Take a fresh look at your lifestyle.

ప్రజల విజయమే పాలపిట్ట, జమ్మిచెట్టు

‘‘‌దసరా రోజున సాయంత్రం వేళ జమ్మిచెట్టు దగ్గర ఊరు ఊరంతా భక్తి శ్రద్ధలతో పూజ చేసిన గుమ్మడికాయతో, సొరకాయతో, గొర్రె పొట్టేలుతో జమ్మిచెట్టు ఆకులను బంగారంగా భావిస్తూన్న పెద్దల చేతిలో పెట్టి వారి యొక్క ఆశీర్వాదాలు, ఆశీస్సులు తీసుకుంటారు. తెలుగు ప్రజలు గ్రామాలలో, పట్టణాలలో అడవులలో ఉండే చెట్లని దైవంగా పూజించి, వాటిని దేవుడి లాగా కోల్చుకోవడం తెలంగాణ రాష్ట్ర తెలుగు ప్రజల సంస్కృతిని, సాంప్రదాయాలను మనమందరం మర్చిపోలేని జ్ఞాపకం. ’’

 

తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి పండుగకు ఒక ప్రత్యేకత ఉంటు ంది. ప్రజల విజ యమే దసరా పం డుగ నాడు కనిపి ంచేది పాల పిట్ట, జమ్మిచెట్టు అదే తెలుగు ప్రజలకు  అదృష్టంగా విజయం అవుతుందని భావిస్తారు.  తెలంగాణ రాష్ట్ర తెలుగు ప్రజలు దసరా పండుగ పది రోజుల పాటు ఆటపాటలతో, నృత్యాలతో ఘనంగా జరుపుకుంటారు. ముందు నవరాత్రుల దగ్గర దుర్గా మాత దేవి పూజ ఉంటుంది. తెలుగు ప్రజలకు దసరా పండుగ వచ్చిందంటే  బతుకమ్మ ఆట పాటలు, దుర్గామాత దేవి పూజలు, పిండి వంటలతో పండగ వాతావరణం మొదలవుతుంది. ఇక దసరా రోజున సాయంత్రం తప్పకుండా అందరూ ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలోని ప్రజలు పాలపిట్ట ను చూడడానికి బయలుదేరుతారు. తెలంగాణలోని ఈ తొమ్మిది రోజులు అమావాస్య నుంచి నవమి వరకు బతుకమ్మ ఆడుతూ పాడుతూ నృత్యాలు చేసుకుంటూ మహిళలు, చిన్నారుల సంతో షాలతో, ఆటపాటలతో  గడుపుతారు. అందులో మన తెలంగాణ పండుగలో కొన్ని వస్తువులు, పనులు ప్రత్యేకంగా ఉంటాయి. దేశంలోని తెలంగాణ రాష్ట్రంలోని దసరా సంబరాలు చివరి రోజుకి చేరుకోగానే తెలుగు ప్రజలకు మొదట గుర్తుకొచ్చేది జమ్మిచెట్టు, పాలపిట్ట మాత్రమే. దసరా రోజున సాయంత్రం వేళ జమ్మిచెట్టు దగ్గర ఊరు ఊరంతా భక్తి శ్రద్ధలతో పూజ చేసిన గుమ్మడికాయతో, సొరకాయతో, గొర్రె పొట్టేలుతో జమ్మిచెట్టు ఆకులను బంగారంగా భావిస్తూన్న పెద్దల చేతిలో పెట్టి వారి యొక్క ఆశీర్వాదాలు, ఆశీస్సులు తీసుకుంటారు.  తెలుగు ప్రజలు గ్రామాలలో, పట్టణాలలో  అడవులలో ఉండే చెట్లని దైవంగా పూజించి, వాటిని దేవుడి లాగా కోల్చుకోవడం  తెలంగాణ రాష్ట్ర తెలుగు  ప్రజల సంస్కృతిని, సాంప్రదాయాలను మనమందరం మర్చిపోలేని జ్ఞాపకం.

