ప్రారంభించి ఉద్యమం నడిపారు. పురోహితులు లేకుండా వివాహాలు, శుభకార్యాలను  నిర్వహించారు. 1868 నుండి అస్పృశ్యతకు  వ్యతిరేకంగా పోరాడారు.

1870లో, 1896లో దేశంలో తీవ్ర దుర్భిక్షం ఏర్పడినప్పుడు పూలే దంపతులుతాము నిర్వహించే పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించారు. సావిత్రిబాయి  తిరుగుబాటు రచయిత్రి గా సమాజంలోని అపసవ్యధోరణులను, అసమానతలను ఎత్తిచూపుతూ ధైర్యంగా రాసేవారు. 1854 లో  కవితాసంపుటి కావ్య పులే ప్రారంభించింది. పావన కాశీ సుబోద్‌ ‌రత్నాకర్‌ ‌ను 1891లో ప్రచురించింది. సమాజసేవలో దంపతులిద్దరూ పాటు పడుతుండగా 1890 నవంబరు 28న జ్యోతిరావు పూలే మరణించడంతో సావిత్రిబాయి దుఃఖ సాగరంలో మునిగిపోయారు. భర్త చితికి తానే స్వయంగా నిప్పుపెట్టి కొత్త సంప్రదాయానికి మార్గం చూపారు…

పూలే మరణానంతరం  సత్యశోధక్‌ ‌సమాజ్‌  ‌బాధ్యత ఆమె స్వీకరించారు. 1897 లో పూనాలో ప్లేగు వ్యాధి ప్రబలినప్పుడు ప్రజలు నగరాన్ని వదిలి పోయినా సావిత్రిబాయి పూలే దత్త పుత్రుడు యశ్వంత్‌ ‌తో కలిసి వ్యాధిగ్రస్తులకు సేవ చేసారు. 1890 దశకంలో ప్లేగు వ్యాధి బారిన పడిన పిల్లల కోసం వైద్యశిబిరాలు ఇర్వహించి రోజుకు రెండు వేల మంది పిల్లలకు భోజనాలు అందించేవారు. చివరకు ఆ ప్లేగు వ్యాధికి ఆమె 1897  మార్చి 10న కనుమూసారు.   దత్తపుత్రుడు యశ్వంత్‌ అం‌త్యక్రియలు జరిపించారు.

బ్రిటిష్‌ ‌పరిపాలనలోనే సామాన్య కుటుంబానికి చెందిన పూలే దంపతులు స్త్రీల అభివృద్ధికి, స్త్రీ విద్య కోసం అవమానాలు, భౌతిక దాడులు,  ఛీత్కారాలను ఎదిరించి స్త్రీల అభ్యున్నతికి కృషి చేసారు. కానీ స్వతంత్ర భారతదేశంలో మహిళ లందరికి రాజ్యాంగం అనేక హక్కులు, అవకాశాలు కల్పిస్తున్నా అనేక రకాలుగా స్త్రీలు  వివక్షకు గురవుతున్నారు. ప్రభుత్వాలు  స్త్రీ విద్యకు, అభివృద్ధికి చర్యలు తీసుకోవడం లేదు. దేశవ్యాప్తంగా మహిళలు, బాలికలు ఆధునిక బానిసత్వంలో మగ్గుతున్నారు. కరోనా పరిస్థితుల్లో ఆన్లైన్‌ ‌విద్యను అందుకోవడంలో బాలికలు వెనుకబడి పోయారు. ఆధునిక భారత మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జయంతి న అధికారికంగా ఉపాధ్యాయ దినోత్సవ సాంగ్‌ ‌జరుపుకోవాల్సిన అవసరం ఉంది.

Leave a Reply