Take a fresh look at your lifestyle.

జమ్మూ కశ్మీర్‌కు మళ్లీ రాష్ట్ర హోదా!

  • మోడీ హామీ ఇచ్చారని ప్రధానితో భేటీ అనంతరం వెల్లడించిన స్థానిక నేతలు
  • ప్రధాని నివాసంలో సమావేశానికి హాజరైన గులాంనబీ సహా నలుగురు మాజీ సిఎంలు, పలువురు నేతలు
  • మెహబూబా ముఫ్తీపై జనం ఆగ్రహం…జమ్మూలోని వీధుల్లోకి వొచ్చి నిరసన ప్రదర్శనలు
  • మోడీ అఖిలపక్ష భేటీ గురించి నాకు తెలియదు : పశ్చిమ బెంగాల్‌ ‌సిఎం మమత బెనర్జీ

జమ్మూ కశ్మీర్‌ ‌నేతలతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ న్యూఢిల్లీలోని ప్రధానమంత్రి అధికారిక నివాసంలో గురువారం సమావేశమయ్యారు. ఈ సమావేశానికి జమ్మూ కశ్మీర్‌కు చెందిన నలుగురు మాజీ మఖ్యమంత్రులు ఫారూఖ్‌ అబ్దుల్లా, గులాం నబీ ఆజాద్‌, ఒమర్‌ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ సహా మరో 10 మంది నేతలు హాజరు అయ్యారు. అన్ని పార్టీల నేతలతో మూడు గంటలకుపైగా సాగిన సమావేశంలో పునర్విభజన, రాష్ట్ర హోదా, ఎన్నికల అంశాలు చర్చకు వొచ్చినట్లు నేతలు చెప్పారు. సమావేశం సందర్భంగా జమ్మూకశ్మీర్‌కు మళ్లీ రాష్ట్ర హోదా ఇవ్వడానికి తాను కట్టుబడి ఉన్నట్లు ప్రధాని మోదీ హామీ ఇచ్చారని జమ్మూకశ్మీర్‌ అప్నీ పార్టీ చీఫ్‌ ‌మహ్మద్‌ ‌బుఖారీ వెల్లడించారు. సమావేశం మూడు గంటలకుపైగా సాగిందంటేనే ఇది విజయవంతమైందనడానికి నిదర్శనమని బీజేపీ నేత రామ్‌మాధవ్‌ ‌ట్వీట్‌ ‌చేశారు.

రాష్ట్ర హోదా ఇవ్వడానికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు మోదీ చెప్పారని కాంగ్రెస్‌ ‌నేత గులాంనబీ ఆజాద్‌ ‌చెప్పారు. అన్ని పార్టీల నేతలు సమావేశంలో రాష్ట్ర హోదా కోసం పట్టుబట్టినట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర హోదా డిమాండ్‌తోపాటు ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడానికి వెంటనే అసెంబ్లీ ఎన్నికలు పెట్టాలని, కశ్మీరీ పండిట్లకు జమ్ముకశ్మీర్‌లో పునరావాసం, అన్ని పార్టీల నేతలను నిర్బంధం నుంచి విడుదల చేయాలని మోదీని అడిగినట్లు ఆజాద్‌ ‌వెల్లడించారు. సమావేశం చాలా స్నేహపూర్వక వాతావరణంలో జరిగిందని, జమ్ముకశ్మీర్‌ ‌ప్రజలకు న్యాయం జరుగుతుందన్న సానుకూల అభిప్రాయం తమకు వొచ్చినట్లు పీపుల్స్ ‌కాన్ఫరెన్స్ ‌నేత సజ్జద్‌ ‌లోన్‌ ‌చెప్పారు.

మెహబూబా ముఫ్తీపై జనం ఆగ్రహం…జమ్మూలోని వీధుల్లోకి వొచ్చి నిరసన ప్రదర్శనలు
జమ్మూకశ్మీర్‌ అం‌శంపై చర్చించే విషయంలో పాకిస్థాన్‌ను కూడా భాగస్వామిగా చేయాలని మెహబూబా ముఫ్తీ చేసిన ప్రతిపాదనకు వ్యతిరేకంగా జమ్మూలో నిరసనలు మొదలయ్యాయి. గురువారం డోగ్రా ఫ్రంట్‌ అనే సంస్థ సభ్యులు జమ్మూలోని వీధుల్లోకి వొచ్చి, మహబూబా ముఫ్తీకి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఇలా వ్యాఖ్యానించినందుకు మహబూబాను జైలుకు తరలించాలని నిరసనకారులు డిమాండ్‌ ‌చేశారు. పిడీపీ నేత, జమ్మూకశ్మీర్‌ ‌మాజీ సీఎం మహబూబా ముఫ్తీ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

మోడీ అఖిలపక్ష భేటీ గురించి నాకు తెలియదు : పశ్చిమ బెంగాల్‌ ‌సిఎం మమత బెనర్జీ
జమ్మూ కశ్మీరుపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిర్వహించిన అఖిలపక్ష సమావేశం గురించి తనకు తెలియదని పశ్చిమ బెంగాల్‌ ‌ముఖ్యమంత్రి మమత బెనర్జీ చెప్పారు. బీజేపీని ప్రశ్నించిన వారిని దేశ వ్యతిరేకులుగా చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు. మమత బెనర్జీ గురువారం మాట్లాడుతూ, అసలు జమ్మూ-కశ్మీరుకు రాష్ట్ర హోదాను తొలగించడానికి కారణమేమిటో తనకు తెలియదన్నారు. జమ్మూ-కశ్మీరుపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిర్వహించిన అఖిలపక్ష సమావేశం గురించి కూడా తనకు తెలియదన్నారు. అధికరణ 370ని రద్దు చేయడం వల్ల భారత దేశానికి కళంకం వొచ్చిందని ఆమె పేర్కొన్నారు. ఈ చర్య వల్ల దేశ ప్రతిష్ఠ ప్రపంచవ్యాప్తంగా మసకబారిందన్నారు. బీజేపీని ప్రశ్నించినవారు జాతి వ్యతిరేకులవుతున్నారని మండిపడ్డారు. రైతులు నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాలను ప్రస్తావిస్తూ, సాగు చట్టాలను రద్దు చేయాలని రైతులు డిమాండ్‌ ‌చేయడం సరైనదేనని చెప్పారు.

Leave a Reply