దసరా రోజుకి- జమ్మిచెట్టు కి మధ్య అనుబంధం :-
జమ్మి చెట్టు భారతీయులకు కొత్తేమీ కాదు. భారత ఉపఖండంలో ఈ వృక్షం ఉద్భవించింది. మనం పురాణాలలోని, వేదాలలోని తరచూ వినే అరణిని ఈ జమ్మితోనే రూపొందించాలని తెలిసింది. జమ్మిచెట్టు ఇలాంటి  ప్రాంతాలలో అయినా త్వర,త్వరగా పెరుగుతుంది. నీటి లభ్యత పెద్దగా లేకున్నా చాలా తక్కువ కాలంలో పెరిగేస్తుంది. అందుకే దాదాపు ఎడారి ప్రాంతమైన రాజస్థాన్‌ ‌మొదులుకొని వర్షపాతం తక్కువగా ఉండే తెలంగాణ ప్రాంతం వరకు తెలుగు ప్రజలకు జమ్మి చెట్టు గురించి బాగా తెలుసు. పట్నం వాసులకు జమ్మిచెట్టు గురించి పెద్దగా తెలియకపోవచ్చు.. కానీ రైతులకు, గ్రామీణ ప్రాంతాల ప్రజలకు, జమ్మిచెట్టు అంటే ప్రాణం.  జమ్మిచెట్టు ఆకులు, కొమ్మలు, పశువులకు మేతగా చాలా ఉపయోగపడతాయి.  చెట్టులోని ప్రతి భాగాన్ని నాటు వైద్యంలో ఔషధాలకు వాడుతారు.  ఈ చెట్టు నుండి వచ్చే గాలి పిలిచినా మనం జమ్మిచెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసిన ఆరోగ్యం బాగుంటుందని పెద్దల నమ్ముతారు. అందుకే వినాయక చవితి పండుగ నాడు పూజించే పక వింశతి పత్రాలలో శమీ పత్రాన్ని కూడా చేర్చుతారు.

