Take a fresh look at your lifestyle.

లాఠీకి వెరవని నిరసన! 50వ రోజుకు చేరుకున్న షాహీన్‌బాగ్‌ ఉద్యమం

Shaheenbaugh Movement reaching 50th day
షాహీన్‌బాగ్‌ ‌మైదానంలో శాంతియుతంగా నిరసనలు..

జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయానికి చెందిన ఇద్దరు విద్యార్ధినులు మొదలుపెట్టిన ఒక చిన్న నిరసన ఉద్యమం ఇప్పుడు దేశాన్ని కుదిపేస్తున్నది. దేశం అంతా ఉద్యమమై, ప్రజాఉద్యమై కాశ్మీర్‌ ‌నుంచి కన్యాకుమారి వరకు దేశప్రజలను కదిలించింది. చిన్నగా రాజుకున్న రాజ్యాంగ హక్కుల ఉద్యమం 50వ రోజుకు చేరుకున్నది.డిసెంబర్‌లో ఇద్దరు జామియా మిల్లియా ఇస్లామియా విద్యార్థులపై పోలీసులు పాశవిక దాడులు చేస్తుంటే ప్రపంచమంతా విస్తుపోయి చూసింది. పోలీసుల అమానుష, రాక్షసత్వానికి ఇద్దరు ముస్లిం విద్యార్ధినులు చూసి సహించలేకపోయారు. తోటి విద్యార్థులను రక్షించుకునేందుకు తమ శక్తినంతా ఉపయోగించారు. విద్యార్థులపై పోలీసులు లాఠీలు విరుగుతుంటే యునివర్శిటీ పక్కనే ఉన్న షాహీన్‌బాగ్‌ ‌ప్రజలు కోపోద్రిక్తులయ్చారు. అయినా ఉద్యమాన్ని శాంతియుత నిరసనోద్యమంగా తీర్చిదిద్దారు. ఇవాళ అఖండభారతంలో జరుగుతున్న హక్కుల ఉద్యమాలకు షాహీన్‌బాగ్‌ ‌కేంద్రబిందువయ్యింది. షాహీన్‌బాగ్‌ ‌మైదానంలో మొదట్లో ఇద్దరు ముగ్గురు మాత్రమే నినాదాలు చేశారు. ఆ ఇద్దరిని చెదరగొట్టడానికి పోలీసులకు పెద్దగా ఇబ్బంది కలుగలేదు. ఇద్దరు నలుగురయ్యారు. నలుగురు వందలు దాటాలు,.. వందలు వేలయ్యారు. హక్కుల ఉద్యమం మహోద్యమమైంది.పిల్లలు పెద్దలు, వృద్ధులు, రిటైర్ట్ ఉద్యోగులు షాహీన్‌బాగ్‌ ‌మైదానంలో నిరసనతెలుపడం తమ నిత్యకృత్యం చేసుకున్నారు.అదే ప్రదేశంలోని బస్టాండ్‌ను గ్రంథాలయంగా మార్చారు. .విద్యార్థులు, అధ్యాపకులు, రైతులు, ఉద్యోగులు, సమాజంలో అన్నీ వర్గాలు షాహీన్‌బాగ్‌ ‌ప్రజల నిరసనలకు సంఘీభావం చెబుతూ అండదం డలందిస్తున్నారు. చుట్టుపక్కల వ్యాపారస్తులు వారికి మంచినీళ్లు, బ్లాంకెట్లు, తినుబండారాలు సరఫరాచేస్తూ చేయూతనందిస్తున్నారు.

Shaheenbaugh Movement reaching 50th day1
(ఇన్‌సెట్లో బస్టాండ్‌లో లైబ్రెరీ ఏర్పాటు చేసిన విద్యార్థులు)

షాహీన్‌బాగ్‌ ‌ప్రాంత ప్రజలు ప్రారంభించిన శాంతియుత నిరసనలు ఇతర ప్రాంతాలకు విస్తరించకూడదని, దాన్ని విచ్ఛిన్నం చేయడానికి బీజేపీ నేతలు, మంతుల్రు రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తూ ఉన్మాదమూకలను నిరసనకారులమీదికి ఉసిగొల్పుతున్నారు.కానీ ఎన్ని ఆటంకాలు ఎదురైనా, శాంతియుత ప్రజాస్వామిక నిరసన కొనసాగుతూనే ఉంటుందని, రాజ్యాంగహక్కుల కోసం షాహీన్‌బాగ్‌ ‌నిలిచి పోరాడుతుందని నిరూపిస్తున్నారు.షాహీన్‌బాగ్‌‌ప్రాంతంలో ఇప్పుడు 5వేల మంది నిరసనకారులు భారతదేశ రాజ్యాంగ హక్కుల ్యమానికి స్పూర్తినిస్తున్నారు. మరోవైపున ఢిల్లీలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలపైన కూడా ఈ నిరసనద్యోమ ప్రభావం పడనుఉన్నదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బీజేపీ ఈ ఆందోళన కొనసాగాలని చూస్తున్నది. ఆందోళనవల్ల ప్రజలకు ఇబ్బందులు వస్తున్నాయని, ట్రాఫిక్‌కు అంతరాయమవుతున్నదని,ఆందోళనకారులపైన దాడులు చేయిస్తూ ఉద్యమలక్ష్యాలను నీరుకార్చే ప్రయత్నం చేస్తున్నది. కాగా కాంగ్రెస్‌, ఆప్‌ ‌పార్టీలు సీఏఏకు వ్యతిరేక నడుస్తున్న ఆందోళనలతో ఓటర్లను ప్రభావితం చేయాలని రాజకీయ ఎత్తుగడలను అల్లుకుంటున్నాయి. రాజ్యాంగ హక్కుల ఉద్యమంలో వామపక్ష ఉద్యమకారులు, ప్రతీపశక్తులు చేరుకుంటున్నాయి. చట్టసభలు, న్యాయవ్యవస్థ, కార్యనిర్వాహకవర్గం, మీడియా విఫలం కావడంతోనే ప్రజలు హక్కుల కోసం రోడ్లమీదికి వస్తున్నారని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

Leave a Reply