Take a fresh look at your lifestyle.

జమ్ము-కాశీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరణకన్నా పెద్ద సమస్య లేదు

  • అందుకు కాంగ్రెస్‌ ‌శాయశక్తుల కృషి
  • కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నది
  • కశ్మీరీ పండిట్‌లకు అన్యాయం జరుగుతున్నది…
  • వారు బిక్ష అడుగడం లేదు…హక్కుల కోసం మాత్రమే అడుగుతున్నారు
  • జమ్ము చేరుకున్న రాహుల్‌ ‌భారత్‌ ‌జోడో యాత్ర

ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ‌జనవరి 23 : జమ్ము-కాశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరణ కన్నా పెద్ద సమస్య మరేది లేదని, దీనికి సంబంధించి కాంగ్రెస్‌ ‌పార్టీ తమ శాయశక్తుల కృషి చేస్తుందని రాహుల్‌ ‌గాంధీ అక్కడి ప్రజలకు హామీ ఇచ్చారు. కేంద్రం వారి హక్కును లాక్కుననదని అన్నారు. ఇంతకు ముందు స్థానిక ప్రజలచే పాలింపబడిన జమ్ము-కాశ్మీర్‌ ‌నేడు బయటి వ్యక్తులచే నడుపబడుతుందని అన్నారు. కాగా దేశ సమైక్యత కోసం కాంగ్రెస్‌ అ‌గ్రనేత రాహుల్‌ ‌గాంధీ సెప్టెంబర్‌ 7, 2022‌న ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్‌ ‌జోడో యాత్ర సోమవారం 129వ రోజు జమ్ము చేరుకుంది. జమ్ము-కాశ్మీర్‌ ‌సాంబా జిల్లాలోని విజయ్‌పూర్‌ ‌నుంచి ఉదయం 7 గంటలకు పాదయాత్ర మొదలై కటుటదిట్టమైన భద్రత నడుమ పదకొండు గంటలకు శీతాకాల రాజధాని జమ్ము నగర పరిధిలోకి చేరుకుంది.

కాగా పాదయాత్రలో రాహుల్‌ ‌వెంట పార్టీ సీనియర్‌ ‌నేతలు దిగ్విజయ్‌ ‌సింగ్‌, ‌కెసి వేణుగోపాల్‌, ‌మాజీ మంత్రి తారీఖ్‌ ‌హమీద్‌ ‌కర్రా, రాష్ట్ర పిసిసి మాజీ అధ్యక్షుడు జిఏ మీర్‌, ‌పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు త్రివర్ణ పతాకాలు చేతబూని పాల్గొన్నారు. రోడ్డు కిరువైపులా ప్రజలు ఆయనకు స్వాగతం పలుకుతూ చేతులూపుతూ ఉత్సాహపరిచారు. కాగా అంత చలిలోనూ రాహుల్‌ ‌తాను సాధారణంగా ధరించే తెల్ల టీషర్ట్‌పైనే యాత్ర కొనసాగించడం విశేషం. సత్వారీ చౌక్‌లో భారీ జనసమూహం హాజరైన బహిరంగ సభనుద్దేశించి రాహుల్‌ ‌గాంధీ మాట్లాడుతూ..కేంద్ర ప్రభుత్వం కొంతమంది పెట్టుబడిదారులకు లబ్డిచేకూరుస్తున్నదని, పాలన మొత్తం వారే నడిపిస్తున్నారని అన్నారు.

నోట్ల రద్దు వల్ల నల్ల ధనం నిర్మూలించబడలేదని, దానివల్ల చిన్నచిన్న వ్యాపారస్తులకు నష్టం కలిగించారని, దేశంలో అధిక సంఖ్యలో ఉద్యోగాల కల్పిస్తారని అన్నారు. దేశం మొత్తంలో జమ్ము-కాశ్మీర్‌లోనే అధికంగా నిరుద్యోగం ఉందని, యువకులు అనేకులు వారి విద్య ముగిసిన తర్వాత నిరుద్యోగులుగా మిగిలారని రాహుల్‌ ‌తెలిపారు. అగ్నివీర్‌ ‌యోజన మీద కూడా రాహుల్‌ అనేక ప్రశ్నలు సంధించారు. ఉదయం విజయపూర్‌ ‌నుంచి పాదయాత్ర ప్రాంరంభించిన తర్వాత మార్గ మధ్యంలో జమీదారా దాబా వద్ద రాహుల్‌ ‌కశ్మీరీ పండిట్‌ల శిష్టమండలిని కలిసిన సందర్భంగా మాట్లాడుతూ..కశ్మీరీ పండిత్‌లకు అన్యాయం జరుగుతుందని అన్నారు. వారు తమ డిమాండ్ల కోసం జమ్ము-కాశ్మీర్‌ ‌లెఫ్టినెంట్‌ ‌గవర్నర్‌ను కలిసినప్పుడు ఆయన భిక్షాటన చేయవద్దని వారికి చెప్పారని, తాను ఎల్‌జికి వారు అడకుక్కోవడం లేదనివారి హక్కుల కోసం అడుతున్నారని చెప్పదలుచుకున్నాని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నదని రాహుల్‌ ‌మండిపడ్డారు.

ఈ సందర్భంగా రాహుల్‌ ‌వారు ఎదుర్కుంటున్న సమస్యలను, ఇతర విషయాలను అడిగి తెలుసుకున్నారు. యాత్రలో 9వ తరగతి చదువుతున్న దృష్టి శర్మ అనే విద్యార్థిని రాహుల్‌ ‌గాంధీని కలిసి నోట్ల రద్దు, జిఎస్‌టి వంటి అంశాలపై, ఇతర అంశాలపై చర్చించి అనేక విషయాలను తెలుసుకున్నారు. కశ్మీర్‌ ‌నుంచి కూడా రాహుల్‌ను కలువడానికి ప్దె సంఖ్యలో ప్రజలు రావడం విశేషం. యాత్ర రాత్రికి జమ్మూలోని సిద్రాకు చేరుకుని రాత్రి అక్కడే బస చేస్తుంది. యాత్ర జనవరి 30న పెద్ద ర్యాలీతో వేసవి రాజధాని శ్రీనగర్‌లో కాంగ్రెస్‌ ‌పార్టీ కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేయడంలో ముగియనుంది.

Leave a Reply