Take a fresh look at your lifestyle.

జనబంధు బోవేరా !

చైతన్య స్ఫూర్తి
సాహిత్య సుదీప్తి
మహోన్నతమూర్తి
అతడే…విశ్వ బంధువు
బోయినపల్లి వేంకట రామారావు

నూనూగు మీసాల ప్రాయంలో
ఉద్యమాల బాట పట్టినవాడు

నిజాం పాలనకు వ్యతిరేకంగా
ధిక్కార స్వరం వినిపించినవాడు

భారత స్వాతంత్య్ర సమరంలో
సమీదనొక్కటి ఆహుతిచ్చినవాడు

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం
అవిశ్రాంత పోరు సాగించినవాడు

సామాజిక అసమానతలపై
నిరసన జెండా ఎగరేసినవాడు

భుర్జువా దోపిడి శక్తుల మీద
మాటల ఫిరంగి పేల్చినవాడు

యువతరాన్ని సంఘటితం చేసి
సామాజికోద్యమాలు నడిపినవాడు

గ్రామ స్వరాజ్య స్థాపనకు
నిరంతరం కృషి చేసినవాడు

మహాత్మ గాంధీ స్ఫూర్తిగా
అహింసా పధంలో నడిచినవాడు

మూడు తరాల పోరాటాల్లో
బాగస్వాముడైన సాహసశీలి

స్వరాష్ట్ర అవిర్భావాన్ని
కళ్లార చూసి తరించిన ధన్యజీవి

తన యావత్‌ ‌జీవితం
జాతికి అంకితమిచ్చిన త్యాగమూర్తి

పోరు కేతనమా..!
స్ఫూర్తి శిఖరమా.. బోవేరా !!
మీకు యావత్‌ ‌తెలుగు జాతి
అక్షర నిరాజనాలు ఆర్పిస్తుంది

(సెప్టెంబర్‌ 2 ‌న జన హృదయ నేత
బొవేరా జయంతి సందర్బంగా…)
– కోడిగూటి తిరుపతి, 9573929593

Leave a Reply