రాంబన్, ఫిబ్రవరి 20 : ఇండియాలో కొన్ని ప్రాంతాల్లో భూమి కుంగి పోతున్నది. అసోం, మణిపూర్ ఇలా ఈశాన్య, ఉత్తర భారత దేశంలో అక్కడక్కడా చిన్న భూకంపాలు, ప్రకంపనలు వొస్తున్నాయి. తాజాగా జమ్ముకాశ్మీర్‌లోని రాంబన్ జిల్లాలో భూమి కుంగిపోతుంది. ఇలా ఎందుకు జరుగుతుంది? పంచాయత్‌లోని దిక్సర్ ప్రాంతంలో ఆదివారం ఉదయం నుంచి భూమి కుంగడం మొదలైంది. దాదాపు 10 ఇళ్లు కూలిపోయాయి. కొన్ని ఇళ్లు బాటలువారాయి. అదంతా చూసిన స్థానికులు హడలిపోతున్నారు. తమ ఇల్లు సురక్షితం కాదనే అనుమానం వాళ్లకు కలిగింది. జోషిమఠ్ పరిస్థితే అక్కడే వచ్చేలా ఉందని భావించిన స్థానికులు.. తట్టాబుట్టా సర్దుకుంటున్నారు. ఇళ్లలో సామాన్లను వేగంగా వేరే ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇష్టం లేకపోయినా.. అక్కడి నుంచి వెళ్లడానికి సిద్ధపడుతున్నారు. అటు రంగంలోకి దిగిన అధికారులు, సహాయక బృందాలతో తరలింపు కార్యక్రమం కొనసాగిస్తున్నారు.
నిజామాబాద్ జిల్లాలో, నిన్న సూర్యాపేట జిల్లాలో చిన్న భూకంపాలు వచ్చాయి. అటు ఆంధప్రదేశ్ లోని పులిచింతల ప్రాజెక్ట్ దగ్గర కూడా ప్రకంపనలు వచ్చాయి. ఇదివరకు హైదరాబాద్‌లో కూడా ప్రకంపనలు వచ్చిన విషయం మనకు తెలుసు.భూమి కుంగిపోవడం, ప్రకంపనలు రావడం అనేది ఉత్తరాన ఉన్న రాష్ట్రాల్లోనే కాదు.. దక్షిణ రాష్ట్రాల్లోనూ కనిపిస్తోంది. ఇక్కడ కుంగిపోకపోయినా.. ప్రకంపనలు వస్తున్నాయి. వారం కిందట నిజామాబాద్ జిల్లాలో, నిన్న సూర్యాపేట జిల్లాలో చిన్న భూకంపాలు వచ్చాయి. అటు ఆంధప్రదేశ్ లోని పులిచింతల ప్రాజెక్ట్ దగ్గర కూడా ప్రకంపనలు వచ్చాయి. ఇదివరకు హైదరాబాద్‌లో కూడా ప్రకంపనలు వచ్చిన విషయం మనకు తెలుసు.కర్ణాటక కలిసి.. దక్కన్ పీఠభూమిపై ఉన్నాయి. ఇది నాలుగు ఫలకాలతో ఏర్పడిన పీఠభూమి. 300 కోట్ల ఏళ్ల కిందట ఏర్పడింది. కాబట్టి ఇది చాలా బలంగా ఉంటుంది. ఇంత బలమైనది కూడా ఇప్పుడు కదులుతోంది. ఇది ఆందోళన కలిగించే అంశం. నిజానికి తెలుగు రాష్ట్రాల్లో భూకంపాలు రాకూడదు. ఎందుకంటే.. ఈ రెండు రాష్ట్రాలు, కర్ణాటక కలిసి.. దక్కన్ పీఠభూమిపై ఉన్నాయి.
ఇది నాలుగు ఫలకాలతో ఏర్పడిన పీఠభూమి. 300 కోట్ల ఏళ్ల కిందట ఏర్పడింది. కాబట్టి ఇది చాలా బలంగా ఉంటుంది. ఇంత బలమైనది కూడా ఇప్పుడు కదులుతోంది. ఇది ఆందోళన కలిగించే అంశం.ఇప్పుడున్న టెక్నాలజీతో భూకంపాల్ని ఆపడం సాధ్యం కాదు. కనీసం అవి వస్తున్న విషయాన్ని ముందుగా కనిపెట్టడం కూడా కష్టం. భూమిలో భూకంపం వచ్చిన నాలుగైదు సెకండ్లలోనే ఆ ప్రకంపనల ప్రభావం భూమిపైన కనిపిస్తుంది. అంత తక్కువ సమయంలో ప్రజలు విషయం తెలుసుకోవడం, తప్పించుకోవడం కష్టం. దేశవ్యాప్తంగా వస్తున్న ప్రకంపనలు, భూమి కుంగిపోతున్న ఘటనల్ని శాస్త్రవేత్తలు గమనిస్తూ ఉన్నారు. ఓ భారీ భూకంపం వచ్చే ప్రమాదం ఉందని అంటున్నారు. అది హిమాలయాల దగ్గర్లో వస్తుందనే అంచనాతో ఉన్నారు. అది ప్రజలు నివసించే ప్రదేశంలో వస్తే భారీ నష్టం తప్పదంటున్నారు. ఈ అంశం దేశ ప్రజలను కలవరపరుస్తోంది.