జమ్మి చెట్టు:-  ఏడాది పాటు అజ్ఞాత వాసానికి బయలుదేరి పాండవులు విజయదశమి ( దసరా ) రోజున ఆయుధాలను జమ్మిచెట్టు పైకి దాచి వెళ్లారట. తిరిగి అదే విజయదశమి నాడు జమ్మిచెట్టు రూపంలో ఉన్న అపారజీత దేవిని పూజించే తమ ఆయుధాలను తీసుకున్నారు. అలా పాండవులకు అపరజీవి దేవి ఆశీస్సులు ఉండబట్టే వారు యుద్ధంలో గెలిచారని వారు బలంగా నమ్ముతారు.  పాండవులు కాదు రామునికి సైతం జమ్మిచెట్టు ప్రీతికరమైనది అని చెబుతారు. జమ్మిచెట్టు కి మన పురాణాల్లోనూ జీవితాలలోని ఇంతటి సంబంధం ఉండబట్టే దసరా నాడు జమ్మి చెట్టుకి తెలుగు ప్రాంతాల ప్రజలు ప్రత్యేక పూజలు చేస్తారు. శమీ వృక్షానికి ప్రదక్షిణలు చేస్తుంటారు. జమ్మిచెట్టు ఆకులను పూజలు ముగిసిన తర్వాత జమ్మి ఆకులను తుంచుకోని వాటిని బంగారం లాగా భద్రంగా ఇళ్లకు తీసుకెళ్తారు.  జమ్మి ఆకులను తమ పెద్దల చేతులోకి పెట్టి అప్యాయంగా ఆశీర్వాదం తీసుకుంటారు. జమ్మి చెట్టు వేద కాలం నాటి నుండి పరమ పూజమైన వృక్షం. జమ్మి ఆకులలో ఉన్నటువంటి ప్రాధాన్యత అతి బంగారంతో సమానం అనడంలో తెలుగు ప్రజలకు ఏమాత్రం సందేహం లేదు.  తెలుగు ప్రజలకు ఇలాంటి జమ్మి ఆకులను శుభ్రంగా ఉంచి జమ్మి కొట్టేందుకు రాలేకపోయినా పెద్దల చేతిలో ఉంచుతారు. జమ్మి ఆకులను పూజిం చడం అంటే జీవితంలో సకల విజయాలు సాధించాలని కోరుకుంటారు. తెలంగాణ స్వ రాష్ట్రం ఆవిర్భావం కాగానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌రాష్ట్ర వృక్షంగా జమ్మిచెట్టును ప్రకటించారు.
పాలపిట్ట:- విజయదశమి (దసరా) రోజున పాలపిట్టను కూడా చూడాలనే నమ్మకం, నియమం, సంస్కృతి, సాంప్రదాయం తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా ఉంటుంది. పాండవులు తమ ఆయుధాలను జమ్మిచెట్టు మీద నుంచి తీసుకొని తిరిగి తమ రాజ్యానికి చేరు కుంటు ండగా వారికి పాలపిట్ట కనిపించిందని అప్పటి నుంచి వారికి సకల విజయాలు సిద్ధించాయని ఒక అపారమైన నమ్మకం. అందుకే విజయ దశమి (దసరా) నాడు సుభసూ చకంగా పాల పిట్టని దర్శించే ఆనవాయితీ మొదలవుతుంది. తెలుగు ప్రజలు పాలపిట్టను చూడడానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. దసరా రోజున పాలపిట్టను చూడడం తెలుగు ప్రజల ఆనవాయితీగా వస్తున్న ఆచారం దసరా నాడు కచ్చితంగా దర్శనం ఇవ్వడం మరో ప్రత్యేకత ఉంటది. ఈ పర్వదినం రోజున ఊరు శివారు లోనూ, రహదారుల ఇరువైపులా, చెట్ల పైన, విద్యుత్‌ ‌తీగల పైన , గడ్డి వాముల పైన,  పోద లపైన , పంట పొలాల్లోని తప్పకుండ సాయ ంకాలం పాలపిట్ట దర్శనమిస్తాయి. పాలపిట్ట జీవిత కాలం సుమారు 17 నుండి 20 సంవత్సరాలు వరకు ఉంటుంది. చెట్ల తొర్రల్ని గూళ్లుగా మలుచుకొని మూడు నుంచి ఐదు గుడ్ల వరకు పెడతాయి. గుడ్లను పొదగడంలో ఆడపక్షి , మగపక్షి రెండు బాధ్యత వహిస్తాయి. మన తెలుగు రాష్ట్రాలు కాకుండా హిందువులు అంతా కూడా గొప్పగా జరుపుకునే పండుగ దసరా. అయితే దసరా రోజు సాయంత్రం సమయంలో ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా పాలపిట్టని చూడాలని నియమం ఒకటి ఉంటుంది. దసరా రోజున పాలపిట్టను చూడడానికి తెలుగు ప్రజలు ఎంతో అదృష్టంగా శుభ సూచకంగా భావిస్తారు. దసరా రోజున పాలపిట్టను చూస్తే అంతా శుభమే జరుగుతుందని తెలుగు ప్రజల నమ్మకం. తెలుగు ప్రజలు చేపట్టిన ప్రతి పనిలో, నమ్మకంలో విజయం అవుతుందని ప్రజలు నమ్ముతారు. పశుపక్ష్యాదులను దైవ స్వరూపాలుగా భావించి పూజించడం భారతీయ సాంప్రదాయం. పాలపిట్ట దేవి స్వరూపమని నమ్మకం. అందువల్లే దసరా రోజున తెలుగు వారంతా పాలపిట్ట, జమ్మిచెట్టు ను  దర్శించుకోవాలని కోరుకుంటారు. అందుకే దసరా రోజున పాలపిట్టను చూడడానికి తెలుగు ప్రజలు అంత ప్రాధాన్యత ఇస్తున్నారు. తెలంగాణ ప్రజలు దసరా వచ్చిందంటే జమ్మి చెట్టుతో పాటు పాలపిట్టను తప్పకుండా చూడాల్సిందే అని అంటున్నారు.  ఇప్పుడున్న పరిస్థితుల్లో నిజానికి దసరా‘‘అంటే చుక్కా’’ముక్కా సంబురం అనేలా పరిస్థితులు రోజురోజుకు మారు తున్నాయి. ఇప్పటి తరంలో చాలా మందికి విజయదశమి విశిష్టత గురించి తెలి యదు..తెలుసుకోవాలన్న ఆసక్తి కూడా కనిపించడం లేదు. పాలపిట్టను మన తెలంగాణ రాష్ట్ర పక్షిగా గుర్తించి గౌరవం ఇచ్చుకున్నాము. తెలంగాణ రాష్ట్రమే కాదు. ఆంధ్రప్రదేశ్‌, ‌కర్ణాటక, ఒడిశా, బీహార్‌, ‌రాష్ట్రాలు కూడా పాలపిట్టను రాష్ట్ర పక్షిగా గుర్తించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌తెలుగు ప్రజలు ఆకాంక్షను గుర్తించి పాలపిట్టను మన రాష్ట్ర పక్షిగా, జమ్మిచెట్టును రాష్ట్ర వృక్షంగా గుర్తించడం తెలుగు ప్రజలకు శుభసూచకం. తెలుగు ప్రజలకు విజయదశమి (దసరా) పండుగ శుభాకాంక్షలు.

 

image.png

లాకవత్‌ ‌చిరంజీవి నాయక్‌

‌కాకతీయ యూనివర్సిటీ వరంగల్‌, 99630 40960

Leave a Reply