Take a fresh look at your lifestyle.

ఖని వన దేవతల వద్ద జన జాతర

జాతరకు హాజరైన భక్తజన సందోహం

  • సమ్మక్క గద్దెల వద్దకు
  • కదిలిన కార్మిక క్షేత్రం
  • జన జాతరలో భక్తులకు తప్పని కష్టాలు..
  • అంచనాకు సరిపడా
  • ఏర్పాట్లు చేయడంలో విఫలం
  • కలెక్టర్‌, ‌కమీషనర్లు పరిశీలించినా
  • అంతంత మాత్రమే..
  • మంచినీరు, వాహన పార్కింగ్‌ ఇబ్బందులు
  • అప్పటికప్పుడు పార్కింగ్‌ ‌స్థలం
  • చదును చేసిన పోలీసులు

కోల్‌బెల్ట్ ‌గోదావరిఖని సమ్మక్క జాతరకు కార్మిక క్షేత్రం కదలి వస్తుంది. మూడు రోజుల పాటు అట్టహాసంగా జరుగుతున్న జాతరకు గోదావరిఖని, యైటింక్లయిన్‌ ‌కాలనీతో పాటు మంచిర్యాల జిల్లా లోని పలు ప్రాంతా ల నుండి భక్తులు మొక్కులు తీర్చుకునేందుకు బారులు తీరుతున్నారు. బుధవారం రాత్రి వరకు సారలమ్మ కోయ పూజారుల డప్పు, నృత్యాల చెంతన గద్దెల వద్దకు చేరుకోగాత, గురువారం రాత్రి వరకు తల్లి సమ్మక్క కొలువయ్యింది. దీంతో పూర్తి స్థాయి సమ్మక్క జాతర ప్రారంభమయినట్లయ్యింది. పెద్ద ఎత్తున హాజరవుతున్న భక్తులు అమ్మ వార్లకు ఒడి బియ్యం, బంగారంతో తమ మొక్కులు చెల్లించుకుని జాతర ప్రాంగణలో బంధు, మిత్రులతో కలిసి వంటా వార్పు చేసుకుని సంబరాలు చేసుకుంటున్నారు.

- Advertisement -

జన జాతరలో భక్తులకు తప్పని కష్టాలు..
జనగామ జాతర కమిటీ, రామగుండం బల్దియా అదికా రుల నిర్వహణలో చేపడుతున్న సమ్మక్క జాతర ఏర్పాట్ల లో విఫలమయ్యారు. 7 లక్షల వరకు భక్తులు వస్తారని అంచనా వేసిన కమిటీ బృందం అందులో సగం భక్తులకు కూడా సౌకర్యాలు కల్పించడంలో విఫలమ య్యారు. భక్తులకు తాగునీరు, జాతరలో కుటుంబ, బంధు మిత్రుల సపరివారం వంటా వార్పు చేసుకుని ఉండే అవకాశాలున్నప్పటికీ వారికోసం స్థల సేకరణ చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులనెదుర్కొం టున్నారు. జిల్లా కలెక్టర్‌ ‌సిక్తా పట్నాయక్‌తో పాటు రామగుండం నగరపాలక కమీషనర్‌ ఉదయ్‌కుమార్‌లు ఎప్పటికప్పు డు పర్యవేక్షించినా ముందు చూపు కొరవడడంతో పనుల్లో పురోగతి లోపించింది. వాహనాల్లో జాతరకు వచ్చే భక్తులకు పార్కింగ్‌ ‌ప్రదేశం కేటాయించడంలో అంచనాను కూడా అందుకోకపోవడం పట్ల తీవ్ర విమర్శలెదుర్కొంటున్నారు. ఇన్ని సంవత్సరాలుగా జా• •ర నిర్వహణ చేపడుతున్నా కూడా సౌకర్యాల కల్పనలో విఫలమవుతుండడం పట్ల విమర్శలెదుర్కొంటున్నారు.

పార్కింగ్‌కోసం స్థల చదును చేస్తున్న పోలీసులు
భక్తుల వాహనాల సంఖ్య పెరిగిపోతుండడంతో రాజీవ్‌ ‌రహదారి ప్రక్కన ఉన్న ఖాళీ స్థలంలో గురువారం స్థలాన్ని చదును చేసి పార్కింగ్‌ ‌సమస్యలు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. పరిస్థితిని ముందే అంచనా వేసిన ట్రాఫిక్‌ ‌సీఐ రమేశ్‌ ‌బాబు అప్పటికప్పుడు బ్లేడ్‌ ‌ట్రాక్టర్‌తో చదును చేసే ఏర్పాట్లను ట్రాఫిక్‌ ఎస్సై సూర్యనారాయణ అప్పగించారు.

 

Leave a Reply