Take a fresh look at your lifestyle.

మభ్య పెట్టె బడ్జెట్…: జన సమితి

తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ అంచనాలను పెంచి, వాస్తవికతను మరచి ప్రజలను మభ్య పెట్టేవిధంగా ఉందని తెలంగాణ జనసమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విమర్శించారు. ఈ బడ్జెట్ విద్యా, వైద్యం, వ్యవసాయరంగం లకు ,ఉద్యోగ ఉపాధి కల్పన లను పట్టించుకోలేదు . తన ఎన్నికల వాగ్ధానం అయినటువంటి నిరుద్యోగ భృతి ఇవ్వకుండా పోలీసు వ్యవస్థకు అధిక ప్రాధాన్యత నిచ్చి నిధులు కేటాయించారు. కేవలం ghmc ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని 10వేల కోట్ల రూపాయలు కేటాయించారు. 1,82,914.42 బడ్జెట్ లో ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారు. విద్యారంగానికి కేటాయించిన బడ్జెట్ వాటి నిర్వహనకే సరిపోవు పాఠశాల విద్యకు కేటాయించిన10,421 కోట్లు ఈ మాత్రము సరిపోవు విద్యారంగంలో వేలాది ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నవి.ఉన్నత విద్యకు కేటాయించిన1,723.27 కోట్లు జీత భత్యాలకు,కనీస మౌలిక వసతుల కలపణకు సరిపోవు. యూనివర్సిటీ లకు వీసీలు లేరు, అధ్యాపకులు లేరు. యూనివర్సిటీ ను ఆదుకోవాల్సిన ప్రభుత్వం అరకొర నిధులను కేటాయించి చేతులు దులుపుకుంది ఈచ్ వన్ టీచ్ వన్ అంటూ ఆర్భాటంగా చెప్పి 100 కోట్లు కేటాయించి అపహాస్యం పాలు చేశారు. ఫీజురియంబర్స్ మెంట్కోసం కేటాయించిన 2,650 కోట్లు బకాయిలకు సరిపోదు. సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేశాము అని బీరాలు పోతున్న ఆర్థిక మంత్రి డబల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణానికి దళితులకు ముడుఎకరాల భూమిని విస్మరించారు .

రుణ మాఫీకి కేటాయించిన6,225 కోట్లు కేవలం కంటి థుడుపుమాత్రమే విడతల వారి రుణ మాఫీ రైతులకు ఏవిధమైన ప్రయోజనాన్ని చేకూర్చదు .ఉన్న రైతు వేదికలను నిర్వీర్యం చేసి.కొత్త రైతువేధికల నిర్మాణం 350 కెట్లు కేటాయించి తమ పార్టీ కార్యకర్తలకు లబ్ది చేకూర్చే ప్రయత్నం చేశారే తప్ప వ్యవసాయ రంఘానికి ఒరిగేది ఏమీలేదు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో మహిళాసాధికారథకు సంబంధించి కనీస కేటాయింపు లు చేయలేదు.కేవలం మహిళా స్వయం సహకార సంఘాలకు1200 కోట్లు కేటాయించి చేతులు దులుపు కున్నారు.చేనేతరంఘాన్ని పట్టించుకోలేదు ఇలా ఏరంగం చూసినా ఈ బడ్జెట్ ఆశాజనకంగా లేదు.

Leave a Reply